manisha koirala
-
హీరోల వయసు గురించి ఎందుకు మాట్లాడరో?
చిత్ర పరిశ్రమలో వయసనేది పెద్ద సమస్యే కాదని నటి మనీషా కొయిరాలా(Manisha Koirala) అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ– ‘‘చిత్ర పరిశ్రమలోని సీనియర్ నటీమణులకు ముఖ్యమైన పాత్రలు చేసే అవకాశం ఇవ్వాలి. వయసు, వృద్ధాప్యం అనేది సినిమా ఇండస్ట్రీలో పెద్ద సమస్య కాదు. కానీ, ఇది పరిష్కరించాల్సిన సామాజిక సమస్య.ఎందుకంటే చిత్ర పరిశ్రమలో హీరోల వయసు గురించి ఎవరూ మాట్లాడరు. హీరోల ఏజ్‌పై కామెంట్స్ చేయడం నేనిప్పటి వరకూ వినలేదు. ఏజ్ విషయంలో కేవలం నటీమణులను మాత్రమే ఎందుకు ట్రోల్ చేస్తారో అర్థం కావడం లేదు. సీనియర్లకు తల్లి పాత్రలో లేక సోదరి పాత్రలో ఇద్దామనుకుంటున్నారు. మహిళలు ఎలాంటి పాత్రలైనా చేయగలరు. యాక్షన్ పాత్రలని కూడా సులభంగా చేయగలరు.గతంలో ఎంతో మంది సీనియర్ నటీమణులు ఈ విషయాన్ని నిరూపించారు. నేను కూడా ఇప్పటికీ ఎలాంటి పాత్ర అయినా సవాల్‌గా స్వీకరిస్తాను. కొత్త పాత్రలు చేసి నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే. యాభై సంవత్సరాలు దాటినా మంచి జీవితాన్ని గడపగలం. అసలు వయసనేది సమస్య కాదని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఈ విషయంలో భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలవాలి. నేను జీవించి ఉన్నంత వరకు ఆరోగ్యంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలనుకుంటున్నా.. ఇదే ఆశయంతో జీవిస్తున్నాను’’ అన్నారు. -
సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతిలకు అవార్డ్స్ (ఫోటోలు)
-
ఆరు నెలల పోరాటం.. చనిపోవడం ఖాయం అనుకున్నా: హీరామండి నటి
బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా తెలుగువారికి సైతం సుపరిచితమే. చివరిసారిగా హీరామండి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గతంలో మనీషా కొయిరాలా క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనీషా క్యాన్సర్ చికిత్స రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను భరించలేని బాధను అనుభవించినట్లు తెలిపారు. చికిత్స తీసుకునే సమయంల తాను చనిపోతానని భావించినట్లు వెల్లడించింది. కొన్ని నెలల పాటు అమెరికాలో శస్త్రచికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నారు. తన తల్లి నేపాల్ నుంచి రుద్రాక్షను తీసుకొచ్చి వైద్యునికి ఇచ్చిందని మనీషా చెప్పుకొచ్చింది. కాగా.. మనీషా కొయిరాలా 2012లో అండాశయ క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు.మనీషా మాట్లాడుతూ..'2012లో నాకు క్యాన్సర్ నిర్ధారణ జరిగింది. ఆ సమయంలో నేను చాలా భయపడ్డాను. నేను వైద్యులతో మాట్లాడినప్పుడు చనిపోతానని భావించా. ఇక లైఫ్‌కు ముగిసినట్లే అనిపించింది. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నా. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ సమయంలో భరించలేని బాధ, నొప్పి అనుభవించా. ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. చివరి స్టేజ్‌లో ఉందని తెలిసింది. న్యూయార్క్‌లో ఉన్న గొప్ప వైద్యులు నాకు చికిత్స అందించారు. దాదాపు 11 గంటలు ఆపరేషన్ చేశారు. కీమో థెరపీ గురించి నా కుటుంబానికి కూడా వైద్యులు వివరించారు. వైద్యం కొనసాగుతున్న సమయంలో అమ్మ నాకోసం ఎన్నో పూజలు చేసింది. ఆమె ధైర్యంతోనే నేను ఆ మహమ్మారిని జయించాను. ఈ జీవితం నాకు దేవుడిచ్చిన పునర్జన్మ' అని అన్నారు. -
‘ఈ క్షణంలో జీవించటం నేర్చుకో’.. ! మనీషాకు యువరాణి రాసిన మందు చీటీ
మందు మనిషి మీద పనిచేస్తే, మాట మనసు మీద పనిచేస్తుంది. ’మందు చీటీ’ వంటిదే ఒక మంచి మాట. చికిత్స తీసుకుంటున్నప్పుడు.. ‘నీకు తప్పక నయం అవుతుంది‘ అనే మాట ఎలాగైతే దివ్యౌషధంలా మనసుపై పని చేస్తుందో, కోలుకుని తిరిగి వచ్చాక ‘వెల్డన్ ఛాంపియన్‘ అనే మాట కూడా గొప్ప సత్తువను, ఉత్సాహాన్ని ఇస్తుంది.వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ నుంచి మనీషా కోయిరాలాకు ఇటీవల ఒక ఉత్తరం వచ్చింది! ‘కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారిలో మీరూ ఒకరని నాకు తెలిసింది. చాలా సంతోషంగా అనిపించింది. తిరిగి మీరు మునుపటిలా మీ ప్రొఫెషన్ ని కొనసాగించటం, చారిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనటం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుంది..‘ అని ఆ ఉత్తరంలో రాశారు కేట్. యువరాణి కేట్ మిడిల్టన్ కూడా కేన్సర్ నుంచి బయట పడినవారే! ప్రివెంటివ్ కీమోథెరపీతో ఆమె ఈ ఏడాదే కేన్సర్‌ను జయించారు.యువరాణి రాసిన ఉత్తరం మనీషాకు తన జీవిత లక్ష్యాలలో మరింతగా ముందుకు సాగేందుకు అవసరమైన మానసిక బలాన్ని ఇచ్చింది. ‘నేను ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారు నాకు ధైర్యాన్ని ఇస్తూ మాట్లాడ్డం నన్ను త్వరగా కోలుకునేలా చేసింది. ఈ విషయంలో (క్రికెటర్) యువరాజ్ సింగ్ కి, (నటి) లీసా రే కి నేను కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్లలాగే ఇతరులకు ధైర్యం చెప్పటం, నయం అవుతుందని నమ్మకం ఇవ్వటం ఇక పై నా వంతు... ‘ అంటున్నారు మనీషా.నాల్గవ స్టేజ్‌లో ఉండగా 2012 లో మనీషా లో ఒవేరియన్ కేన్సర్ ను గుర్తించారు వైద్యులు. ఐదేళ్ల చికిత్స తర్వాత 2017 లో మనీషా కేన్సర్ నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచీ ఇండియా, నేపాల్ దేశాలలో కేన్సర్ కేర్ కోసం పని చేస్తున్నారు. ‘యువరాణి వంటి ఒక గొప్ప వ్యక్తి నాకు వ్యక్తిగతంగా ఇలా లేఖ రాయటం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేన్సర్ బాధితుల కోసం నేను చేస్తున్న పనికి మరింతగా శక్తిని ఇచ్చింది‘ అంటున్న మనీషా, కేన్సర్ తనకొక పెద్ద టీచర్ అని చెబుతున్నారు.‘కేన్సర్ నన్నెంతగా బాధించినప్పటికీ ఎంతో విలువైన జీవిత పాఠాలను కూడా నేర్పింది. ’ఆశను కోల్పోకు, మంచి జరుగుతుందని నమ్ము. ఈ క్షణంలో జీవించటం నేర్చుకో. నీకు సంతోషాన్నిచ్చేవి ఏవో కనిపెట్టు..’ అని ఆ టీచర్ నాకు చెప్పింది..‘ అంటారు మనీషా.. కేన్సర్ గురించి. -
అలాంటి డ్రెస్ వేసుకుంటే పెద్ద స్టార్ అవుతానన్నాడు: హీరామండి నటి
ఇటీవల హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను ఆకట్టుకున్న బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా. 1990ల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండిలో కనిపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనీషా తన కెరీర్లో ఎదురైన పలు సంఘటలను గుర్తు చేసుకుంది. 90వ దశకంలో బాలీవుడ్లో మహిళా నటులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించింది. ఒక ఫోటోగ్రాఫర్‌తో తనకెదురైన చేదు అనుభవాన్ని వివరించింది.మనీషా మాట్లాడుతూ.. 'నా కెరీర్లో ప్రారంభంలో నన్ను చాలామంది ఫోటోషూట్లు అడిగేవారు. ఒకసారి నేను అమ్మతో కలిసి ఫోటోషూట్‌కు వెళ్లాను. అక్కడే ప్రముఖ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు. అతను నువ్వే తర్వాతి సూపర్‌స్టార్ అని నాతో అన్నాడు. ఆ తర్వాత అతను నా దగ్గరకు రెండు పీసుల బికినీ తెచ్చి ధరించమని అడిగాడు. అప్పుడు నేను బీచ్‌కి వెళ్లినప్పుడు, ఈత కొట్టేటప్పుడు మాత్రమే ఇది వేసుకుంటాను. కానీ ఇలాంటి వాటితో సినిమాల్లోకి రావాలనుకోవడం నాకు ఇష్టం లేదు. దీంతో బికినీ ధరించను అని చెప్పా. పూర్తి దుస్తులతోనే ఫోటోలు తీయమని సూచించా. ఆ తర్వాత అతను నాకు ఓ డైలాగ్ చెప్పాడు. నేను పెద్దస్టార్ అయ్యాక తానే నా ఫోటోలు తీసేందుకు వచ్చాడు' అని వెల్లడించారు.కాగా.. మనీషా మొదట నేపాలీ చిత్రం ఫెరి భేతౌలాతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సౌదాగర్ (1991) మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనంతరం ధన్వన్ , 1942: ఎ లవ్ స్టోరీ, బాంబే , అగ్ని సాక్షి , గుప్త, ది హిడెన్ ట్రూత్, దిల్ సే లాంటి చిత్రాలలో నటించింది. అయితే కొన్నేళ్ల పాటు పరిశ్రమకు దూరంగా ఉన్న మనీషా లస్ట్ స్టోరీస్ (2018)తో రీ ఎంట్రీ ఇచ్చింది. గతేడాది విడుదలైన షెహజాదా (2023) చిత్రంలో కనిపించింది. -
సెలబ్రిటీలకు తాగుడు, డేటింగ్ అలవాట్లు.. అన్నీ దాచిపెట్టేవారు: హీరోయిన్
నెల్లూరి నెరజాణ.. నీ కుంకుమల్లే మారిపోనా.. పాటలో అందచందాలతో, మైమరపించే ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టింది మనీషా కొయిరాలా. హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈ హీరోయిన్‌కు తాగుడు అలవాటు ఉండేది. దీనికి తోడు ఆరునెలలకే పెళ్లి పెటాకులు కావడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. దాన్నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో అండాశయ క్యాన్సర్ బారిన పడింది. అయినా అన్నింటికీ అధిగమించి నిలబడింది. ఇటీవలే హీరామండి సిరీస్‌లో మల్లికా జాన్‌గా ఆకట్టుకుంది.కూల్ డ్రింక్‌లో వోడ్కాతాజాగా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 1991లో సౌధాగర్ మూవీ చేస్తున్న సమయంలో కోక్‌లో వోడ్కా కలుపుకుని తాగేదాన్ని. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నాకు సలహా ఇచ్చారు. హీరోయిన్లు ఎవరూ కూడా ఆల్కహాల్ సేవిస్తున్నట్లు బయటకు చెప్పకూడదన్నారు. సరేనని నేను కూడా మా అమ్మతో నేను కూల్‌డ్రింక్ తాగుతున్నానని చెప్పాను. కానీ అందులో వోడ్కా కలిపానని తనకూ తెలుసు.అబద్ధాలు చెప్పొద్దునువ్వు వోడ్కా తాగితే అదే బయటకు చెప్పు. అంతేకానీ కోక్ తాగుతున్నానంటూ అబద్ధాలు మాట్లాడకు. ఇలాంటి చిన్నచిన్నవాటి కోసం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పింది. అందుకే నేను మందు తాగినా, ప్రేమలో ఉన్నా అన్నీ ఒప్పేసుకునేదాన్ని.. నేనే ఓపెన్‌గా చెప్పేదాన్ని. ఆ కాలంలో హీరోలకు ఎందరో గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారు. హీరోయిన్లు మాత్రం మమ్మల్ని ఎవరూ తాకలేదు అన్నట్లు ప్రవర్తించేవారు. ఏవీ నా ప్రొఫెషన్‌కు అడ్డు రాలేదునేను ముక్కుసూటిగా ఉండటం వల్ల విమర్శల్ని ఎదుర్కొన్నాను. పైగా తాగుడు అలవాటున్నా, బాయ్‌ఫ్రెండ్ ఉన్నా అవి నా ప్రొఫెషన్ అడ్డు రాకుండా చూసుకునేదాన్ని. నా పనిని ప్రేమించేదాన్ని అని చెప్పుకొచ్చింది. కాగా మనీషా కొయిరాలా ఫెరి భెటావుల అనే నేపాలీ చిత్రంతో హీరోయిన్గా మారింది. సౌధాగర్ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్గా వెలుగొందింది.చదవండి: ఓటీటీలో రియల్‌స్టోరీతో సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ -
ఇండియన్ –2లో మనీషా కొయిరాలా.. ఈ సీక్రెట్ ఏంటి..?
నటి మనీషా కొయిరాలా నేపాల్ మాజీ ప్రధాన మంత్రి బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా మనవరాలు. నే పాలీ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తరువాత హిందీ, తమిళం, తెలుగు, ఆంగ్లం భాషల్లో నటించి పా పులర్ అయ్యారు. ముఖ్యంగా తమిళంలో ఇండియన్, బొంబాయి, బాబా వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా రాణించారు. కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఏఎం.రత్నం నిర్మించిన చిత్రం ఇండియన్. కమలహాసన్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన అందులో తండ్రి సరసన నటి సుకన్య నటించగా, కొడుకుకు జంటగా నటి మనీషాకొయిరాలా, ఊర్మిళా నటించారు. కాగా 1996లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా 28 ఏళ్ల తరువాత ఇప్పుడు ఇండియన్ చిత్రానికి సీక్వెల్ రూపొంది జూలై 12వ తేదీన తెరపైకి రానుంది. ఇందులో కమలహాసన్ సేనాపతిగా నటించగా, సిద్ధార్ధ్, నటి కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్ తదితరులు నటించారు. అయితే ఇందులో నటి మనీషా కోయిరాలా నటించిన విషయాన్ని రహస్యంగా ఉంచడం విశేషం. కాగా ఇటీవల ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో నటి మనీషాకోయిరాలా ఫొటో చోటుచేసుకుని ఉండడంతో ఈమె కూడా ఇండియన్ –2 చిత్రంలో నటించిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ చిత్రంలో 53 ఏళ్ల మనీషాకొయిరాలా ఎలాంటి పాత్రలో కనిపించనున్నారన్నదే ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఆ మధ్య క్యాన్సర్ వ్యాధికి గురైన ఈమె దానితో పోరాడి గెలిచిన విషయం తెలిసిందే. మనీషాకొయిరాలా చివరిగా తమిళంలో ధనుష్ కథానాయకుడిగా నటించిన మాప్పిళై చిత్రంలో ఆయనకు అత్తగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రానికి ఇది రీమేక్‌గా 2011లో విడుదలైంది. హీరామండి వెబ్ సీరిస్‌లో మనీషా నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. -
12 మందితో ఎఫైర్స్.. ఆ ఒక్క తప్పుతో కెరీర్ క్లోజ్.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే?
1991లో సుభాష్ ఘాయ్ 'సౌదాగర్' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, జాకీ ష్రాఫ్, సన్నీ డియోల్, గోవిందతో లాంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేసింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఎంత త్వరగా అయితే ఫేమ్ తెచ్చుకుందో.. అంతే వేగంగా కెరీర్ నాశనం చేసుకుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ తెలుసుకోవాలనుందా? అయితే ఓ లుక్కేయండి.కెరీర్ నాశనం.. 1990వ దశకంలో సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ మనీషా కొయిరాలా.'గుప్త్', 'దిల్ సే', 'కచ్చే ధాగే' 'మన్'లాంటి కమర్షియల్ హిట్స్ సాధించింది. తక్కువ కాలంలోనే భారీ హిట్ సినిమాలు రావడంతో ఒక్కసారిగా బాలీవుడ్లో ఆమె పేరు మార్మోగిపోయింది. అయితే ఆ తర్వాత తన చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంది. మద్యానికి బానిసై తన అవకాశాలను దెబ్బతీసుకుంది. మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలు కావడంతో కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. కొద్ది కాలంలోనే ఆమె 50 చిత్రాలు ఫ్లాఫ్గా నిలిచాయి. అంతే కాకుండా 2012లో మనీషాకు క్యాన్సర్ రావడం ఆమెను కోలుకోలేని దెబ్బతీసింది. దాదాపు పదేళ్ల పాటు ఆ మహమ్మారితో పోరాడింది.పలువురితో ఎఫైర్స్మనీషా తన నటనా జీవితంలో రిలేషన్ పరంగా కూడా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొదట ఆమె 'సౌదాగర్'లో హీరో వివేక్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత నానా పటేకర్, డీజే హుస్సేన్ లాంటి వారితో ఎఫైర్‌తో వార్తల్లో నిలిచింది. అంతే కాకుంజా సెసిల్ ఆంథోనీ, ప్రశాంత్ చౌదరి, ఆస్ట్రేలియా రాయబారి క్రిస్పిన్ కాన్రాయ్, అజీజ్ ప్రేమ్‌జీ కుమారుడు తారిక్ ప్రేమ్‌జీ, రాజీవ్ ముల్చందానీ, సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డెరిస్ ఇలా దాదాపు 12 మంది వ్యక్తులతో సంబంధాలు కొనసాగించినట్లు రూమర్స్ వచ్చాయి. కానీ చివరికీ మనీషా కొయిరాలా కూడా నేపాల్‌కు చెందిన సామ్రాట్ దహల్‌ను 2010లో వివాహం చేసుకుంది. వీరికి పెళ్లయిన రెండేళ్లకే విడిపోయారు. సినీ జీవితంతో పాటు నిజ జీవితంలో ఇబ్బందులు పడిన మనీషా ఇటీవల ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చింది.సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ విశేష అదరణ దక్కించుకుంది. -
సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' సీజన్-2 ప్రకటన
'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించింది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపింది. తెలుగులో కూడా అందుబాటులో ఉండటంతో ఇక్కడ కూడా మంచి ఆధరణే లభించింది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్‌కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. త్వరలో రెండో సీజన్ కూడా విడుదల కానుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు.బాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడంతో ప్రేక్షకులు కూడా హీరామండి పట్ల పెట్టుకున్న భారీ అంచనాలను ఆయన నిజం చేశారు. ఇందులో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి,షర్మిన్ సెగల్,సంజీదా షేక్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించి మెప్పించారు. ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను తన సొంత నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్‌తో భన్సాలీ నిర్మించాడు. అయితే, 'హీరామండి: ది డైమండ్ బజార్' సీజన్-1 సూపర్ హిట్ కావడంతో తాజాగా సీజన్ -2 ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలో విడుదల చేస్తామని సోషల్ మీడియా ద్వారా నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
కమల్‌హాసన్- దర్శకుడు శంకర్ కాంబినేషన్లో విడుదలైన భారతీయుడు సినిమా సౌత్ ఇండియాలో భారీ హిట్‌ను అందుకుంది. 1996లో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డ్స్ క్రియేట్ చేసి ఇప్పటికీ భారతీయుడు వారిద్దరి కెరియర్లో చాలా ప్రత్యేకం. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా, సుకన్య, కౌందమణి, సెంథిల్ తదితరులు నటించారు. అయితే ఈ సినిమా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 1996లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన 'భారతీయుడు' చిత్రంలో సేనాపతి పాత్రలో కమల్ దుమ్మురేపాడు. ఆ పాత్రలో ఆయన చూపిన ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకోవడం చట్ట విరుద్ధం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఎప్పటికీ మరిచిపోలేము. అయితే, భారతీయుడు చిత్రాన్ని జూన్ 7న తెలుగు,తమిళంలో రీ-రిలీజ్ చేస్తున్నారు. నేడు ట్రైలర్ కూడా విడుదల కానుంది. 'భారతీయుడు'కు కొనసాగింపుగా ఇండియన్-2 కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 12న ప్రేక్షకుల ముందుకు ఇండియన్2 రానుంది. దీంతో తొలి భాగం అయిన భారతీయుడు చిత్రాన్ని రీ-రిలీజ్ చేయడంతో కమల్ అభిమానులను ఉత్సాహంగా ఉన్నారు.Get ready to re-live the blockbuster experience once again! 🤩#Bharateeyudu - 1 Re-Release Trailer Out TOMORROW, Stay Tuned!!💥Releasing worldwide in Telugu & Tamil on June 7th at theatres near you! 🔥@ikamalhaasan @shankarshanmugh @arrahman @mkoirala @UrmilaMatondkar… pic.twitter.com/wC36I7saE6— AM Rathnam (@AMRathnamOfl) May 26, 2024 -
మనిషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా!
ఓటీటీలో ‘హీరామండి’ వెబ్ సిరీస్ దూసుకెళ్తోంది. ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ గురించే చర్చిస్తున్నారు. వేశ్యల జీవితాల ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. మే 1 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. లాహోర్‌లోని హీరామండిలో ఉండే వేశ్యల జీవితాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించాడు భన్సాలీ. (చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ)మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్ధా, సంజీదా షేక్ కీలక పాత్రలు పోషించారు. రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్‌కి ఓటీటీ ప్రేక్షకులను అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఫరీదాన్ పాత్రలో సోనాక్షి సిన్హా అద్భుతంగా నటించింది.మనీషా కొయిరాల, సోనాక్షి మధ్య వచ్చే సన్నివేశాలు వెబ్ సిరీస్‌కే హైలెట్. కొన్ని సీన్లలో మనిషాతో సోనాక్షి దురుసుగా ప్రవర్తిస్తుంది. తాజాగా సోనాక్షి ఆ సీన్ల గురించి మాట్లాడుతూ.. మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పింది. ‘నాకు మనీషా అంటే చాలా ఇష్టం. హీరామండి వెబ్ సిరీస్ మొత్తం చూశాక ఆమెకు సారీ చెప్పాను. కొన్ని సీన్లలో ఆమెతో దురుసుగా ప్రవర్తించాను. సిరీస్ చూశాక..నేను అలా ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే మనీషాకు క్షమాపణలు చెప్పాను. ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. మమ్మల్ని ఎంతో ప్రోత్సహించింది. షూటింగ్ మొత్తం సరదాగా గడిపాం. అవకాశం వస్తే మళ్లీ ఆమెతో కలిసి నటించాలని ఉంది’ అని అన్నారు. ఇక భన్సాలి గురించి మాట్లాడుతూ..‘ఆయన సినిమాలో నటించేవారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సీన్ షూటింగ్‌కి ముందే అన్ని విషయాలు చర్చిస్తారు. ఆయన నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. హీరామండి లాంటి వెబ్ సిరీస్‌లో ఇంతగొప్ప పాత్ర ఇచ్చినందుకు భన్సాలిగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’అని సోనాక్షి చెప్పారు. -
భయంకరమైన వ్యాధి.. అందరూ నన్ను దూరం పెట్టారు: హీరోయిన్
క్రిమినల్ మూవీతో తెలుగువారికి పరిచయమైంది మనీషా కొయిరాలా. ఒకే ఒక్కడు సినిమాలోని నెల్లూరి నెరజాణ.. పాటతో ప్రేక్షకులు విపరీతంగా నచ్చేసింది. తెలుగులో కన్నా బాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా రాణించింది. కెరీర్ టాప్‌లో ఉన్న సమయంలో నేపాల్‌కు చెందిన సామ్రాట్ దహల్‌ను పెళ్లాడింది. పెళ్లయిన ఆరునెలలకే ఈ బంధం కొనసాగదని అర్థమైంది. ప్రేమంచిన భర్తే శత్రువుగా మారడంతో విడాకులు తీసుకోక తప్పలేదు.తాగుడుకు బానిసఅప్పటికే బిజీ సినిమా షెడ్యూల్స్ వల్ల ఒత్తిడికి లోనై తాగుడుకు బానిసైంది. దీనికి తోడు విడాకులు తీసుకోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఈ బాధలు చాలదన్నట్లు 2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడింది. అప్పటిదాకా తనతో కలిసిమెలిసి ఉన్న స్నేహితులు సైతం తమకు సంబంధం లేదన్నట్లు వదిలి వెళ్లిపోయారట.ఒంటరిగా..'జనాలకు ఎవరి బాధనూ పంచుకోవడం ఇష్టముండదు. కష్టాల్లో ఉన్నారనగానే వారిని ఒంటరిగా వదిలేసి పోతారు. స్నేహితులే కాదు నా బంధువులు కూడా ఎవరూ నాకు అండగా నిలబడలేదు. నేనెలా ఉన్నాను? ఏంటనేది కూడా పట్టించుకోలేదు. నా పేరెంట్స్, సోదరుడు-వదిన.. వీళ్లు మాత్రమే సపోర్ట్‌గా నిలబడ్డారు. అప్పుడే నాకు మనుషుల వ్యక్తిత్వాల గురించి బోధపడింది. అందుకే ఇంత స్ట్రాంగ్అన్నింటినీ దాటుకుని వచ్చాను కాబట్టే ఈ రోజు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాను. కేవలం నా కుటుంబం వల్లే ఈరోజు ఇలా మీ ముందు నిలబడగలిగాను' అని చెప్పుకొచ్చింది. రెండేళ్లపాటు క్యాన్సర్‌తో పోరాడిన మనీషా 2014లో ఆ భయంకరమైన వ్యాధిని జయించింది. ఇటీవల హీరామండి అనే వెబ్ సిరీస్‌లో మల్లికా జాన్ అనే పాత్రలో నటించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.చదవండి: నీలి రంగు చీరలో కేక పుట్టిస్తున్న కేరళ బ్యూటీ.. సారీ ధరెంతో తెలుసా? -
తాగుడుకు బానిసైన టాలీవుడ్ హీరోయిన్.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)
-
'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్ : హీరామండి: ది డైమండ్ బజార్ (వెబ్‌సిరీస్)నటీనటులు: మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్, తదితరులునిర్మాణ సంస్థలు: భన్సాలీ ప్రొడక్షన్స్దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీసంగీతం: సంజయ్ లీలా భన్సాలీ,బెనెడిక్ట్ టేలర్,నరేన్ చందావర్కర్కథ: మొయిన్ బేగ్జానర్: చారిత్రక నాటకంఎపిసోడ్స్: 8 భాషలు: తెలుగుతో పాటు మొత్తంగా 14 భాషల్లో స్ట్రీమింగ్'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హీరామండి టాపిక్ నడుస్తూనే ఉంది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్‌కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. బాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను తన నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. పీరియాడిక్ డ్రామా చిత్రాలకు పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఇప్పటికే పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్‌సిరీస్ 'హీరామండి' సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే... బ్రిటీష్ పాలన సమయంలో లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక 'హీరామండి'లో ఎలాంటి ఆధిపత్య పోరు జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి సంఘర్షణ జరిగింది..? హీరామండిలో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరెన్ని కుట్రలు చేశారు..? స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఎంత..? ఈ కథలోకి వెళ్లాలంటే ముందుగా పాత్రల గురించి పరిచయం తప్పనిసరి. హీరామండిలో ఉండే షాహీ మహల్ నిర్వహణ మొత్తం మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) చేతిలో ఉంటుంది. ఆ ప్రాంతంలోని నవాబులంతా ఆమె కనుసన్నలలోనే ఉంటారు. అయితే అదే ప్రాంతంలో ఖ్వాభాగ్ అనే మరో మహల్ ఉంటుంది. అక్కడ ఫరీదాన్ (సోనాక్షి సిన్హా) ఉంటుంది. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో మరో మూడు పాత్రలు కీలకంగా ఉంటాయి. వహీదా (సంజీదా షేక్) మల్లికా జాన్‌కు సోదరి. బిబోజాన్ (అదితిరావ్ హైదరి), ఆలంజేబు (షర్మిన్ సెగల్) ఇద్దరూ కూడా మల్లికా జాన్‌కు కుమార్తెలు. లజ్జో (రిచా చద్దా) మల్లికా జాన్ దత్తత తీసుకున్న కూతురు.హీరామండిలో తన మాటకి తిరుగులేదనే స్థాయిలో మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) రాజ్యమేలుతూ ఉంటుంది. ఆమె కనుసన్నల్లో ఉన్న వేశ్యలపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ఎవరైనా ప్రేమలో పడితే ప్రమాదంలో పడినట్టే అనే మాటతో హెచ్చరిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేశ్యలుగా ఉంటూనే మల్లికా జాన్ మాట వినిపించుకోకుండా 'జొరావర్' అనే నవాబుతో లజ్జో, ఫిరోజ్ అనే నవాబుతో వహీదా, వలీ ఖాన్ అనే నవాబుతో బిబోజాన్ ప్రేమలో పడతారు. కానీ, మల్లికా జాన్ చిన్న కుమార్తె ఆలంజేబును కూడా వేశ్యలా మార్చాలని చూస్తుంది. అయితే, ఆమె బాలోచి నవాబు తాజ్దార్ (తాహా షా బహదూర్ షా)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మల్లికా జాన్‌తో పాటు తాజ్దార్ తండ్రికి నచ్చదు. ఆయన ఆంగ్లేయులకు బానిసగా ఉంటాడు. వారి నుంచి విముక్తి కోసం తాజ్ దార్ పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆలంజేబును పెళ్లి చేసుకోవాలనే తాజ్ దార్ నిర్ణయాన్ని అతని తండ్రి వ్యతిరేకిస్తాడు. వేశ్య తమ ఇంటికి కోడలిగా రాలేదని తేల్చి చెబుతాడు. మరోవైపు కూతురు ప్రేమ వివాహాన్ని మల్లికా జాన్ కూడా వ్యతిరేఖిస్తుంది. ఈ క్రమంలో మల్లిక వ్యవహారశైలి నచ్చని తన సోదరి వహీదా ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. దీంతో తన అక్కకు శత్రువుగా ఉన్న ఫరీదాన్ (సోనాక్షి సిన్హా)తో చేతులు కలుపుతుంది. ఇలా హీరామండిలో అనేక సంఘటనలు జరుగుతుండగా బిబోజాన్ (అదితిరావ్ హైదరి) బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్య్ర పోరాటంలో గూఢచారిగా ఉంటుంది. ఒక వేశ్యగా ఉన్న ఆమె ఈ పోరాటం ఎందుకు చేస్తుంది..? బ్రిటీషర్లతో సత్సంబంధాలు పెంచుకుని వారి రహస్యాలను ఎందుకు తెలుసుకుంటుంది..? ఫైనల్‌గా బిబోజాన్ ఒక గూఢచారి అని తెలిసిన తర్వాత బ్రిటీష్‌వాళ్లు ఏం చేశారు..? ఇదే సమయంలో షాహీ మహల్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మల్లికా జాన్న్ అనచివేసేందుకు ఫరీదాన్ ఎలాంటి కుట్రలకు తెరలేపింది..? వేశ్య కుటుంబానికి చెందిన ఆరుగురు స్త్రీల చుట్టూ.. నవాబులు, బ్రిటీష్ పోలీస్ అధికారులు, తిరుగుబాటుదారుల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయనేది తెలియాలంటే హీరామండి సిరీస్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..పీరియాడిక్ డ్రామా చిత్రాలను డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు అంటే 1930, 1940ల కాలం బ్యాక్‌డ్రాప్‌లో హీరామండి వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. 'హీరామండిలో తెల్లదొరల పెత్తనం కాదు.. మల్లికా జాన్ నాణేలు మాత్రమే చెలామణి అవుతాయి' అని మనీషా కొయిరాలా చెప్పిన ఒక్క డైలాగ్ చాలు.. ఈ సిరీస్ డెప్త్ ఏంటో చెప్పడానికి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఎందరో మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ కొందరు చరిత్ర పుటల్లో కలిసిపోతే.. మరికొందరు మాత్రం నేటికి కూడా వినికిడిలో ఉన్నారు. లాహోర్ నగరంలోని హీరామండి ప్రాంతంలో పడుపు వృత్తి నిర్వహించే మల్లికా జాన్‌కు, బ్రిటీష్‌వాళ్లతో మొదలైన వైరాన్ని సంజయ్‌లీలా చక్కగా చూపించాడు. స్వాతంత్య్ర పోరాటంలో 'హీరామండి' పాత్ర ఎంతవరకు ఉందో చెప్పడానికి భారీగానే డైరెక్టర్ ప్లాన్ చేశాడు. మొత్తం 8 ఎపిసోడ్స్‌లలో తన విజువల్ ఫీస్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. హీరామండిలో వేశ్యలుగా ఉన్న వారి జీవితాలను తెరపైన అద్బుతంగా క్రియేట్ చేశాడు. వేశ్యావృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న ఆ మహిళలు స్వతంత్ర సంగ్రామంలోకి ఎందుకు దూకాల్సి వచ్చిందో అదిరిపోయే రేంజ్లో చూపించాడు. ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిపి వాళ్ల వెన్నులో వణుకు పుట్టించిన వేశ్యలుగా వారందరినీ తెరపై చూపించి అద్భుతాన్ని ఆవిష్కరించడంలో సంజయ్‌లీలా భన్సాలీ సూపర్ సక్సెస్ అయ్యాడు.తన టేకింగ్, విజువల్ ఫీస్ట్‌తో ప్రతి ప్రేక్షకుడినీ హీరామండి ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆ కాలంనాటి డిజైన్లను దృష్టిలో పెట్టుకుని అందంగా తీర్చిదిద్దిన భారీ సెట్లతో పాటు చక్కని ఫొటోగ్రఫీ తోడు కావడం ఆపై ప్రతి పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఈ సిరీస్‌కు ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. ఒక వెబ్ సిరీస్ అంత భారీ స్థాయిలో పాటలు అవసరమా అనేలా ఉంటాయి. ప్రారంభంలో రెండు, మూడు ఎపిసోడ్స్‌లలో కథ పరంగా కాస్త నెమ్మదించినా చివరి రెండు ఎపిసోడ్స్ మాత్రం దుమ్మురేపుతాయి. మల్లికా జాన్ పాత్ర పరిచయం చేసిన ఒక ఎపిసోడ్ కూడా మెప్పిస్తుంది. సొంత కుమార్తెలతో సహా ఎవరిపైనా దయాదాక్షిణ్యాలు లేని కఠినాత్మురాలిగా ఆ పాత్రను క్రియేట్ చేసిన విధానం అందరినీ మెప్పిస్తుంది. వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే కథనే అయినప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు. ఈ వీకెండ్లో చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఈ సిరీస్ ఉంటుంది. బ్రిటీష్ పాలనను దిక్కరించిన హీరామండి చరిత్ర పుటల్లో పెద్దగా కనిపించదు. అలా కనుమరుగైన ఒక చాప్టర్‌ను 'హీరామండి'గా సంజయ్‌లీలా తీసుకొచ్చాడు.ఎవరెలా చేశారంటేరూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌లో టాప్ హీరోయిన్లను దర్శకుడు సెలక్ట్ చేసుకున్నాడు. మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వంటి స్టార్స్ ఇందులో ఉన్నారు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం వారే అని చెప్పవచ్చు. షాహీమహల్‌కు పెద్ద దిక్కుగా మల్లికాజాన్ పాత్రలో మనీషా కొయిరాలా దుమ్మురేపిందని చెప్పవచ్చు. తన కడుపున పుట్టిన కూతుర్లను కూడా వేశ్యలుగా మార్చే అంత కఠినాత్మురాలిగా ఆమె చూపించిన నటన అద్భుతమని చెప్పవచ్చు. మరోవైపు ఫరీదాన్‌గా సోనాక్షి సిన్హా నెగెటివ్ పాత్రలో మెప్పించింది. వీరందరికీ ఏమాత్రం తగ్గకుండా అదితిరావు హైదరీ ఎలివేషన్ మామూలుగా ఉండదు. వేశ్యగా కనిపిస్తూనే గూఢచారిగా తన సత్తా ఎంటో చూపించింది. నటనలో ఆమె ఎక్కడా తగ్గలేదు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం విజువల్స్, కాస్ట్యూమ్స్,సినిమాటోగ్రఫీ. ఇవన్నీ కూడా ఓటీటీ స్థాయికి మించి ఉన్నాయి. కానీ, ఇందులో ఎక్కువగా యుద్ధ ఘట్టాలు లేకున్నా ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనాటి చరిత్రకు.. సమాజంలోని స్థితిగతులకు దర్పణం పట్టేలా సీన్స్ ఉన్నాయి. కాస్త నిడివి తగ్గించి ఉంటే బాగుండు అనే కామెట్లు కూడా వినిపిస్తున్నాయి. -
మరో 'గంగుభాయి కతియావాడి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న హిస్టారికల్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బ్రిటీష్రాజ్కు వ్యతిరేకంగా భారత స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో లాహోర్‌లోని హీరా మండిలోని రెడ్-లైట్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే స్వాతంత్ర్యానికి ముందు పాకిస్తాన్లో లాహోర్‌లోని వేశ్య గృహాల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ హయాంలో వేశ్యల జీవితాలు ఎలా ఉంటుందో ట్రైలర్లో పరిచయం చేశారు. గతంలో సంజయ్ లీలా భన్సాలీ ఆలియా భట్‌తో ఇదే కాన్సెప్ట్‌తో గంగుభాయి కతియావాడి తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అదే తరహాలో హీరామండితో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సిరీస్ మే 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
Manisha Koirala: జీవితం అనే గురువు పాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది
సంజయ్‌లీలా భన్సాలి ‘హీరామండి– ది డైమండ్ బజార్’ వచ్చే నెల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ‘హీరామండి’లో మనిషా కోయిరాల నటించింది. ‘హీరామండి’ విడుదలకు ముందు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన జీవితంలోని ప్రధాన సంఘటనల గురించి సుదీర్ఘమైన నోట్ రాసింది మనిషా. క్యాన్సర్‌తో తాను పోరాడిన రోజులను గుర్తు తెచ్చుకుంది. ‘ఎన్నో మంచి పాత్రలలో నటించాను. ఎంతో మంది ఉత్తమ దర్శకులతో కలిసి పని చేశాను. ఎంతోమంది స్నేహాన్ని పొందాను. దేవుడి దయతో క్యాన్సర్‌తో పోరాడి గెలిచాను. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నా జీవితంలో ఎన్నో లోతులను చూశాను. జీవితాన్ని మించిన గురువు లేదు. ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది. కాలం విలువను తెలుసుకున్నాను’ అంటూ రాసింది. మనిషా కోయిరాల రాసిన ఈ నోట్ నెట్‌జనులను బాగా కదిలించింది. -
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
ఆరుగురు హీరోయిన్లతో రియల్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న తాజా వెబ్ సిరీస్ హీరామండీ: ది డైమండ్ బజార్. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వీడియో షేర్ చేస్తూ రివీల్ చేశారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి- ది డైమండ్ బజార్ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్‌సిరీస్ ద్వారా ప్రపంచానికి చూపించనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను ప్రధానాంశాలుగా సంజయ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో తన కలల ప్రాజెక్టు హీరామండీ: ది డైమండ్ బజార్‌తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. -
22 ఏళ్ల తర్వాత కమల్‌హాసన్ సినిమా రిలీజ్
లోకనాయకుడు కమలహాసన్ నట విశ్వరూపానికి ఒక మచ్చుతునక 'ఆళవందాన్'. నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ చిత్రమిది. సురేష్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కమలహాసన్ కథను అందించారు. ఇదే మూవీలో హీరో కమ్ విలన్‌గా కమల్ ద్విపాత్రాభినయం చేశారు. సైకలాజికల్ స్టోరీతో తీసిన ఈ చిత్రం.. 2001 నవంబర్ 12న విడుదలైంది. కొన్ని కారణాల వల్ల అప్పట్లో హిట్ కాలేదు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) ఈ సినిమాలో అన్నదమ్ములుగా కమలహాసన్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్ బ్యూటీస్ మనీషాకొయిరాల, రవీనా టాండన్ హీరోయిన్లుగా నటించారు. 22 ఏళ్ల క్రితం విడుదలైన ఆళవందాన్ చిత్రాన్ని నిర్మాత భాను ఇప్పుడు మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఇది 'అభయ్' పేరుతో యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడీ చిత్రాన్నే చిన్నచిన్న మార్పులు చేసి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు పేర్కొని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మధ్యే కమలహాసన్ 'వేట్టైయాడు విళైయాడు' చిత్రం ఇటీవల మళ్లీ విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఆ చిత్రానికంటే బెటర్‌గా ఆళవందాన్ చిత్రం కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంటుందని భావించవచ్చు. (ఇదీ చదవండి: ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!) -
1980ల్లో స్టార్ హీరోయిన్.. మద్యానికి బానిసై కెరీర్ నాశనం!
మనీషా కొయిరాలా ఈ పేరు తెలుగువారికి సైతం పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే నెల్లూరి నెరజాణ' అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత బాలీవుడ్లో ఆమె నటించిన చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. మనీషా కొయిరాలా ఒకప్పుడు తిరుగులేని అందం, అభినయం ఆమె సొంతం. బాలీవుడ్ సినీ ప్రపంచంలో మనీషాకు సరితూగే నటి అప్పట్లో మరొకరు లేరనే చెప్పాలి. బాంబే, ఇండియన్ వంటి చిత్రాలతో తమిళంలో మంచి స్థానాన్ని సంపాదించుకున్న భామ మనీషా కొయిరాలా. మనీషా నేపాల్‌లోని కొయిరాలా సంపన్న కుటుంబంలోనే జన్మించింది.నేపాల్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి ప్రధాని మనవరాలు మనీషా. అక్కడ రాజకీయ పరిస్థితులు దిగజారడంతో మనీషా తల్లిదండ్రులు వారణాసిలో స్థిరపడ్డారు. అయితే పదో తరగతి తర్వాత నేపాల్‌కు తిరిగి వచ్చిన మనీషా కొయిరాలా ఓని అనే నేపాలీ చిత్రం ద్వారా నటనా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి మోడలింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది. అలా హిందీ సినిమాల్లో అవకాశం వచ్చింది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!) పెళ్లయిన రెండేళ్లకే విడాకులు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఆమెకు పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచింది. నేపాల్‌కి చెందిన సమ్రాట్ దహల్‌తో 2010లో వివాహం జరగగా.. పెళ్లైన ఆరు నెలలకే వీరిమధ్య భేదాభిప్రాయాలు వచ్చి 2012లో విడాకులు తీసుకుంది. పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నాను. కానీ ఆర్నెళ్లకే మాకు గొడవలు ప్రారంభమయ్యాయి.తాను ప్రేమించిన భర్తే తనకు శత్రువుగా మారాడంటూ గతంలో ఓ ఇంటర్వూలో వెల్లడించింది. అయితే తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. బ్యాక్ టూ ఖాఠ్మండు అంటూ తల్లిదండ్రులతో విమానంలో వెళ్తున్న ఫోటోలు పంచుకుంది. ఇది చూసిన ఆమె అభిమానులు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతలా మారిపోయారేంటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. మద్యానికి బానిసై.. సినిమాల్లోకి వచ్చాక మానసిక ఒత్తిడికి గురై మద్యానికి బానిసగా మారింది మనీషా. దీనికి తోడు ఆమె పెళ్లి, విడాకులతో మరింత డిప్రెషన్‌కు గురైంది. ఆ తర్వాత తాగడం మొదలుపెట్టిన మనీషా కొయిరాలా ప్రవర్తన అంతా మారిపోయింది. పార్టీలు, మద్యపానం తన జీవితంలో భాగమైపోయాయని మనీషా కొయిరాలా స్వయంగా తానే చెప్పుకొచ్చింది. క్యాన్సర్‌తో పోరాటం మనీషా కొయిరాలా అంటే స్టార్ హీరోయిన్ అని మాత్రమే తెలుసు. కానీ ఆమె కలర్‌ఫుల్ కెరీర్ పక్కనపెడితే.. క్యాన్సర్ వ్యాధితో పోరాడి గెలిచింది. విడాకుల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే మనీషా గర్భాశయ క్యాన్సర్ చివరి దశలో ఉన్నట్లు తెలిసింది. ఇక ఆమె జీవితం ముగిసిపోయిందని అంతా భావించారు. కానీ క్యాన్సర్‌ను జయించి పోరాట యోధురాలిగా నిలిచింది. ఈ పోరాటం కొత్త జీవితాన్ని ఇచ్చిందని మనీషా కొయిరాలా తన ఆత్మకథ హీల్డ్ పుస్తకంలో ప్రస్తావించింది. ఆ తర్వాతే మనీషాకు జీవనశైలి, అలవాట్లే క్యాన్సర్‌కు కారణమని తెలిసింది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి! ) View this post on Instagram A post shared by Manisha Koirala (@m_koirala) -
Manisha Koirala Birthday 2023: 90'sలో కోట్ల మంది కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన హీరోయిన్ (ఫోటోలు)
-
రెండేళ్లకే విడాకులు, క్యాన్సర్‌తో పోరాటం.. స్టార్ హీరోయిన్ జీవితంలో ఇంత విషాదమా!
క్రిమినల్, బొంబాయి, ఒకే ఒక్కడు, భారతీయుడు తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి మనీషా కొయిరాలా. నెల్లూరి నెరజాణగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. చాలాకాలం తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతోంది. నేపాల్‌కు చెందిన మనీషా కొయిరాలా.. కోలీవుడ్, బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించారు. అంతే కాకుండా దిల్ సే, భాఘి, కంపెనీ, లస్ట్‌స్టోరీస్ లాంటి హిందీ చిత్రాల్లో కనిపించారు. తాజాగా ఇవాళ ఆమె 53వ బర్త్ డే సందర్భంగా ఆమె కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. (ఇది చదవండి: ఎన్నో కలలు కన్నాను.. కానీ పెళ్లైన ఆర్నెళ్లకే అలా జరిగింది : మనీషా కొయిరాల) డాక్టర్ కావాలనుకుని.. మనీషా కొయిరాలా 16 ఆగస్టు 1970లో నేపాల్‌లో జన్మించింది. పాఠశాలలో చదువుతుండగానే 1989 లో ఫేరి భేతౌలా అనే నేపాలీ సినిమాలో మొదటిసారి నటించింది. చిన్నప్పటి నుంచి వైద్యురాలు కావాలనుకున్న ఆమె మొదట మోడల్‌గా పని చేసింది. 1991లో వచ్చిన హిందీ సినిమా సౌదాగర్‌తో బాలీవుడ్లో ప్రవేశించింది. ఆ తర్వాత పలు భారతీయ భాషల సినిమాల్లో నటించింది. 1942-ఎ లవ్ స్టోరీ , తమిళ చిత్రం బొంబాయి సినిమాలతో గుర్తింపు సంపాదించింది. తర్వాత వచ్చిన అగ్నిసాక్షి , గుప్త్ - ది హిడెన్ ట్రూత్ , కచ్చే ధాగే , ఏక్ చోటీసి లవ్ స్టోరీ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. నేపాల్ కుటుంబం రాజకీయ నేపథ్యమున్న మనీషా నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. 2001లో ఈమె నేపాల్ రాజ ప్రభుత్వం ఇచ్చే రెండో అత్యున్నత పురస్కారాన్ని అందుకుంది. వ్యాపారవేత్తతో పెళ్లి-విడాకులు నేపాల్‌కి చెందిన వ్యాపారవేత్తతో సామ్రాట్ దహల్‌తో 2010లో మనీషాకు వివాహం జరిగింది. పెళ్లైన ఆరు నెలలకే వీరిమద్య భేదాభిప్రాయాలు వచ్చి 2012లో విడాకులు తీసుకుంది. ఆ సమయంలోనే మనీషా క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. ఇటీవలే తన పెళ్లి గురించి మాట్లాడింది. పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నా.. కానీ ఆర్నెళ్లకే మాకు గొడవలు ప్రారంభమై.. తాను ప్రేమించిన భర్తే తనకు శత్రువుగా మారాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నేను మాత్రమే కాదు, మీరు మీ పెళ్లి బంధంలో సంతోషంగా లేకుంటే, విడిపోవడమే మంచిదంటూ మనీషా కొయిరాలా పేర్కొంది. కుటుంబసభ్యులు, స్నేహితులతో తన జీవితం సంపూర్ణమైందని ఆమె అన్నారు. అయితే లైఫ్ పార్టనర్ ఉంటే తన జీవితం ఇప్పుడు మరోలా ఉండేదేమో చెప్పలేనని తెలిపారు. ఇకపోతే పిల్లలను పెంచడమంటే నాకు చాలా ఇష్టమని.. సింగిల్ మదర్‌గా పిల్లలను పెంచగలననే ధైర్యం వచ్చినప్పుడు తప్పకుండా ఆ విషయం గురించి ఆలోచిస్తానని మనీషా వెల్లడించింది. -
మద్యపానంతో ఇబ్బందులు పడ్డా.. జీవితం తలకిందులైంది: సీనియర్ హీరోయిన్
బాలీవుడ్ నటి, మనీషా కొయిరాలా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. అప్పట్లోనే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించింది. నేపాల్‌లోని ఖాఠ్మండులో జన్మించిన మనీషా కొయిరాలా.. 1991లో సుభాష్ ఘై చిత్రం సౌదాగర్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతకుముందే 1989లో ఫేరి భతౌలా అనే నేపాలీ చిత్రంలో నటించింది. (ఇది చదవండి: 7 ఏళ్లకే పనిమనిషిగా.. 10 ఏళ్లకే సినిమాల్లోకి.. కోటీశ్వరురాలిగా మారిన హీరోయిన్) అప్పటి నుంచి ఆమె కెరీర్లో వెనుదిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఆమె నటించిన బొంబాయి చిత్రంలో అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో నాగార్జున సరసన క్రిమినల్, అర్జున్‌తో ఒకే ఒక్కడు, నగరం, భారతీయుడు, బూచి, లేడీ టైగర్, నోటుకు పోటు లాంటి చిత్రాల్లో కనిపించింది. ఇటీవల కార్తీక్ ఆర్యన్ నటించిన షెహాజాదాలో హీరోకు తల్లిపాత్రలో నటించింది. అయితే మనీషా కొయిరాల ఎంత త్వరగా గొప్ప పేరు తెచ్చుకుందో.. ఆమె కెరీర్ కూడా అంతే వేగంగా పతనమైంది. ఆ తర్వాత అప్పట్లో ఆమె నేపాల్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. అప్పట్లో ఆమె మద్యానికి కూడా బానిసైంది. గతంలో మనీషా మద్యం సేవించిన ఓ వీడియో నెట్టింట్లో కనిపించింది. ఆ వీడియోలో మద్యం మత్తులో ఉన్న మనీషా కొయిరాలాను మీడియా ప్రతినిధులు ఫోటోలు తీస్తుండగా వద్దని వేడుకుంది. మద్యానికి బానిస కావడం పట్ల మనీషా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మద్యపానం వల్ల జీవితంలో కష్టాలు పడ్డానని తెలిపింది. మనీషా కొయిరాలా మాట్లాడుతూ.. 'మద్యం నా జీవితంలోకి వచ్చాక పరిస్థితి అంతా తలకిందులైంది. నా జీవితం ఇంతలా మారతుందనినేను గ్రహించలేదు. అప్పుడు చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నా. మనం మద్యం తాగడం ప్రారంభిస్తే దానివల్ల సమస్యలు పరిష్కారం కావు. జీవితంలో అది మన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మద్యం తాగుతారు. మా నాన్న కొన్నిసార్లు తాగేవారు. కానీ మన పరిస్థితులను అర్థం చేసుకుని మెలగాలి. అప్పుడే మన జీవితం సాఫీగా సాగుతుంది.' అని అన్నారు. కాగా.. 2010లో మనీషా తన తోటి నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ని పెళ్లాడింది. అయితే పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. (ఇది చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్) -
ఎన్నో కలలు కన్నాను.. కానీ పెళ్లైన ఆర్నెళ్లకే అలా జరిగింది : మనీషా కొయిరాల
'నెల్లూరి నెరజాణ' అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి మనీషా కొయిరాలా. చాలాకాలం తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతుంది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి పలు విషయాలను షేర్ చేసుకుంది. నేపాల్‌కి చెందిన సమ్రాట్ దహల్‌తో 2010లో ఈమెకు వివాహం జరగగా, పెళ్లైన ఆరు నెలలకే వీరిమద్య భేదాభిప్రాయాలు వచ్చి 2012లో విడాకులు తీసుకుంది. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. 'పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నాను. కానీ ఆర్నెళ్లకే మాకు గొడవలు ప్రారంభమయ్యాయి.తాను ప్రేమించిన భర్తే తనకు శత్రువుగా మారాడు. స్త్రీకి ఇంతకంటే దారుణం ఏముంటుంది.దీంతో విడాకులు తీసుకోకుండా తప్పలేదు. నాలాంటి సమస్య ఎవరికి రాకూడదు. నేను మాత్రమే కాదు, మీరు మీ పెళ్లి బంధంలో సంతోషంగా లేకుంటే, విడిపోవడమే మంచిది' అంటూ మనీషా కొయిరాలా పేర్కొంది. -
బాబా వల్ల అవకాశాలు తగ్గాయి: మనీషా కొయిరాల
‘‘బాబా’ సినిమా పరాజయంతో సౌత్‌లో నాకు అవకాశాలు తగ్గాయి’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు మనీషా కొయిరాల. రజనీకాంత్, మనీషా జంటగా సురేష్‌కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘బాబా’ (2002). ఈ చిత్రం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనీషా మాట్లాడుతూ – ‘‘తమిళంలో నేను చేసిన చివరి పెద్ద సినిమా ‘బాబా’నే. ఈ సినిమా విజయంపై భారీ అంచనాలు ఉండేవి. అయితే ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ సినిమా ఫ్లాప్‌తో సౌత్‌లో నా కెరీర్ అయిపోతుందనుకున్నాను. అదే జరిగింది. ‘బాబా’కన్నా ముందు సౌత్‌లో చాలా సినిమాలు చేశాను. అయితే ఈ సినిమా పరాజయం వల్ల అవకాశాలు తగ్గాయి. అయితే ‘బాబా’ని మళ్లీ విడుదల (రజనీ పుట్టినరోజు డిసెంబర్ 12 సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 10న రీ రిలీజ్) చేస్తే, హిట్ కావడం ఆశ్చర్యం అనిపించింది. ఏది ఏమైనా రజనీ సార్‌తో సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు. -
రజనీకాంత్‌తో సినిమా చేశాక నాకు ఆఫర్లు రాలేదు: హీరోయిన్
రజనీకాంత్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో బాబా ఒకటి. ఈ సినిమా ఫలితం ఎలాగున్నా చాలామంది ఇప్పటికీ దీన్ని ఎంతగానో ఇష్టపడతారు. రజనీ కూడా బాబా చిత్రం తనకెంతో ప్రత్యేకమని అనేకసార్లు నొక్కిచెప్పాడు. ఈ సినిమాలో మనీషా కొయిరాలా హీరోయిన్గా నటించింది. దీనికంటే ముందు ఆమె ఇండియన్, బాంబే, ఆలవందన్ వంటి పలు దక్షిణాది హిట్ చిత్రాల్లో నటించింది. అయితే బాబా తర్వాత తనకు సౌత్‌లో స్థానం లేకుండా పోయిందట. ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'బాబా నా చివరి తమిళ చిత్రం. ఆ రోజుల్లో ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఘోరంగా చతికిలబడింది. సౌత్‌లో నా కెరీర్ ముగిసినట్లే అనుకున్నా.. చివరికి నేను ఊహించిందే జరిగింది. బాబా తర్వాత నాకు అవకాశాలు రాలేదు. అదేంటో కానీ విచిత్రంగా రీరిలీజ్ చేసినప్పుడు మాత్రం మంచి హిట్ కొట్టింది' అని చెప్పుకొచ్చింది. మణిరత్నం బాంబే సినిమా గురించి చెప్తూ.. 'మొదట బాంబే సినిమా చేయకూడదనుకున్నాను. తల్లి పాత్రలో నటిస్తే కెరీర్ దెబ్బతింటుందని అందరూ హెచ్చరించారు. కానీ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా మాత్రం మణిరత్నం గురించి, ఆయన సినిమాల గురించి నీకేమైనా తెలుసా అసలు? ఆయన సినిమా వద్దుంటున్నావంటే నీ అంత పిచ్చివాళ్లు ఇంకొకరు ఉండరు అని తిట్టాడు. అప్పుడు వెంటనే నా నిర్ణయాన్ని మార్చుకున్న అమ్మ, నేను చెన్నై వెళ్లిపోయాం. బాంబే సినిమా చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది' అని తెలిపింది. 1995లో వచ్చిన బాంబే మూవీ కల్ట్ క్లాసిక్ మూవీలో ఒకటిగా నిలిచింది. బాబా సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి రజనీకాంతే స్వయంగా కథ అందించి, నిర్మించాడు. గతేడాది రజనీకాంత్ బర్త్‌డే సందర్భంగా బాబా రీరిలీజ్ చేయగా మంచి కలెక్షన్లు రాబట్టింది. -
వేశ్యల జీవిత కథ ఆధారంగా హీరామండిలో..
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. మనీషా కొయిరాల, సోనాక్షీ సిన్హా, అదితీ రావ్ హైదరీ, రిచా చద్దా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్‌ను శనివారం విడుదల చేశారు. లాహోర్ బ్యాక్‌డ్రాప్‌లో ఒకప్పటి వేశ్యల జీవితాల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. త్వరలో స్ట్రీమింగ్ కానుంది. -
ఒకే ఫ్రేంలో అందాల తారలు.. కనుల పండుగగా హీరామండి ఫస్ట్‌లుక్
బాలీవుడ్లో దిగ్గజ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. వాస్తవిక కథలను, హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్టా. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, దేవదాస్, ‘బాజీరావ్ మస్తానీ’వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను కళ్లకు కట్టినట్లుగా ప్రేక్షకులకు అందించారు. ఇక ఆయన ఓ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పలువురు అగ్ర నటిమణులతో హీరామండి అనే వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ కోసం ఆయన రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున ఈ సిరీస్ వేశ్యల కథ నేపథ్యంలో కొనసాగనున్నట్టు తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా ఈ సిరీస్‌ను నుంచి అప్డేట్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ క్వీన్స్ గెటప్‌లలో రాయల్ లుక్‌లో కనిపించారు. అందమైన తారలంతా ఒకే ఫ్రేంలో రాయల్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ అంత కనుల పండుగా చేసుకుంటున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. కాగా స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి’ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్‌సిరీస్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను అంశాలుగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. Another time, another era, another magical world created by Sanjay Leela Bhansali that we can’t wait to be a part of. Here is a glimpse into the beautiful world of #Heeramandi 💫 Coming soon! pic.twitter.com/tv729JHXOE — Netflix India (@NetflixIndia) February 18, 2023 -
తల్లి పాత్రలో అందాల నటి మనీషా కొయిరాల
తెలుగు సినిమాలకు మార్కెట్ బాగా పెరిగింది. కొన్నాళ్లుగా టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్లో రీమేక్ అయి అక్కడ కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. రీసెంట్గా మన తెలుగు పాటలకు బాలీవుడ్లో సీటీమార్ స్టెప్పులేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురంలో చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. డేవిడ్ ధావన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా కార్తీక్ ఆర్యన్ – కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఇక తెలుగులో సుశాంత్‌కు తల్లిగా నటించిన టబు పాత్రను బాలీవుడ్లో మనీషా కొయిరాల చేయనుందట. ఇప్పటికే మేకర్స్ ఆమెతో చర్చలు జరపగా, మనీషా కూడా అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ పాత్ర కోసం టబునే సంప్రదించినా ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ ఛాన్స్ మనీషా కొయిరాలకు దక్కిందట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ రీమేక్ వెర్షన్‌ను అల్లు అరవింద్ సహా నిర్మాతగా వ్యవహిరించనున్నట్లు తెలుస్తోంది. చదవండి : ‘అర్జున్ రెడ్డి’లా పవన్ కల్యాణ్.. ఓల్డ్ పిక్ వైరల్ ముఖంపై మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతా: తమన్నా -
మరణించేలోపు ఎన్నో పూర్తి చేయాలి: మనీషా కొయిరాలా
-
చనిపోయేలోపు ఎన్నో పూర్తి చేయాలి
కోమలమైన ముఖం, చెరగని చిరునవ్వు బాలీవుడ్ భామ మనీషా కొయిరాలా సొంతం. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనూహ్యంగా ఆమెకు ఏడేళ్ల క్రితం క్యాన్సర్ మహమ్మారి సోకింది. కానీ ఆ క్యాన్సర్ రక్కసితో చేసిన సుదీర్ఘ పోరాటంలో ఆమెదే పైచేయి అయింది. క్యాన్సర్ కుంగదీస్తుందంటారు. కానీ ఆ కుంగుబాటుకు నుంచి త్వరగానే బయటపడి సానుకూల ఆలోచనలతో అందరినీ అబ్బురపరిచేది. ఈ క్రమంలో బుధవారం మనీషా ఇన్‌స్టాగ్రామ్‌లో స్ఫూర్తిదాయక పోస్ట్ చేశారు. దీనికి ‘బలాన్ని తిరిగి కూడగట్టుకుంటున్నాను’ అని క్యాప్షన్ జోడించారు. అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న కొన్ని ఫొటోలను ఆమె పంచుకున్నారు. ఈ సందర్భంగా రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన శక్తిమంతమైన పద్యాన్ని గుర్తు చేసుకున్నారు. ‘జీవితం అందమైనది, లోతైనది, కొన్నిసార్లు చీకటిమయంగానూ ఉంటుంది. కానీ ఏది ఏమైనా నేను శాశ్వతంగా నిద్రించేలోపు ఎన్నో బాధ్యతలు పూర్తి చేయాల్సి ఉంది’ అని రాసుకొచ్చారు. (అది వ్యవసాయం కాదు ఆడుకోవడం అంటారు) ఆమె ఎప్పుడూ అభిమానుల మెదడులో పాజిటివ్ దృక్పథాన్ని నింపేందుకే ప్రయత్నిస్తారు. ఒక పోస్టులో ఆమె 'రహదారి నాకు గురువు' అంటారు. మరో పోస్టులో 'ఈ క్వారంటైన్లో మీకు సంతోషాన్ని, ప్రశాంతతను అందించే హాబీని వెతుక్కోండి' అని సూచిస్తారు. ఇలా ఆమె సోషల్ మీడియాలో చేసే పోస్టులన్నీ ఉత్తేజభరితంగా, మంచి మాట చెప్తున్నట్లుగా ఉంటాయి. కాగా 2012లో అకస్మాత్తుగా వచ్చిన అండాశయ క్యాన్సర్ ఆమె జీవితాన్ని మార్చివేసింది. జీవించేందుకు రెండో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ఆమె చికిత్స ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె క్యాన్సర్ ఎలా జయించిందో పేర్కొంటూ 'హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్' అనే పుస్తకాన్ని రాశారు. ఆమె చివరిసారిగా 'మస్కా' అనే చిత్రంలో కనిపించారు. (ఇండియా- నేపాల్ సరిహద్దు వివాదంలో హీరోయిన్!) -
మనీషా కోయిరాలా ట్వీట్‌పై విమర్శలు
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి, నేపాల్ పౌరురాలు మనీషా కోయిరాలా చేసిన ఓ ట్వీట్ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఆమెపై ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను తమ భూభాగంలో చూపించుకుంటూ నేపాల్ మంత్రి పోస్ట్ చేసిన మ్యాప్ ట్వీట్‌ను మనీషా కోయిరాలా రీట్వీట్ చేశారు. ‘మన చిన్న దేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు ధన్యవాదాలు. మూడు గొప్ప దేశాల మధ్య చర్చలన్నీ ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో భారత్‌లో ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి. భారత్ ఆమెకు సినీ జీవితం ప్రసాదిస్తే ఇప్పుడు భారత్ మీదే వివక్ష చూపుతున్నారని, ఆమెను బహిష్కరించాలని ట్రోల్స్ వచ్చాయి. -
ఇండియా- నేపాల్ సరిహద్దు వివాదంలో హీరోయిన్!
ముంబాయి: ఎంతో కాలంగా మంచి స్నేహితులుగా ఉన్న ఇండియా- నేపాల్ మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత్ పై ఘాటుగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనికి భారత్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ వివాదంలో బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా కూడా చిక్కుకున్నారు. ఈ వివాదం పై ఆమె స్పందిస్తూ ‘మా చిన్న దేశం గౌరవాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు. మూడు గౌరనీయమైన దేశాల మధ్య శాంతిపూర్వక, మర్యాదప్రదమైన సంప్రదింపులు జరగాలని ఎదురుచూస్తున్నాం’ అని ట్వీట్ చేసింది. అయితే ఈ విషయంలో నెటిజన్లు మనీషా పై ఫైర్ అవుతున్నారు. ఈ ట్వీట్‌పై ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు. (భారత్‌పై నేపాల్ ప్రధాని షాకింగ్ కామెంట్లు!) దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ ‘ మనీషా బేటా నువ్వు మనసుతో ఆలోచించూ లేక పోతే సిగ్గుంటే ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉండూ దీనిని రాజకీయం చెయ్యొద్దు. మీరు చైనాతో ఉన్నారు. మీ ప్రేమను దాచి ఉంచుకోండి లేకపోతే నువ్వు ముంబాయిలో సంపాదించింది మొత్తం పోతుంది’ అని ట్వీట్ చేశాడు. దీనిపై చాలా మంది వివిధ రకాలుగా స్పందిస్తూ మనీషాని ట్రోల్ చేస్తున్నారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు తన భూభాగంలోనివేనంటూ నేపాల్ విడుదల చేసిన కొత్త మ్యాప్‌ను ఆ దేశ కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి బుధవారం కటువైన వ్యాఖ్యలు కూడా చేశారు. భారత్ రాజముద్రలో వుండే మూడు సింహాల ముందు ‘సత్యమేవ జయతే’ అని వుంటుందని, ఆ దేశం దానికి కట్టుబడి వుంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కరోనా వైరస్‌ను గుర్తుకు తెచ్చేలా ‘చైనా వైరస్ కంటే, ఇటలీ వైరస్ కంటే ఇండియా వైరస్ ప్రమాదకరమైనదంటూ పరుషంగా మాట్లాడిన సంగతి విదితమే. (నేపాల్ దూకుడుకు భారత్ గట్టి కౌంటర్) -
మనీషా మస్కా
హీరోయిన్ మనీషా కొయిరాల మస్కా కొట్టనున్నారు. ఏ ట్రిక్స్‌తో పక్కవారిని మనీషా మస్కా కొట్టించారో త్వరలో వెబ్ ఫిల్మ్‌లో చూడొచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘మస్కా’ అనే వెబ్ ఫిల్మ్‌ను అనౌన్స్ చేసింది. ఇందులో ఎవరెవరు నటించబోతున్నారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘మస్కా’లో మనీషా కొయిరాల, గాయని షెర్లీ, నటి నికితా దత్తా, నటుడు ప్రీత్ కమాని ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. నీరజ్ ఉద్వానీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘యాక్టర్‌గా నేను గర్వపడేలా ఉంటుందీ వెబ్‌ఫిల్మ్’’ అన్నారు మనీషా. హీరోయిన్ కావాలనుకునే ఓ కన్ఫ్యూజ్డ్ అమ్మాయి సక్సెస్ జర్నీ ఆధారంగా ‘మస్కా’ ఉంటుందట. ఇదిలా ఉంటే.. ఇంతకుముందే ‘లస్ట్‌స్టోరీస్’ అనే వెబ్ సిరీస్‌తో మనీషా డిజిటల్ ఆడియన్స్‌కు పరిచయమయ్యారు. ఇప్పుడు మస్కాతో మరోసారి డిజిటల్ ఆడియన్స్‌ని పలకరించబోతున్నారు. -
రెహమాన్ రాసిన ప్రేమకథ
సరికొత్త ట్యూన్స్, బీట్స్‌తో ఇన్ని సంవత్సరాలు సంగీత ప్రియుల్ని అలరించిన రెహమాన్ నిర్మాతగా, కథారచయితగా మారనున్న విషయం తెలిసిందే. ‘99 సాంగ్స్’ అనే చిత్రాన్ని నిర్మించడంతో పాటు ఈ సినిమా కథను రెహమానే అందించడం విశేషం. ఈ సినిమా జూన్ 21న రిలీజ్‌కు రెడీ అయింది. ఎహాన్ భట్, ఎడిల్సీ వర్గాస్ జంటగా మనీషా కొయిరాల, లిసా రే ముఖ్య పాత్రల్లో విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విశేషాల గురించి రెహమాన్ మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా, కథా రచయితగా నా తొలి చిత్రం జూన్ 21న రిలీజ్ అవుతుందని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ‘99 సాంగ్స్’ సినిమా స్వచ్ఛమైన ప్రేమకథతో తీసినది. సంగీతమే ఈ సినిమాకు సోల్. జియో స్టూడియోస్‌తో కలసి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఎప్పటిలానే మీ ప్రేమ, అభిమానం, సపోర్ట్‌కు చాలా థ్యాంక్స్’’ అన్నారు. -
ఆమె బ్యాగ్ ధరతో ఆర్నెల్లు బతికేయొచ్చు..
ముంబై : బాలీవుడ్ నటులు, సెలబ్రిటీలు తమ హోదాను చాటుకోవడానికో, స్టైల్ స్టేట్మెంట్ కోసమో ఖరీదైన వస్తువులు వాడుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కాస్ట్లీ లుక్‌తో హల్చల్ చేశారు. బేబీ పింక్ కలర్ షర్ట్, అదే రంగు జీన్స్ ధరించిన మనీషా సింపుల్‌గా కనిపించినా, ఆమె హ్యాండ్‌బ్యాగ్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. మనీషా చేతిలో కనిపించిన హ్యాండ్ బ్యాగ్ ధర భారత కరెన్సీలో రూ 1.7 లక్షలు. ఇక రూ 50 వేల ఖరీదైన షూ ధరించిన మనీషా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తన ప్రత్యేకతను నిలుపుకునేందుకు బ్రాండెడ్ కలెక్షన్‌ను బాగానే డిస్ప్లే చేశారు. అయితే మనీషా బ్యాగ్ ధరతో ఓ సామాన్య కుటుంబం ఆర్నెల్ల పాటు హాయిగా బతికేయవచ్చు. -
జీవితం విలువ తెలిసింది
‘‘ఒకవేళ మళ్లీ బతికే అవకాశం వస్తే క్యాన్సర్ గురించి అందరికీ అవగాహన కలిగించడానికి నా వంతు కృషి చేస్తాను అని నాకు క్యాన్సర్ అని తెలియగానే ప్రామిస్ చేసుకున్నాను’’ అన్నారు నటి మనీషా కొయిరాలా. 2012లో మనీషాకు ఒవేరియన్ క్యాన్సర్ ఉన్న విషయం బయటపడింది. విదేశాలు వెళ్లి చికిత్స చేయించుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో ఆమె ముంబై చేరుకున్నారు. భయంకరమైన వ్యాధి సోకిన విషయం తెలిశాక తనలో ఆత్మస్థయిర్యం పెంచే కథనాల కోసం మనీషా వెతికారట. అయితే క్యాన్సర్‌ని జయించిన క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి లిసా రేల ‘సక్సెస్ స్టోరీ’ తప్ప వేరే ఎవరిదీ కనిపించలేదట. అందుకే ఓ పుస్తకం రాయాలనుకున్నారామె. ‘హీల్డ్’ పేరుతో తాను రాసిన పుస్తకాన్ని ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో ఆవిష్కరించారామె. ఈ నెల 24 నుంచి 28 వరకూ ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా మనీషా కొయిరాలా మాట్లాడుతూ –‘‘మన జీవితంలో మనకేదైనా చేదు అనుభవం ఎదురైనప్పుడు దాన్ని అధిగమించడానికి మనం ఏం చేశామో ఇతరులకు చెప్పాలి. అప్పుడు వాళ్ల మనసులో ఉన్న భారం తగ్గుతుందని నమ్మాను.. అందుకే ‘హీల్డ్’లో నా అనుభవాలు చెప్పాను. క్యాన్సర్ అనగానే ముందుగా ఎవరికైనా వచ్చే ఆలోచన ‘మరణం’. నాక్కూడా ఆ ఆలోచనే వచ్చింది. వ్యాధి గురించి తెలిసిన రోజు రాత్రి ఒంటరిగా గడిపాను. ఖాట్మండు నుంచి ముంబైకి వచ్చాను. అంతకుముందు లెక్కపెట్టలేనన్ని సార్లు ఆ ప్రయాణం చేశాను. కానీ మొదటిసారి నాకా జర్నీ విచిత్రంగా అనిపించింది. నా గురువు దగ్గర భయంగా ఉందని చెప్పాను. ‘భయాన్ని వదిలించుకో. అయినా ఎందుకు భయపడుతున్నావు?’ అని అడిగారాయన. ‘మరణానికి’ అన్నాను. ‘మరణించడం అంటే ఏంటి?’ అన్నారాయన. ‘తెలియదు. చెప్పలేను’ అన్నాను. ‘మరి భయం ఎందుకు?’ అన్నారు. అంతే.. భయాన్ని పూర్తిగా మనసులోంచి తీసేశాను. భయం అనేది మనల్ని ఇంకా కుంగిపోయేలా చేస్తుందని అర్థమైంది. ఆత్మవిశ్వాసం పెంచుకున్నాను. మనకేదైనా జరగరానిది జరిగితే జీవితం అంతే అనుకోకూడదు. భయపడకూడదు. సవాళ్లను స్వీకరించాలి. జయించాలనుకున్నాను. జయించాను. నిజానికి అంతకుముందు జీవితాన్ని ఇష్టం వచ్చినట్లుగా జీవించాను. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. అందుకే క్యాన్సర్ ఓ టీచర్లా నన్ను ఆవహించింది. అదొక పాఠం అయింది. ఇప్పుడు నా జీవితం అంటే నాకు చాలా విలువ. నా ఆరోగ్యం అంటే ఎంతో విలువ. ఆరోగ్యంగా లేకపోతే జీవితాన్ని ఆనందంగా గడపలేమని అర్థం చేసుకున్నాను. అందుకే జాగ్రత్తగా ఉంటున్నాను’’ అన్నారు. -
నా చెడు ప్రవర్తన కారణంగానే ..
సినిమా: ఏదైనా అనుభవంలోకి వస్తేగానీ తెలియదంటారు. చాలా మంది పాశ్చాత్య సంస్కృతి పేరుతో విచ్చలవిడి ప్రవర్తనతో జీవితాన్ని ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అది తప్పని తెలిసే సరికి పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. ఇది సినిమా వాళ్లకూ వర్తిస్తుంది. ఉదాహరణకు నటి మనీషా కోయిరాలానే తీసుకుంటే ఈ నేపాలీ బ్యూటీ హిందీ, తమిళం, తెలుగు అంటూ పలు భాషల్లో నటించి 1990లో క్రేజీ కథానాయకిగా వెలిగింది. ముఖ్యంగా తమిళంలో బొంబాయి, ఇండియన్, ముదల్వన్, బాబా వంటి పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి అందమైన నటి కేన్సర్ వ్యాధికి గురైంది. ఆ వ్యాధితో తీవ్రంగా పోరాడి ఎట్టకేలకు జయించింది. మనీషాకోయిరాలా కేన్సర్ మహమ్మారి బారిన పడటానికి కారణం విచ్చల విడి ప్రవర్తన, కట్టుబాట్లను మీరడమే. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకుంది. కేన్సర్ వ్యాధి నుంచి కోలుకున్న మనీషాకోయిరాలా తన జీవిత చరిత్రను పుస్తకంగా రాసుకుంది. ‘హీల్డ్’ పేరుతో రాసిన ఆ పుస్తకంలో... ‘కేన్సర్ నాకు జీవితంలో చాలా ధైర్యాన్నిచ్చింది. నా చెడు ప్రవర్తన కారణంగానే కేన్సర్ వ్యాధి బారిన పడ్డాను. నేను పలు చీకటి రోజులను, ఏకాంత రాత్రులను గడిపాను. వాటి నుంచి ఎలా బయట పడ్డానన్నది తలచుకుంటే నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకప్పుడు ప్రపంచమే నా కాలు కింద ఉందని విర్రవీగాను. క్షణం తీరక లేని షూటింగ్‌ల కారణంగా 1999లో శారీరకంగానూ, మానసికంగానూ బాధింపునకు గురయ్యాను. అందులోంచి బయట పడటానికి మద్యం ఒక్కటే మంచి మార్గం అని భావించాను. శ్రేయోభిలాషులు ఎంత హితబోధ చేసినా పెడ చెవిన పెట్టాను. కేన్సర్ నా జీవితంలో ఒక బహుమతిగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. నా ఆలోచనలు మారాయి. నా మనసుకు బోధ పడింది. నా దృక్పథంలో మార్పు వచ్చింది. ఇంతకు ముందు చాలా కోపంగానూ, అభద్రతాభావంతోనూ ఉండేదాన్ని. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నాను అని మనీషా కోయిరాలా పేర్కొంది. -
కేన్సర్..డోంట్ కేర్
-
ఆమె పాత్రలో నటించాలనదే నా కోరిక..
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా నటిస్తారనే వార్తలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 16 సంవత్సరాలు క్రితం ఇందిరాగాంధీ బయోపిక్‌లో నటించడానికి మనీషా సంతాకం చేసినట్లు సమాచారం. ఇందిరాగాంధీ బయోపిక్‌లో నటించాలని ఉందని మనీషా తాజాగా ఓ ఇంటార్యూలో చెప్పారు. ‘ఆమె చాలా శక్తివంతమైన మహిళ. తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆమె ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. అంతటి పవర్ఫుల్ లేడీ పాత్రలో నటించాలనదే నా కోరిక’ అని ఆమె పేర్కొన్నారు. ఆమె పాత్రలో నటించాడం నాకు చాలా ఇష్టమని మనీషా తెలిపారు. అంతేకాక గతంలో ఈ బయోపిక్ కోసం సంతాకం చేసిన విషయాన్ని ఆమె మరొసారి గుర్తు చేశారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఎన్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. మనీషా ప్రస్తుతం సంజయ్ దత్ బయోపిక్‌లో నర్గిస్ దత్ పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఇందిరాగాంధీ పాత్రలో నటించాలని ఉందని మనీషా కొయిరాలా వెల్లడించారు. -
అదే హెయిర్ స్టైల్.. అదే చీర కట్టు
సంజయ్ దత్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సంజు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సంజయ్ దత్ జీవితంలోని చీకటి కోణాలను కూడా చూపెట్టనున్నామని చిత్ర బృందం ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సంజయ్ పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ తల్లి, అలనాటి ప్రముఖ నటి నర్గీస్ పాత్రలో మనీషా కొయిరాల నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఇటీవల షేర్ చేసిన పోస్టర్లో మనీషాను చూసిన జనాలు అచ్చం నర్గీస్లానే ఉందంటూ కామెంట్లు చేశారు. తాజాగా మనీషా పోస్ట్ చేసిన ఫొటోలు మాత్రం అంతకుమించి అనేలా ఉన్నాయి. 1970నాటి నర్గీస్‌ను గుర్తుకు తెచ్చేలా.. అదే హెయిర్ స్టైల్, అదే చీర కట్టుతో కూడిన తన ఫొటోను మనీషా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని రెండో సాంగ్ కర్ హర్ మైదాన్ ఫతే.. తనకు ఎంతో ఇష్టమైన సాంగ్ అంటూ చెప్పుకొచ్చారు మనీషా. సంజయ్ పాత్రలో నటించడానికి రణబీర్ ఎంత కష్టపడ్డాడో.. మనీషా కూడా నర్గీస్లా మెప్పించేందుకు అంతే శ్రమించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్, మనీషాతోపాటు సోనమ్ కపూర్, పరేష్ రావల్, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
హీరో ‘డ్రగ్స్’ కష్టాలు
బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ బయోపిక్ సంజు రిలీజ్‌కు ముందే హాట్ టాపిక్‌గా మారింది. అచ్చం సంజూ బాబాలా తెరపై కనిపించేందుకు రణ్‌బీర్ కపూర్ పడ్డ కష్టం.. పైగా సంజయ్ దత్ లైఫ్‌లోని ప్రతీ కోణాన్ని విప్పి చూప్పానని దర్శకుడు చేసిన ప్రకటనతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు ఆ అంచనాలను పెంచేయగా.. తాజాగా చిత్రంలోని ఓ సాంగ్ ప్రమోషన్ బిట్‌ను వదిలారు. ‘కర్ హర్ మైదాన్ ఫతే...’ అంటూ సాగే పాట.. శేఖర్ అస్థిత్వ లిరిక్స్, విక్రమ్ మాంట్రోస్ సంగీతాన్ని అందించగా.. సుఖ్విందర్ సింగ్-శ్రేయా ఘోషల్‌లు పాటను ఆలపించారు. సంజయ్ దత్ జీవితంలోని డ్రగ్స్ కోణాన్ని చూపిస్తే సాగే పాట ఇది. వాటి నుంచి తేరుకోడానికి పునరావాస కేంద్రానికి పంపించటం, అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి ఇంటికి చేరటం, దారిలో అడ్డుకుంటూ కష్టాలు పడటం, డ్రగ్స్ నుంచి బయటపడేందుకు చేసే యత్నాలు, తల్లిదండ్రుల ఆప్యాయత.. మొత్తం ఎమోషనల్ కంటెంట్‌తో సాంగ్ సాగింది. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ తండ్రి సునీల్‌దత్ పాత్రలో పరేష్ రావెల్, తల్లి నర్గీస్ దత్ పాత్రలో మనీషా కోయిరాల నటించారు. సోనమ్ కపూర్, దియా మీర్జాలు ఇతరత్రా పాత్రల్లో నటిస్తుండగా, కీలక పాత్రలో అనుష్క శర్మ కనిపించనుంది. జూన్ 29న సంజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
ప్రస్థానం ప్రారంభం
అబ్బా.. బాలీవుడ్ సినిమాలు భలే ఉంటాయిరా బాబు! మన టాలీవుడ్లో అలాంటి సినిమాలు రావడం తక్కువ అని కొందరు అంటుంటారు. కానీ ఎవరి టాలెంట్ వాళ్లకు ఉంటుంది. రీసెంట్ టైమ్స్‌లో అయితే మన తెలుగు సినిమాలు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తున్నాయి. అందుకు మన ‘బాహుబలి’ చిత్రమే నిదర్శనం. అంతెందుకు ఇప్పుడు చూడండి. తెలుగు సినిమాలు ‘ప్రస్థానం, టెంపర్, అర్జున్‌రెడ్డి’ బీటౌన్‌లో రీమేక్ అవుతున్నాయి. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ జూలైలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆల్రెడీ ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’కు టీమ్ కొబ్బరికాయ కొట్టారు. గురువారం హిందీ ‘ప్రస్థానం’ మొదలైంది. తెలుగులో డైరెక్ట్ చేసిన దేవా కట్టానే దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్, మనీషా కోయిరాల, అలీ ఫజల్, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నటుడు జాకీ ష్రాఫ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. పదేళ్ల క్రితం హిందీ చిత్రం ‘కార్తూస్’లో కలిసి నటించిన సంజయ్, మనీషా, జాకీ మళ్లీ ఇప్పుడు ‘ప్రస్థానం’ హిందీ రీమేక్‌లో నటిస్తుండటం విశేషం. ‘‘ఫస్ట్ డే షూట్లో సంజయ్‌దత్ పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు దేవా కట్టా. -
సంజు కొత్త పోస్టర్.. అచ్చం నర్గీస్లా..!
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ‘సంజు’ చిత్రానికి సంబంధించిన ఏ వార్త అయిన క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. రణబీర్ కపూర్ ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రలో కన్పించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సంజు ట్రైలర్ అభిమానులను విశేషంగా అకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రంలో అలనాటి ప్రముఖ నటి, సంజయ్ దత్ తల్లి నర్గీస్ పాత్రలో నటిస్తున్న మనీషా కొయిరాలకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఈ పోస్టర్‌ను ట్విటర్లో అభిమానులతో పంచుకున్నారు. ‘ ఆమె తన కొడుకును ముద్దుగా సంజు అని పిలుచుకునేది.. ఇప్పడు మనం కూడా అలానే పిలుస్తున్నాం. నర్గీస్జీ పాత్రలో మనీషా నటనను జూన్ 29న చూడనున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌కు విశేష స్పందన వస్తుంది. మనీషా అచ్చం నర్గీస్లాగే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మనీషా లుక్‌ను, నర్గీస్ ఫొటోలతో పోలుస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సంజయ్ దత్ నటించిన తొలి సినిమా విడుదలకు మూడు రోజుల ముందు నర్గీస్ క్యాన్సర్‌తో చనిపోయింది. మనీషా కోయిరాలా కూడా క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిని ఓ సారూప్యతగా చెబుతూ.. మనీషా ఈ పాత్రలో అద్భుతంగా నటించి ఉంటుందని కూడా కామెంట్లు చేస్తున్నారు. మనీషా మాట్లాడుతూ.. ‘లెజండ్రీ నటి నర్గీస్ పాత్రలో నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఎన్ని ఏళ్లు గడిచిన ఆమె పేరు ఎప్పటికి నిలిచి ఉంటుంది. ఇది నాకు ఒక చాలెజింగ్ రోల్’ అని తెలిపారు. ఈ చిత్రంలో వీరితో పాటు సోనమ్ కపూర్, పరేష్ రావల్, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.సంజయ్‌దత్ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలతో పాటు ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు. -
స్క్రీన్ టెస్ట్
► నాగార్జున నటించిన ‘రాజన్న’ సినిమా యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేసిన దర్శకుడు? ఎ) బోయపాటి శ్రీను బి) ఎస్.ఎస్. రాజమౌళి సి) వీవీ వినాయక్ డి) హరీష్ శంకర్ ► మహేశ్‌బాబు పలు సందర్భాల్లో ‘నాకు లైఫ్ మొత్తం ఒకే ఒక్కరంటే చాలా భయం’ అని చెప్పారు. ఆయన ఎవరికి భయపడుతుంటారు? ఎ) రమేశ్ బాబు (అన్న) బి) కృష్ణ (తండ్రి) సి) మంజుల (అక్క) డి) గల్లా జయదేÐŒ (బావ) ► ఐఐయంలో గ్రాడ్యుయేట్ చేసిన నటుడిగా నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన మరో నటుడు ఎవరో తెలుసా? ఎ) అవసరాల శ్రీనివాస్ బి) తనీష్ సి) విజయ్ దేవరకొండ డి) నిఖిల్ ► రజనీకాంత్ నటించిన ఓ సినిమాకి సంబంధించిన విశేషాలతో ఓ పుస్తకం విడుదలైంది. అది ఏ సినిమానో తెలుసా? ఎ) బాషా బి) అరుణాచలం సి) నరసింహా డి) బాబా ► గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన తెలుగు హాస్యనటుడు ఎవరు? ఎ) బ్రహ్మానందం బి) అలీ సి) కోటా శ్రీనివాసరావు డి) పద్మనాభం ► హాలీవుడ్ సినిమా ‘లైఫ్ ఆఫ్ పై’లో హీరో తల్లి పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరు. ఆమె తెలుగు, తమిళ్, హిందీలోనూ ఫేమస్ హీరోయిన్. ఎవరామె? ఎ) కంగనా రనౌత్ బి) టబు సి) మాధురీ దీక్షిత్ డి) మనీషా కోయిరాల ► అంతం, గాయం, అనగనగా ఒకరోజు చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) ఊర్మిళ మటోండ్కర్ బి) సాక్షి శివానంద్ సి) సోనాలి బింద్రే డి) జియా ఖాన్ ► డి.వి.వి. ప్రొడక్షన్స్‌లో మహేశ్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్గా కియరా అద్వాని నటించారు. అదే బ్యానర్లో ఆమె మరోసారి నటిస్తున్నారు. ఈ సారి హీరో మారారు. ఎవరా హీరో? ఎ) ఎన్టీఆర్ బి) రామ్ చరణ్ సి) ప్రభాస్ డి) అల్లు అర్జున్ ► ఈ నలుగురిలో మలయాళ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? (చిన్న క్లూ: తెలుగు ‘ప్రేమమ్’లో ఆమె నటించారు) ఎ) లావణ్యా త్రిపాఠి బి) అనుపమా పరమేశ్వరన్ సి) షాలినీ పాండే డి) రకుల్ ప్రీత్‌సింగ్ ► దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 25 సినిమాలకు పనిచేసిన పాటల రచయితెవరో కనుక్కోండి? ఎ) అనంత శ్రీరామ్ బి) భాస్కరభట్ల రవికుమార్ సి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి డి) వనమాలి ► ‘తేనె మనసులు’ సినిమాలో నటించిన బాలనటి తర్వాతి కాలంలో తెలుగు, తమిళ సినిమాల్లో చాలా పెద్ద హీరోయిన్ అయ్యింది. ఎవరో గుర్తు తెచ్చుకోండి ఓ సారి? ఎ) సుహాసిని బి) శ్రీదేవి సి) జయసుధ డి) జయప్రద ► నటి రాశీఖన్నా ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి? ఎ) దిస్ ఈజ్ రాశీ బి) మై నేమ్ ఈజ్ రాశీ సి) రాశీఖన్నా డి) యువర్స్ రాశీఖన్నా ► ‘ఏస్కో నా గుమా గుమా చాయ్ ’ అనే పాట నాగార్జున, అనుష్క జంటగా నటించిన ‘ఢమరుకం’ చిత్రంలోనిది. ఆ స్పెషల్ సాంగ్‌లో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) తమన్నా బి) కాజల్ అగర్వాల్ సి) చార్మీ కౌర్ డి) త్రిష ► ‘ప్రేమించిన మనిషిని వదులుకోవటం అంటే.. ప్రేమను వదులుకోవటం కాదు..’ అనే ౖyð లాగ్ శర్వానంద్ నటించిన ‘శతమానంభవతి’ లోనిది. ఆ సినిమా మాటల రచయితెవరు? ఎ) పరుచూరి బ్రదర్స్ బి) సతీశ్ వేగేశ్న సి) అబ్బూరి రవి డి) బెజవాడ ప్రసన్న ► నాగార్జునతో రామ్‌గోపాల్‌వర్మ ఇప్పుడు చేస్తున్న ఆఫీసర్ సినిమా వారిద్దరి కలయికలో వచ్చిన ఎన్నో సినిమా? ఎ) మూడో సినిమా బి) నాలుగో సినిమా సి) ఐదో సినిమా డి) ఏడో సినిమా ► ‘హలో’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ‘కల్యాణి ప్రియదర్శన్’ ఏ నటి కుమార్తె? ఎ) అంబికా బి) రాధ సి) లిజి డి) వాణీ విశ్వనాథ్ ► 2017వ సంవత్సరంలో నాగచైతన్య హీరోగా నటించిన ‘యుద్ధం శరణం’ సినిమాలో ప్రతి నాయకుని పాత్రలో నటించిన హీరో ఎవరో చెప్పుకోండి? ఎ) జగపతిబాబు బి) శ్రీకాంత్ సి) జె.డి.చక్రవర్తి డి) రాజేంద్రప్రసాద్ ► సమంతలో మంచి నటి ఉందని గుర్తించి. హీరోయిన్గా స్క్రీన్‌కి పరిచయం చేసిన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) విక్రమ్.కె. కుమార్ బి) గౌతమ్ మీనన్ సి) వంశీ పైడిపల్లి డి) దేవా కట్టా ► యస్వీ రంగారావు, ఎన్టీఆర్ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) నర్తనశాల బి) భూకైలాస్ సి) దీపావళి డి) ఇంద్రజిత్ ► ఈ ఫొటోలోని చిన్నారి ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్. ఆమె ఎవరో కనుక్కోండి? ఎ) భానుప్రియ బి) శోభనసి) జయప్రద డి) మీనా మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) సి 4) ఎ 5) ఎ 6) బి 7) ఎ 8) బి 9) బి 10) బి 11) ఎ 12) సి 13) సి 14) బి 15) బి 16) సి 17) బి18) బి19) డి20) బి నిర్వహణ: శివ మల్లాల -
లేడీ టైగర్
నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఎలెక్ట్ర’. శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో ఘన విజయం సాధించింది. ఈ సినిమాని ‘లేడీ టైగర్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సి.ఆర్. రాజన్ సమర్పణలో సురేశ్ సినిమా పతాకంపై సురేశ్ దూడల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా ముఖ్య పాత్ర పోషించారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ద్విపాత్రాభినయం చేశారు. బిజూ మీనన్ మరో మంచి పాత్ర చేశారు. నయనతార, మనీషా కొయిరాలా, ప్రకాశ్ రాజ్‌ల నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సార్ చేయించి, విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సరోజ సురేశ్, మాటలు: రాజశేఖర్ రెడ్డి, పాటలు: శ్రీరామ్మూర్తి. -
దిల్ సే... ఓ మాట!
