మెదక్‌జోన్: సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా వలస వెళ్లిన వారి వివరాలను ఫోన్ ద్వారా సేకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టర్ రాహుల్‌రాజ్ పాల్గొని జిల్లాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా డేటా ఎంట్రీ చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించగా.. ఇప్పటికే ఈ విషయంపై ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. జిల్లా నుంచి ఎంతమంది వలస వెళ్లారో, వారికి ప్రత్యేకంగా ఫోన్లు చేయించి సర్వే పూర్తి చేయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని, ఈ విషయంపై ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.
ఎన్‌ఎంఎంఎస్
పరీక్ష ప్రశాంతం
మెదక్ కలెక్టరేట్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయ గా,ఉదయం 9.30 గంటల నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు నిర్వహించారు. మొత్తం 1,008 విద్యార్థులకు గాను 979 మంది హాజరు అయినట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment