మాది చేతల ప్రభుత్వం
సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
తూప్రాన్: ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేస్తుందని, మాది మాటల ప్రభు త్వం కాదు.. చేతల ప్రభుత్వమని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొ నసాగుతున్నాయని చెప్పారు. రైతులు పండించిన ధా న్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుక ు నిత్యం కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్‌ను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని స్పష్టం చేశారు. గజ్వేల్ నుంచి మూడు దఫాలుగా కేసీఆర్‌ను గెలిపించినప్పటికీ ప్రజల సమస్యలు గుర్తించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోని నాయకుడు అవసరమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మెదక్ డీసీసీ అధ్య క్షుడు ఆంజనేయులుగౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ మామిళ్ల జ్యోతి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment