నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం | Sakshi
Sakshi News home page

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

Published Fri, May 24 2024 1:35 PM

-

నిజాంపేట(మెదక్‌): మండల కేంద్రంలో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మండల విద్యుత్‌ శాఖ ఏఈ గణేశ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేగుంట నుంచి వచ్చే 132/33కేవీ లైన్‌లోని మర్మమతుల దృష్ట్యా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్‌, నార్లాపూర్‌, కల్వకుంట సబ్‌స్టేషన్‌ పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.

చేగుంట మండల కేంద్రంలో..

చేగుంట(తూప్రాన్‌): మండల కేంద్రంలోని 132 కేవీ సబ్‌ స్టేషన్‌లో మరమ్మతుల కోసం శుక్రవారం విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్‌ శాఖ ఏఈ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ తెలిపారు. చేగుంటతో పాటు అనంతసాగర్‌, కర్నాల్‌పల్లి సబ్‌స్టేషన్‌ల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదు అన్నారు.

నేడు నార్సింగిలో ..

చిన్నశంకరంపేట(మెదక్‌): నార్సింగి మండల కేంద్రంతో పాటు సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ స్వామి తెలిపారు. చేగుంట మండల కేంద్రంలోని132 కేవీ విద్యుత్‌ కేంద్రంలో మరమ్మతులు ఉన్నందున నార్సింగి, జప్తిశివనూర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ సరాపరాను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి 12 వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.

తూప్రాన్‌ మండలంలో..

మండలంలోని ఇస్లాంపూర్‌, మల్కాపూర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నాం 12 వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పాడు తుందని విద్యుత్‌ ఏఈ వరహాలబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యుత్‌ తీగల కింద ఉన్న చెట్ల కొమ్మల కత్తిరింపుల కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్‌ ఏఈ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement