రైల్వే కార్మికుల హక్కుల సాధనకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

రైల్వే కార్మికుల హక్కుల సాధనకు పోరాటం

Published Tue, Nov 26 2024 12:35 AM | Last Updated on Tue, Nov 26 2024 12:35 AM

రైల్వే కార్మికుల హక్కుల సాధనకు పోరాటం

రైల్వే కార్మికుల హక్కుల సాధనకు పోరాటం

బెల్లంపల్లి: రైల్వే కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఏకై క సంఘం తమదేనని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ సికింద్రాబాద్‌ డివిజనల్‌ సెక్రెటరీ పి.రవీందర్‌ అన్నారు. సోమవారం బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో, రైల్వే విభాగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలం నుంచి రైల్వే కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయని తెలిపారు. వచ్చే నెల 4 ,5, 6వ తేదీల్లో జరిగే రైల్వే కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో రైల్వే కార్మికులు, ఉద్యోగులు తమ సంఘానికి ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రైల్వే కార్మికుల సమస్యలపై పోరాడుతున్న యూని యన్‌ను ఆదరించాలని కోరారు. రైల్వేను ప్రైవేట్‌ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర లను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పలువురు మజ్దూర్‌ యూనియన్‌లో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్‌ యూనియన్‌ జోనల్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు నవనీత్‌సింగ్‌, బెల్లంపల్లి బ్రాంచ్‌ చైర్మన్‌ నాగరాజు, సెకెట్రరీ జి.సాంబశివుడు, రామగుండం బ్రాంచ్‌ అసిస్టెంట్‌ సెక్రెటరీ అరవింద్‌, ట్రెజరర్‌ మోజెస్‌, కరీంనగర్‌ డెలిగేట్‌ పెద్ది శ్రీను, సందీప్‌, గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement