66,975 | - | Sakshi
Sakshi News home page

66,975

Published Mon, Nov 25 2024 7:44 AM | Last Updated on Mon, Nov 25 2024 7:44 AM

66,975

66,975

ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్సీ ముసాయిదా జాబితా విడుదల
● డిసెంబర్‌ 9వరకు అభ్యంతరాల స్వీకరణ ● 30న తుది జాబితా ప్రకటన ● ఉమ్మడి జిల్లాలో 71 మండలాలు, 102 పోలింగ్‌ స్టేషన్లు
సిద్దిపేట జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు అత్యధికం

జిల్లాల వారీగా పట్టభద్రులు

జిల్లా సీ్త్రలు పురుషులు మొత్తం

సంగారెడ్డి 6,331 13,670 20,001

మెదక్‌ 3,086 7,945 11,031

సిద్దిపేట 9,826 19,618 29,444

జిల్లాల వారీగా ఉపాధ్యాయులు

జిల్లా సీ్త్రలు పురుషులు మొత్తం

సంగారెడ్డి 1,075 1,421 2,496

మెదక్‌ 393 709 1,102

సిద్దిపేట 1,062 1,839 2,901

సంగారెడ్డి జోన్‌: ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. త్వరలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈ నెల 6 వరకు అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితా కసరత్తు కొనసాగుతోంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, జాబితాను సిద్ధం చేసి విడుదల చేశారు.

ఓటు నమోదుకు మరో అవకాశం

కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు మరోసారి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. డిసెంబర్‌ 9 వరకు అభ్యంతరాలతోపాటు దరఖాస్తులను స్వీకరించనున్నారు. నమోదుకు కల్పించిన అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డిసెంబరు 25వరకు అభ్యంతరాలను పరిశీలించి, అదే నెల 30న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 71 మండలాలు ఉండగా 102 పోలింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలో 28 మండలాలకు 40 పోలింగ్‌ స్టేషన్లు, మెదక్‌లో 21 మండలాలకు 22 పోలింగ్‌స్టేషన్లు, సిద్దిపేటలో 22 మండలాలకు 40 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఆయా జిల్లాలో సెప్టెంబర్‌ 30 నుంచి ఓటు నమోదుకు దరఖాస్తులు స్వీకరించగా 82,448 వచ్చాయి. వాటిని పరిశీలించి అందులోంచి 15,473 మందిని దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. మిగిలి 66,975 మంది ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితాను విడుదల చేశారు. కాగా ముసాయిదా ఓటర్‌ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు డిసెంబర్‌ 9 వరకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. విడుదలై ముసాయిదా ఓటర్‌ జాబితా ప్రకారం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సిద్దిపేటలో అత్యధికంగా 29,444 పట్టభద్రులు ఉండగా, ఉపాధ్యాయులలో సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 2,901గా ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మహిళలకంటే పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement