క్షుద్రపూజల పేరిట మోసం
● ఈజీగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించి.. ● రూ.2 లక్షలు వసూలు చేసిన వైనం.. ● నలుగురి అరెస్టు.. పరారీలో ముగ్గురు..
నస్పూర్: డబ్బులు ఈజీగా సంపాదించాలంటే ఇంట్లో క్షుద్రపూజలు చేయించాలని ఓ వ్యక్తిని అతని స్నేహితులు నమ్మించారు. పూజకు రూ.2 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. వారి మాటలు నమ్మిన వ్యక్తి రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. నస్పూర్ ఎస్సై సుగుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన మాదంశెట్టి ప్రభంజన్ కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితులు అయిన పట్టణానికి చెందిన రంజిత్, బాలకృష్ణకు చెప్పాడు. వారు క్షుద్రపూజ లు చేయిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, ఈజీగా డబ్బులు వస్తాయని తెలి పారు. మహారాష్ట్రలో దైవ శక్తులు ఉన్న పూజారి ఉన్నాడని తెలిపారు. పూజకు రూ.2 లక్షలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. వారి మాటలు నమ్మిన ప్రభంజన్ ఈనెల 24న రూ.2 లక్షలు తీసుకుని రాత్రి 11 గంటలకు నస్పూర్ పరిధిలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఐత సత్యనారాయణ ఇంటికి వెళ్లాడు. అక్క డ రంజిత్, బాలకృష్ణలతోపాటు శీతల్ దత్తాత్రేయ కొరివి ఝాదవ్ అనే పూజారి, నస్పూర్, సీతారాంపల్లికి చెందిన దెబ్బటి కిషన్, దంతెల ప్రభాకర్, జగిత్యాలకు చెందిన ఎరిసి ప్రశాంతి ఉన్నారు. అదేరోజు రాత్రి పూజలు ప్రారంభించారు. రాత్రి 2 గంటల సమయంలో పూజలపై ప్రభంజన్‌కు నమ్మకం కుదరకపోవడంతో ఇంటికి వెళ్లిపోతానని తెలిపా డు. దీంతో వారంతా అతడిని బెదిరించారు. దీంతో వారి నుంచి ఎలాగో తప్పించుకున్న ప్రభంజన్ సీసీసీ నస్పూర్ పోలీసులను ఆశ్రయించాడు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల రాకను గమనించిన ప్రభాకర్, రంజిత్, బాలకృష్ణ పారిపోయారు. శీతల్ కొరివి ఝాధవ్, దెబ్బటి కిషన్, ఐత సత్యనారాయణ, ఎరిసి ప్రశాంతిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి నలుగురిని రిమాండ్‌కు తరలించామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment