కోలీవుడ్ స్టార్ అజిత్ బావమరిది, ప్రముఖ నటుడు రిచర్డ్ రిషి ప్రేమలో పడ్డాడు! తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసిన అతడు 45 ఏళ్ల వయసులో ప్రేమపాఠాలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ యషికా ఆనంద్‌తో సన్నిహితంగా కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రిచర్డ్. ఆ సూర్యుడు మమ్మల్ని ముద్దాడుతున్నాడంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చాడు. ఇందులో యషికా రిచర్డ్ చెంపకు ముద్దు పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది.
22 ఏళ్ల ఏజ్ గ్యాప్
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు త్వరలోనే యషికా అజిత్ కుటుంబంలో చేరనుందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే వీరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువే ఉంది. రిచర్డ్ వయసు 45 కాగా యషికా వయసు కేవలం 23 ఏళ్లే! అంటే వారిద్దరి మధ్య 22 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. దీంతో మీరిద్దరూ తండ్రీకూళ్లులా కనిపిస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇది నిజమైన ప్రేమా? లేదంటే ఏదైనా సినిమా స్టంటా? అని కూడా అనుమానిస్తున్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్
రిచర్డ్ రిషి సినిమాల విషయానికి వస్తే అతడు జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజలి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత తెలుగు, తమిళంలో బోలెడన్ని సినిమాలు చేశాడు. ఎందుకంటే ప్రేమంట చిత్రంలో విలన్‌గానూ నటించాడు. అతడు చివరగా పరంపాదం విలయట్టు, రుద్ర తాండవం సినిమాలు చేశాడు. తెలుగులో చివరగా ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి చిత్రంలో కనిపించాడు.
కార్ యాక్సిడెంట్‌తో బెడ్‌కే పరిమితం
యషికా విషయానికి వస్తే.. కావలై వేండామ్ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది. తర్వాత కొన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొనడంతో వచ్చింది. కొద్ది నెలల క్రితంలో ఆమె కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే! ఆ సమయంలో యషికా క్లోజ్ ఫ్రెండ్ భవానీ తీవ్రగాయాలతో మరణించింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన యషికా చాలాకాలం బెడ్‌కే పరిమితమైంది. ఈ మధ్యే కోలుకుని తిరిగి సినిమాలపై ఫోకస్ పెంచింది.
చదవండి: శర్వానంద్ పెళ్లి సందడి షురూ.. జైపూర్ ప్యాలెస్‌లో ఘనంగా..
Comments
Please login to add a commentAdd a comment