జిల్లాలో గడిచిన మూడేళ్లలో భారీవర్షాలతో 74 చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు దెబ్బతిన్నాయి. వాటిలో కొన్ని కట్టలు తెగిపోగా, మరికొన్నింటికి బుంగలు పడ్డాయి. ఇంకొన్ని కొట్టుకుపోయాయి. కాగా తాత్కాలిక మరమ్మతుల కోసం రూ. లక్ష లోపు వరకు అధికారులు అంచనా వేసి ఉన్నతాధికారులకు పంపగానే ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసింది. వీటితో సాగు నీటి వనరులకు వెంటనే మరమ్మతులు చేపట్టి సాగునీటి వృథాకు అడ్డుకట్ట వేశారు. ఫలితంగా ఆ నీటితో వేలాది ఎకరాల్లో రైతు లు సమృద్ధిగా పంటలు పండిస్తున్నారు. భారీ నష్టం జరిగి మరమ్మతులకు రూ. లక్ష పైన ఖర్చయ్యే పరిస్థితి ఉంటే అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. నిధులు మంజూరయ్యాక టెండర్ పిలి చి తక్కువకు కోడ్ చేసిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తారు. అయితే మరమ్మతులు జరిగే వరకు కొంత సమయం పడుతుంది. కానీ చిన్నపాటి మరమ్మతులు, రూ. లక్షలోపు ఖర్చు అవుతుందంటే వెంటనే ఎఫ్‌డీఆర్ పథకం కింద నిధులు మంజూరు చేసి పనులు చేపడుతున్నారు.
ఆయకట్టు భద్రం
సాగునీటి వనరుల మరమ్మతుల కోసం ఎఫ్‌డీఆర్ కింద రూ. 1,41,59,000 నిధులు మంజూరు కాగా, వెంటనే మరమ్మతులు పూర్తి చేశారు. ఫలితంగా 74 చెరువులు, కుంటల ఆయకట్టు కింద మూడేళ్లలో 2,190 ఎకరాలకు సాగునీటిని అందించారు. ఆ భూముల్లో పంటలు సమృద్ధిగా పండాయి. దీంతో ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సహాయంగా ఎఫ్‌డీఆర్ ఉండడంతో వెంటనే నిధులు విడుదల అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment