సత్వర పరిష్కారం చూపండి
మెదక్ కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించారు. వాటిని స్వీకరించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడా రు. ప్రజావాణి అర్జీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రతివారం వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి ప్రజలకు ఊరట కల్పించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. మొత్తం 34 అర్జీలు రాగా ధరణి 16, పింఛన్లు 3, ఉపాధి కోసం 2, ఇతర సమస్యలపై 13 వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, ఆయాశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్రాజ్
ప్రజావాణికి 34 వినతులు
Comments
Please login to add a commentAdd a comment