ఆహారం కోసం కొంగల విహారం
అక్రమ కేసులు ఎత్తివేయాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
సంగారెడ్డి టౌన్: లగచర్ల ఘటనలో అమాయకుల ను అరెస్టు చేశారని వారిపై కేసులను ఎత్తివేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం కందిలోని సెంట్రల్ జైలులో ఉన్న బాధితులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడా రు. ఘటన జరిగి పది రోజులు దాటినా ఇప్పటికే గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారని, లగచర్ల రొట్టిబండ తండాల్లో కమిషన్ బృందం పర్యటించిందని తెలిపారు. పోలీసులు అమాయకులపై దాడి చేసి అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి లగచర్ల కేసులో కేత్రస్థాయి నివేదిక ఇస్తామని, వారిని విడుదల చేయాలని కోరుతామని చెప్పారు. కలెక్టర్‌పై దాడి ఘటన దురదృష్టకరమని, కానీ అమాయకులను జైల్లో పెట్టారన్నారు. 41 సీఆర్పీ కింద అట్రాసిటీ కేసులో స్టేషన్ బెయిల్ ఇప్పిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment