పకడ్బందీగా డేటా ఎంట్రీ
చిన్నశంకరంపేట(మెదక్): సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న డేటా ఎంట్రీని పరిశీలించి మా ట్లాడారు. సోమవారం నుంచి ఉపాధ్యాయులు సైతం ప్రక్రియలో పాలుపంచుకుంటారని తెలిపారు. ఈసందర్భంగా సర్వే ఫారాలు దాచిన ట్రంకు పెట్టెలను పరిశీలించారు. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించా రు. అంతకుముందు గవ్వలపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రికార్డును పరిశీలించారు. వెంటవెంటనే ధాన్యం తరలించి ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించారు. ఆమె వెంట తహసీల్దార్ మన్నన్, ఆర్‌ఐ రాజు ఉన్నారు.
16,657 కుటుంబాల
వివరాలు నమోదు
మెదక్‌జోన్: సమగ్ర కుటుంబ సర్వేను జిల్లావ్యాప్తంగా వందశాతం పూర్తి పూర్తి చేసినట్లు సీపీఓ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డేటా ఎంట్రీని ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభించగా.. ఇప్పటివరకు 16,657 కుటుంబాల వివరాలు ఆన్‌లైన్ చేసినట్లు తెలిపారు. కాగా జిల్లాలో 2,25,947 ఇళ్లను సర్వేలో ఎన్యుమరేటర్లు నమోదు చేసినట్లు చెప్పారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 100.07 శాతం నమోదు కాగా, అర్బన్‌లో 100.94 శాతం పూర్తి చేసినట్లు వివరించారు. మొత్తంగా జిల్లాలో 100.39 శాతం సమగ్ర కుటుంబ సర్వే జరిగిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సెలవు దినం ఆదివారం సైతం డేటా ఎంట్రీ ప్రక్రియను కొనసాగించినట్లు చెప్పారు.
కనీస వేతనాలు అమలు చేయాలి: సీఐటీయూ
వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటు పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. హమాలీలకు పెన్షన్ సౌకర్యం కల్పించడంతో పాటు తాపీ మేసీ్త్రలకు ప్రమాద బీమా వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి గౌరి తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 4న మహిళా
కబడ్డీ క్రీడాకారుల ఎంపిక
పాపన్నపేట(మెదక్): జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 4వ తేదీన సీనియర్ మహిళా కబడ్డీ క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పాపన్నపేటలో ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపికై న క్రీడాకారులు డిసెంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. పూర్తి వివరాలకు 9010735121 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేశ్, సభ్యులు పాల్గొన్నారు.
ప్రతీ గింజ కొంటాం
మనోహరాబాద్(తూప్రాన్): రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామ ని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దండుపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. సన్నరకం ధాన్యం సైతం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. సేకరించిన ధాన్యం వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు. ఆయన వెంట తూప్రాన్ పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, నవీన్‌చారి, రమేష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment