విష్ణుప్రియ.. ఒక్కోసారి ఏది పడితే అది మాట్లాడుతుంది. కారణం.. తన బుర్రకు నత్తి అని చెప్తుంది. టాస్కులు ఎందుకు ఆడవంటే.. ఆడాలనిపించినప్పుడే ఆడతానంటుంది. తనవల్ల కాదనుకుంటే ఆడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కేవలం పృథ్వీ వెనక పడటం తప్ప నీ ఆట ఏముంది? అని వైల్డ్‌కార్డులు ముఖం పట్టుకుని నిలదీసినా తనలో రవ్వంత మార్పు రాలేదు.
ప్రేమ మైకంలో విష్ణు
నేను నాలాగే ఉంటాను.. ఎవరికోసమూ నా స్వభావాన్ని, పద్ధతిని మార్చుకోనని చేతల్లో నిరూపించింది. పృథ్వీ బాహుబలిలా టాస్కులు ఆడుతుంటే ఈమె చీర్‌గర్ల్‌లా కమాన్ పృథ్వీ అంటూ ఎంకరేజ్ చేస్తుంది. అతడు గెలిస్తే ఉప్పొంగిపోతుంది. నామినేషన్స్‌లో ఉంటే సేవ్ అవ్వాలని దేవుళ్లకు మొక్కుతుంది. అతడు తాగిన టీ కప్పులు కడగటం దగ్గరి నుంచి కాలికి మసాజ్ చేయడం వరకు అన్నీ చేస్తుంది.
మెగా చీఫ్
బిగ్‌బాస్ గేమ్ కంటే కూడా పృథ్వీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ఈమె ఈ వారం మెగా చీఫ్ అయిపోయింది. నిజానికి ఇది విష్ణు కూడా ఊహించి ఉండకపోవచ్చు. చీఫ్ కంటెండర్లు కావడానికి భీకరమైన ఫిజికల్ టాస్కులు ఇచ్చాడు బిగ్‌బాస్. అలా పృథ్వీ, నిఖిల్, రోహిణి, ప్రేరణ కంటెండర్లు అయ్యారు. ఈ నలుగురికీ ఏదైనా టఫ్ టాస్క్ ఇస్తాడనుకుంటే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
విష్ణుప్రియకు పట్టం
వీళ్లలో మెగా చీఫ్ అయ్యేందుకు అనర్హులని భావించిన వారి మెడలో దండ వేసి రేసు నుంచి తీసేయాలన్నాడు. ఇంకేముంది.. హౌస్‌మేట్స్ నచ్చనివారిని తీసుకుంటూ పోయారు. అలా పృథ్వీ, ప్రేరణ బలైపోయారు. ఆశ్చర్యంగా చివర్లో నిఖిల్, విష్ణుప్రియ మిగిలారు. ఇంతవరకు చీఫ్ అవలేదని విష్ణుప్రియకు పట్టం కట్టారు! దీంతో విష్ణు వచ్చేవారం నామినేషన్ నుంచి తప్పించుకుది.
Comments
Please login to add a commentAdd a comment