నెల్లూరి నెరజాణ.. నీ కుంకుమల్లే మారిపోనా.. పాటలో అందచందాలతో, మైమరపించే ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టింది మనీషా కొయిరాలా. హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈ హీరోయిన్‌కు తాగుడు అలవాటు ఉండేది. దీనికి తోడు ఆరునెలలకే పెళ్లి పెటాకులు కావడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దాన్నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో అండాశయ క్యాన్సర్ బారిన పడింది. అయినా అన్నింటికీ అధిగమించి నిలబడింది. ఇటీవలే హీరామండి సిరీస్‌లో మల్లికా జాన్‌గా ఆకట్టుకుంది.
కూల్ డ్రింక్‌లో వోడ్కా
తాజాగా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 1991లో సౌధాగర్ మూవీ చేస్తున్న సమయంలో కోక్‌లో వోడ్కా కలుపుకుని తాగేదాన్ని. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నాకు సలహా ఇచ్చారు. హీరోయిన్లు ఎవరూ కూడా ఆల్కహాల్ సేవిస్తున్నట్లు బయటకు చెప్పకూడదన్నారు. సరేనని నేను కూడా మా అమ్మతో నేను కూల్‌డ్రింక్ తాగుతున్నానని చెప్పాను. కానీ అందులో వోడ్కా కలిపానని తనకూ తెలుసు.
అబద్ధాలు చెప్పొద్దు
నువ్వు వోడ్కా తాగితే అదే బయటకు చెప్పు. అంతేకానీ కోక్ తాగుతున్నానంటూ అబద్ధాలు మాట్లాడకు. ఇలాంటి చిన్నచిన్నవాటి కోసం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పింది. అందుకే నేను మందు తాగినా, ప్రేమలో ఉన్నా అన్నీ ఒప్పేసుకునేదాన్ని.. నేనే ఓపెన్‌గా చెప్పేదాన్ని. ఆ కాలంలో హీరోలకు ఎందరో గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారు. హీరోయిన్లు మాత్రం మమ్మల్ని ఎవరూ తాకలేదు అన్నట్లు ప్రవర్తించేవారు.
ఏవీ నా ప్రొఫెషన్‌కు అడ్డు రాలేదు
నేను ముక్కుసూటిగా ఉండటం వల్ల విమర్శల్ని ఎదుర్కొన్నాను. పైగా తాగుడు అలవాటున్నా, బాయ్‌ఫ్రెండ్ ఉన్నా అవి నా ప్రొఫెషన్ అడ్డు రాకుండా చూసుకునేదాన్ని. నా పనిని ప్రేమించేదాన్ని అని చెప్పుకొచ్చింది. కాగా మనీషా కొయిరాలా ఫెరి భెటావుల అనే నేపాలీ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. సౌధాగర్ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది.
చదవండి: ఓటీటీలో రియల్‌స్టోరీతో సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Comments
Please login to add a commentAdd a comment