‘దిల్ సే’ అంటే... ఫ్రమ్ ద హార్ట్ (‘గుండె లోతుల్లోంచి’ అనొచ్చు) అని మీనింగ్! షారూఖ్ ఖాన్, మనీషా కోయిరాల జంటగా దర్శకుడు మణిరత్నం తీసిన ‘దిల్ సే’ కూడా ప్రేక్షకుల గుండె లోతుల్లోని తడిని తట్టి లేపింది. ఎందరో ఆ సినిమాకు తమ హృదయంలో గుడి కట్టేశారు. అటువంటి ప్రేక్షకుల్లో అనుష్కా శర్మ కూడా ఒకరు. షారూఖ్ సరసన ‘రబ్ నే బనాదీ జోడీ’, ‘జబ్ తక్ హై జాన్’, ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ సినిమాల్లో నటించిన అనుష్కకు అతని ‘దిల్ సే’ అంటే చచ్చేంత ప్రేమ అట! అంతే కాదు... ఆ సినిమాను ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మళ్లీ తీయాలని కోరుకుంటున్నారు. ఇంకా అనుష్కా శర్మ మాట్లాడుతూ– ‘‘ఐ లవ్ ద మూవీ ‘దిల్ సే’. దాన్ని రీమేక్ చేస్తే... నేను మనీషా కోయిరాల పాత్రలో నటిస్తా. అందులో ఆమె పాత్ర, ఆమె నటించిన విధానం నాకెంతో నచ్చాయి’’ అని పేర్కొన్నారు. మనీషా కోయిరాల పాత్రలో నటించాలనుందని అనుష్కా శర్మ మనసులో మాటను బయట పెట్టేశారు. మరి, షారూఖ్ ఖాన్ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుంది? ఆలోచించండి! ఇంతకీ, దర్శకుడు మణిరత్నం అనుష్కా శర్మ మాటలను విన్నారో? లేదో? ‘దిల్ సే’ను రీమేక్ చేసే ఆలోచన ఆయనకు ఉందంటారా? లేదంటారా? వెయిట్ అండ్ సీ!! -
నా భర్త తప్పేమీ లేదు: నటి
ముంబయి: 1990 దశకంలో దర్శకుల హీరోయిన్గా రాణించిన నటి మనీషా కోయిరాలా. ఆపై ప్రేమ వివాహంలో కలతలు, క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన పడి ఎన్నో కష్టాలను తట్టుకుని నిలబడ్డారు మనీషా. ప్రస్తుతం సంజయ్ దత్ బయోపిక్‌లో ఆయన తల్లి నర్గీస్ దత్‌గా కీలక పాత్రలో నటిస్తున్న ఈ బ్యూటీ వివాహం తర్వాత 'డియర్ మాయా'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేపాలీ భామ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 'మా వైవాహిక జీవితం నా కారణంగానే విఫలమైంది. వ్యాపారవేత్త సమ్రాట్ దహల్‌ను ఎంతగానో ప్రేమించాను. 2010లో నేపాలీ సంప్రదాయంలోనే ప్రేమ పెళ్లి చేసుకున్నాను. ఫేస్బుక్ పరిచయంతో మా ప్రేమ మొదలైంది. పెళ్లయిన రెండేళ్లకే అంటే 2012లోనే మా బంధం తెగిపోయింది. ఇందుకు పూర్తి భాద్యత నాదే. నా భర్త సమ్రాట్ చాలా మంచివాడు. ఇందులో ఆయన తప్పేం లేదు. అందరు అమ్మాయిల్లాగే ఎన్నో కలలుకన్నాను. కానీ కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. బంధం గట్టిపడదని భావిస్తే విడిపోవడం ఇద్దరికీ మంచిదని నా అభిప్రాయం. విడాకుల ఆలోచన నాదే. ఇంకా చెప్పాలంటే పెళ్లి విషయంలో పెద్ద పొరపాటు చేశాననిపిస్తోంది. 2012లో విడాకులు తీసుకున్న కొన్ని రోజులకే క్యాన్సర్ బారిన పడ్డాను. మరుసటి ఏడాది విజయవంతంగా క్యాన్సర్‌ను జయించానని' మనీషా వివరించారు. మరోవైపు.. తన భర్త శత్రువుగా మారిపోయాడని 2011లో ఫేస్బుక్లో స్వయంగా పోస్ట్ చేసిన మనీషా.. ఇప్పుడు ఎందుకిలా స్వరం మార్చి తప్పును ఎందుకు తనపై వేసుకుంటుందని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
సంజయ్‌దత్ తల్లిగా మనీషా!!
1991లో వచ్చిన యాల్గార్, 1997లో వచ్చిన సనమ్, 1999లో వచ్చిన కర్టూస్.. ఈ సినిమాలు చూస్తే సంజయ్ దత్, మనీషా కొయిరాలా ఎంత హిట్ పెయిరో అర్థం అవుతుంది. వాళ్లిద్దరూ జంటగా చేసిన ఈ సినిమాలు అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పుడు అదే మనీషా.. అదే సంజయ్‌దత్‌కు తల్లిపాత్రలో నటించబోతోంది!! అవును ఇప్పుడు మీరెంత షాకయ్యారో, ఆ విషయం వినగానే మనీషా కొయిరాలా కూడా అంతే షాకైంది. సినిమాల్లో నటీనటులను బుక్ చేయడానికి ఏజెంటుగా వ్యవహరించే ముఖేష్ ఛాబ్రా మనీషాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే, ''ఏంటి నేను సంజూబాబాకు అమ్మనా'' అని గట్టిగా అరిచింది. తామిద్దరం జంటగా పలు సినిమాలు చేశామని, సంజయ్‌దత్‌తో కలిసి షూటింగ్ అంటే తాను సెట్లలో టామ్ బోయ్‌లా ఉండేదాన్నని, అలాంటిది ఇప్పుడు తల్లి పాత్రలు, అది కూడా సంజయ్‌దత్‌కు తల్లిగా చేయడం ఏంటని మండిపడింది. ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందో తనకు తెలుసని కూడా చెప్పింది. అయితే.. ఆ తర్వాత మళ్లీ ఆమె తన తల్లితో మాట్లాడిన తర్వాత మనసు మార్చుకుంది. నర్గీస్ దత్ పాత్ర అనగానే తన తల్లి ఎగిరి గంతేసినంత పని చేసిందని మనీషా చెప్పింది. జీవితంలో మళ్లీ మళ్లీ నర్గీస్ పాత్ర పోషించే అవకాశం రాదని తన తల్లి చెప్పారని, అప్పట్లో ఆమె తన ట్రేడ్‌మార్క్ తెల్ల చీరలతో సృష్టించిన సెన్సేషన్ గురించి వివరించారని మనీషా తెలిపింది. దాంతో తాను కూడా అంత లెజెండరీ హీరోయిన్ పాత్ర అనేసరికి కాదనలేక సరేనన్నానని చివరకు చెప్పింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న సంజయ్‌దత్ బయోపిక్‌లో ఇంకా రణబీర్ కపూర్, సోనమ్ కపూర్, పరేష్ రావెల్, విక్కీ కౌశల్, కరిష్మా తన్నా తదితరులు నటిస్తున్నారు. -
కేన్సర్ బాధితుల శిరోజాల కోసం...
మనోధైర్యం స్త్రీలకు శిరోజాల మీద ఉండే మమకారం అందరికీ తెలుసు. స్త్రీ సౌందర్యం శిరోజాలతోనే ముడిపడి ఉంది. కాని కేన్సర్ బాధితులు తమ చికిత్సలో భాగంగా మొదట కోల్పోయేది శిరోజాలనే. కిమోథెరపీలో శిరోజాలు ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో వ్యాధి వల్ల కలిగే వ్యాకులత కంటే శిరోజాల లేమి వల్ల కలిగే న్యూనత ఎక్కువగా ఉంటుంది. ఇది మగవారి కంటే ఆడవారినే ఎక్కువగా బాధిస్తుంది. ‘ఈ దశ తాత్కాలికమే. మళ్లీ శిరోజాలు వస్తాయి. కేన్సర్ బాధితులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వెంట్రుకలను కాపాడుకోవచ్చు. అందంగా తీర్చి దిద్దుకోవచ్చు’ అని ధైర్యమూ చైతన్యమూ ఇవ్వడానికి ముంబైలోని ‘నర్గిస్‌దత్ ఫౌండేషన్’ కొన్ని కార్యక్రమాలు చేస్తోంది. నర్గిస్‌దత్–సునిల్దత్ల కుమార్తె, సంజయ్ దత్ సోదరి అయిన ప్రియా దత్ ఈ కార్యక్రమాలకు రూపకర్త. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో నటి మనీషా కోయిరాల ప్రత్యేకంగా వచ్చి కేన్సర్ బాధితులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. మనీషా కేన్సర్ సర్వైవర్ అనే సంగతి అందరికీ తెలుసు. ఒవేరియన్ కేన్సర్ బారిన పడి దానిని ధైర్యం ఎదుర్కొని దాని నుంచి బయటపడిన మనీషా ఆ సందర్భంలో అందరి మల్లే తానూ శిరోజాలను కోల్పోయారు. ఇప్పుడు మంచి కేశాలతో ఆమె అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కొనవచ్చు’ అని ఆమె అంటున్నారు. మనీషా ఇప్పుడు ఉత్సాహంగా సినిమాల్లో కూడా నటిస్తున్నారు. సంజయ్ దత్ ఆత్మకథ ఆధారంగా రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఆమె నటిస్తున్నారు. నర్గిస్‌దత్ జీవితకథ ఆధారంగా రానున్న సినిమాలో ఆమె నర్గిస్‌దత్ పాత్రను పోషిస్తున్నట్టుగా కూడా వార్త. కష్టకాలం గడిచిపోతుంది... మంచి కాలం ఎప్పుడూ ముందు ఉంటుంది అనడానికి మనీషా ఒక ఉదాహరణ. -
సంజయ్ దత్ తల్లి నర్గిస్‌గా...
అలనాటి ప్రముఖ నటి, హీరో సంజయ్‌దత్ తల్లి నర్గిస్, హీరోయిన్ మనీషా కొయిరాల మధ్య ఓ సారూప్యం ఉంది. అదేంటంటే... ఇద్దరూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులే. 51 ఏళ్ల వయసులో క్యాన్సర్ కారణంగా నర్గిస్ మరణించారు. క్యాన్సర్‌ని జయించిన మనీషా మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు. బాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో తన టాలెంట్ చూపించడానికి సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారామె. ఈ తరుణంలో మనీషాకి నర్గిస్ పాత్రలో నటించే ఛాన్స్ లభించింది. సంజయ్‌దత్ జీవితం ఆధారంగా రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ బయోపిక్‌లో సంజయ్ తల్లి నర్గిస్ పాత్రకి మనీషాని ఎంపిక చేశారు. ‘‘మనీషాని ఎంపిక చేయడానికి ముఖ్య కారణం ఆమె క్యాన్సర్‌ను జయించడమే. ఆ బాధను ఆమె స్వయంగా అనుభవించారు’’ అన్నారు దర్శకుడు. జనవరి 17న ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. సంజయ్ పాత్ర కోసం రణబీర్ 13కిలోలు బరువు పెరిగారు. ఇందులో సంజయ్ తండ్రి సునీల్‌దత్ పాత్రలో పరేశ్ రావల్, సతీమణి మాన్యత పాత్రలో దియా మీర్జా, మాజీ ప్రేయసిగా సోనమ్ కపూర్, స్నేహితుడిగా విక్కీ కౌశల్, జర్నలిస్ట్‌గా అనుష్కా శర్మ నటిస్తున్నారు. -
కేన్సర్ నయంకాని జబ్బు కాదు
దానిని పాజిటివ్ దృక్పథంతో ధైర్యంగా ఎదుర్కోవాలి కేన్సర్ సదస్సులో ప్రముఖ సినీనటి మనిషా కొయిరాలా కేన్సర్‌తో జర్నీ నొప్పితో కూడింది.. అయినా పాజిటివ్‌గా చూడాలి అంతా మరిచిపోయి కుటుంబ సభ్యుల మధ్య హాయిగా గడపాలి సాక్షి, హైదరాబాద్: ‘కేన్సర్‌తో కూడిన జర్నీ చాలా నొప్పితో కూడింది. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాజిటివ్ దృక్పథంతో, ధైర్యంగా ఎదుర్కోవాలి. కేన్సర్ ఉన్న ట్లు తెలిసిన వెంటనే చాలామంది మానసికంగా కుంగిపోతారు. మనోధైర్యాన్ని కోల్పో యి మృత్యువాత పడుతున్నారు. నిజానికి కేన్సర్ నయం కాని జబ్బేమీ కాదు. ప్రాథమిక దశలోనే గుర్తించి, మందులు వాడితే కేన్సర్ నుంచి బయటపడొచ్చు’అని కేన్సర్ నుంచి విముక్తి పొందిన ప్రముఖ సినీనటి మనిషా కొయిరాలా పేర్కొన్నారు. అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో హెచ్ఐసీసీలో శనివారం నిర్వహించిన ‘అపోలో కేన్సర్ కాంక్లేవ్’సదస్సులో మనీషా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘కేన్సర్ ఉన్నట్లు తెలిసిన వెంటనే నేను ఓ సాధారణ రోగిలా ఆందోళన చెందాను. కీమోథెరపీ అంటే భయపడ్డాను. ఎక్కువ కాలం జీవించనేమోనని ఆందోళన చెందాను. వైద్యు ల స్ఫూర్తితో పాజిటివ్‌గా ఆలోచించాను. చికిత్సతో వ్యాధి నుంచి విముక్తి పొందాను. ప్రతి ఒక్కరూ ఇలాగే పాజిటివ్ దృక్పథంతో ఆలోచించి.. ధైర్యంగా ముందుకు సాగాలి’అని సూచించారు. ఈ సమయంలో ఒంటరిగా కూర్చుని బాధపడే కంటే.. అన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల జీవితకాలాన్ని పెంచుకోవచ్చన్నారు. జీవనశైలి మార్చుకోవాలి.. అపోలో ఆస్పత్రికి చెందిన ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ విజయ్ ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ.. 55% కేన్సర్లను నయం చేయవచ్చన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం, పరి సరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన నీరు తాగడం, మందు, మాంసం వంటి అలవాట్లకు దూరం గా ఉండటం, రోజూ వ్యాయామం చేయడం, వేళకు తినడం, నిద్రపోవడం ద్వారా వ్యాధు లు రాకుండా చూసుకోవచ్చన్నారు. కన్సల్టెం ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ.. విదేశాలతో పోలిస్తే దేశంలోనే అధికంగా కేన్సర్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. మనదేశంలో 40 ఏళ్లు దాటినవారు ఎక్కువగా కేన్సర్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇప్పటికై నా జీవనశైలిని మార్చుకోవాలని, లేదంటే భవిష్యత్తులో భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో 60% మంది రోగులు ఫోర్త్ స్టేజ్‌లో వైద్యులను ఆశ్రయిస్తున్నారని, వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రులకు రావడంతో ఏమీ చేయలేక పోతున్నారని తెలిపారు. కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎస్వీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. కేన్సర్ ఉన్నట్లైతే అది ముందే హెచ్చరికలు ఇస్తుందని.. శరీరంపై మచ్చలు ఏర్పడటం, బ్లీడింగ్ వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను ఆశ్రయించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. సదస్సులో అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, ఐపీఎస్ అధికారిణి స్వాతి లక్రా, ఉస్మానియా వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శశికళ, ఫిక్కి ఎఫ్ఎల్వో చైర్పర్సన్ పద్మ రాజగోపాల్, జుడే ఇండియా చైల్డ్‌కేర్ సెంటర్ ఎండీ సమంతారెడ్డి, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ టీపీఎస్ భండారి, హెమ టో ఆంకాలజిస్ట్ డాక్టర్ పద్మజా లక్కిరెడ్డి, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు. -
కేన్సర్ వస్తే భయపడొద్దు
- ధైర్యంగా ఎదుర్కోండి: సినీనటి మనీషా కొయిరాలా - వ్యాధి తీవ్రతను పార్లమెంటులో ప్రస్తావిస్తా: ఎంపీ కవిత - రోజూ కేన్సర్ బారిన 1700 మంది మృత్యువాత: సంగీతారెడ్డి - హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘అపోలో కేన్సర్ కాంక్లేవ్’ సాక్షి, హైదరాబాద్: కేన్సర్ వస్తే భయపడాల్సిన పనిలేదని.. దానికి సరైన చికిత్స ఉందని సినీనటి మనీషా కొయిరాలా చెప్పారు. ‘‘నాకు కేన్సర్ వచ్చినప్పుడు మొదట షాక్‌కు గురయ్యా. అనేక మంది భయపెట్టారు. అయితే నేను అనేక మంది వైద్యులను సంప్రదించా. ధైర్యంతో పోరాడి ఇప్పు డు క్యాన్సర్‌ను జయించా’’ అని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘అపోలో కేన్సర్ కాంక్లేవ్’ అంతర్జాతీయ సద స్సులో ఆమె మాట్లాడారు. కేన్సర్ వస్తే ఓపిగ్గా దానిపై అవగాహన పెంచుకోవాలని, ఆ తర్వాత సరైన చికిత్స చేయించుకోవాలన్నారు. 2 వేల రోగులకు ఒకరే : కవిత దేశంలో ప్రతీ 2 వేల మంది కేన్సర్ రోగులకు ఒక్క ఆంకాలజిస్టు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత అన్నారు. కేన్సర్‌తో ఉన్న ఇద్దరు మహిళల్లో ఒకరు చనిపోతున్నారని పేర్కొన్నారు. ‘‘కేన్సర్‌పై సమాచారాన్ని సేకరించి దాని తీవ్రతను పార్లమెంటులో ప్రస్తావిస్తా. కేన్సర్ చివరి దశలో ఉన్నప్పుడు రోగితో లక్షల రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నారు. దీంతో ఆ కుటుంబాలు వీధిన పడే పరిస్థితులు వస్తున్నాయి. ఇది ఎంత వరకు సరైనదో ఆసుపత్రులే ఆలోచించాలి’’అని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతిరోజూ 1,700 మంది క్యాన్సర్‌తో చనిపోతున్నారని అపోలో ఆసుపత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి చెప్పారు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ మెడికల్ టూరిజం అభివృద్ధికి కృషిచేస్తు న్నామన్నారు. ఈ సదస్సులో డాక్టర్ అఖిల ఎన్.విశ్వనాథన్, డాక్టర్ పి.విజయ్ ఆనంద్‌రెడ్డి, డాక్టర్ ఎస్వీఎస్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ పెళ్లి?
మంచి వ్యక్తి తారసపడితే మళ్లీ పెళ్లి గురించి ఆలోచిస్తానని మనీషా కొయిరాలా అన్నారు. ఈ నేపాలీ భామ ఆరేళ్ల క్రితం స్వదేశానికి చెందిన వ్యాపారవేత్త సామ్రాట్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత రెండేళ్లకు విడాకులు తీసు కున్నారు. క్యాన్సర్‌ను జయించిన మనీషా ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నారు. గతేడాది తమిళంలో ఓ సినిమా చేశారు. హిందీలో ‘డియర్ మాయ’, ‘మౌలాలి’ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. వ్యక్తిగత జీవితం గురించి మనీషా మాట్లాడుతూ - ‘‘వచ్చే ఏడాది ఓ అమ్మాయిని దత్తత తీసుకోవాలనుంది. నా కుటుంబ సభ్యులు నేపాల్‌లో ఉంటారు. ముంబయ్‌లో సెటిలయ్యాక ఒంటరిగా ఫీలవుతున్నా. ఓ మనిషి తోడు అవసరం అనిపించింది. అందుకే ఎవరినైనా దత్తత తీసుకోవాలని ఉంది. పెళ్లి కంటే ముందు దత్తత తీసుకోవాలనుకుంటున్నా’’ అన్నారు. -
డియర్.. నా సెకండ్ ఇన్నింగ్స్ కాదిది!
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీకి నేనెప్పుడూ దూరంగా లేను. నా సెకండ్ ఇన్నింగ్స్ కాదిది. మధ్యలో రెండు మూడేళ్లు గ్యాప్ వచ్చిందంతే. ఇకపై ఏడాదికి ఓ సినిమా చేస్తా’’ అన్నారు మనీషా కొయిరాలా. ‘ఒకే ఒక్కడు’, ‘బొంబాయి’, ‘క్రిమినల్’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ ఈ నేపాలీ భామ సుపరిచితురాలే. క్యాన్సర్ వ్యాధిని జయించిన తర్వాత ఇప్పుడు బాలీవుడ్లో ‘డియర్ మాయ’ అనే సినిమా చేస్తున్నారు. అల్రెడీ తమిళంలో ‘ఒరు మెల్లియ కోడు’ అనే సినిమా చేశారు. ఇక వరుసగా సినిమాలు చేస్తానంటున్నారు. ‘‘ఈతరం ప్రేక్షకులు అన్ని రకాల సినిమా లను ఆదరిస్తున్నారు. రిస్క్ చేయడానికి కథానాయికలకు బెరుకు ఎందుకు? మంచి ఫ్లాట్ఫార్మ్ ఉంది. కేవలం ఆటపాటలకు పరిమితం కావల్సిన అవసరం లేదు. మంచి మంచి పాత్రలు లభిస్తాయి. డిఫరెంట్, ప్యారలల్ సినిమాలంటూ లేవిప్పుడు. ప్రేక్షకులు అన్నిటినీ చూస్తున్నారు’’ అన్నారామె. -
'ఆ హీరోయిన్లలో ఒక్కరితోనైనా రొమాన్స్ చేయాలి'
న్యూఢిల్లీ: లవ్ ఎఫైర్లతో తరచూ వివాదాలలో చిక్కుకుంటున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. రూమర్ల కారణంతో ప్రేయసితో గొడవపడి బ్రేకప్ చెప్పేశాడు. ఇక విషయానికొస్తే.. యంగ్ హీరోలు తనకంటే తక్కువ వయసుండే హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడానికి ఒకే చెబుతుంటారు. అయితే సుశాంత్ మాత్రం తన టేస్ట్ ఏంటో చెప్పకనే చెబుతున్నాడు. తనకు ఒకవేళ అవకాశం ఇస్తే, కష్టసాధ్యమైనా సరే ముగ్గురు మాజీ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తానని అంటున్నాడు. 'ఎక్ దో తీన్' అంటూ కుర్రకారు గుండెల్లో రెండు దశాబ్దాల కిందట వేడి పుట్టించిన మాధురీ దీక్షిత్, డైరెక్టర్ల హీరోయిన్ గా, అందానికే హంగులు అద్దినట్లుగా ఉండే మనీషా కొయిరాలా, ఇప్పటికీ తనకంటూ గుర్తింపునిచ్చే క్యారెక్టర్లలో కనిపించే టబుతో కలిసి నటించాలని ఆశ పడుతున్నాడు సుశాంత్. ఎందుకుంటే ఆ ముగ్గురు సూపర్ హీరోయిన్లు. వారి అందం తనకు నిద్రలేని రాత్రులను కల్పించిందని చెప్పుకొచ్చాడు. ఆ ముగ్గురిలో కనీసం ఒక్కరితోనే రొమాన్స్ చేసే అవకాశం రావాలని మనసులో మాట చెప్పేశాడు. సుశాంత్ నటించిన ఎం.ఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ, రాబ్తా మూవీలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. -
బాలా చిత్రంలో మనీషా?
జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత బాలా దర్శకత్వంలో బాలీవుడ్ నటి మనీషాకోయిరాలా నటించనున్నారా? కోలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న తాజా చర్చ ఇది. ఇంతకు ముందు కోలీవుడ్‌లో ముదల్వన్, ముంబై, ఇండియన్, బాబా వంటి చిత్రాల్లో కథానాయకిగా నటించిన మనీషాకోయిరాలా ఆ తరువాత అనూహ్యంగా క్యాన్సర్ వ్యాధి బారిన పడి చిరకాలం పోరాడి గెలిచారు. తాజాగా అర్జున్ హీరోగా నటిస్తున్న ఒక మెల్లియ కోడు చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే దర్శకుడు బాలా తెరకెక్కించిన తారైతప్పట్టై చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. దీంతో ఆయన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆర్య, అరవింద్‌సామి, రానా, అధర్వ నలుగురు హీరోలు నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి కుట్ర పరంపరై అనే టైటిల్‌ను కూడా నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో అందాల భామ అనుష్క కథానాయికిగా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మనీషాకోయిరాలా పేరు తెరపైకి రావడం విశేషం. ఇందుకు కారణం బాలా, నటి మనీషాకోయిరాలా కలుసుకోవడమే. బాలా తన తాజా చిత్రాన్ని మల్టీస్టార్స్‌తో రూపొందించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆ స్టార్స్‌లో మనీషాకోయిరాలా ఒకరు కానున్నారనే మాట కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే వర్క్ మోర్ టాక్ లెస్ సూక్తికి సొంతదారుడైన బాలా తన తాజా చిత్రం గురించి ఇంత వరకూ పెదవి విప్పలేదన్నది గమనార్హం. -
సౌత్‌లోకి బాలీవుడ్ నటి రీఎంట్రీ!
చెన్నై: నిన్నటితరం బాలీవుడ్ హీరోయిన్ మనీషా కోయిరాలాకు దక్షిణాది సినీ పరిశ్రమతో మంచి అనుబంధముంది. 'కిమినల్', 'భారతీయుడు', 'బొంబాయి' సినిమాలతో దక్షిణాదిలోనూ మనీష పేరు తెచ్చుకోంది. ఇప్పుడు మరోసారి దక్షిణాది సినిమాలో నటించేందుకు ఆమె సిద్ధమవుతోంది. జాతీయ అవార్డు సాధించిన ప్రఖ్యాత దర్శకుడు బాలా తమిళంలో తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్లో మనీషా కోయిరాలా కూడా నటించనుంది. ఇప్పటికీ పేరు ఖరారుకాని ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభం కానుంది. చిత్రంలో విశాల్, ఆధ్వర్వ, ఆర్య, అరవింద స్వామి, మనీషా ప్రధాన పాత్రల్లో నటించనున్నారని, మరో కీలక పాత్ర కోసం అనుష్కను అడుగుతున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు 'కుట్ర పరంపరై' టైటిల్ ఖరారు చేస్తారని వినిపిస్తోంది. బాలా సొంత బ్యానర్ బీ స్టూడియోపై స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను తెరకెక్కించవచ్చునని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా.. బాలా తాజా సినిమా 'థరై థప్పట్టై' విడుదల ఆలస్యంగా కారణంగా ఈ ప్రాజెక్టు లో జాప్యం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, బాలా తాజా సినిమా 'థరై థప్పటై' గురువారం ప్రపంచమంతటా విడుదల కానుంది. -
అవన్నీ నమ్మొద్దు..!
గాసిప్ మనీషా కోయిరాలా ఒకప్పటి అగ్రశ్రేణి హీరోయిన్. నిజజీవితంలో చాలామంది అమ్మాయిలకు ఎదురయ్యే అనుభవమే ఆమెనూ ఇబ్బంది పెట్టింది. చాలామంది ఫేక్ అకౌంట్‌తో ఎదుటివాళ్లను నమ్మిస్తుంటారు. కానీ ఇక్కడ ఆమె పేరు చెప్పి, తానే మనీషానంటూ చాలామంది తప్పుడు యవ్వారాలకు పాల్పడుతున్నారట. అచ్చం... ఆమె పంపినట్టే సందేశాలు పంపుతున్నారట. ఆమె నడుపుతున్నట్టే ఫేస్బుక్ అకౌంట్ నడుపుతున్నారట. అలాంటి సంఘటనలు ఆమె దృష్టికి కూడా వచ్చాయట. ఆమె పంపని సందేశాలు పంపడం, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆమె రాసుకున్నట్లే గాసిప్‌లు రాయడం చేస్తున్నారట. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు ఇదేమిటంటూ షాక్‌కు గురవుతున్నారట. చనువున్న కొందరు ఆమెనే నేరుగా నిలదీస్తున్నారట. ఆమె కూడా తెలియక ఏమిటని అడిగితే... ఈ వ్యవహారాలు ఆమె దృష్టికి వచ్చాయట. దాంతో అలర్ట్ అయిన ఆమె ‘ఈ ఫేక్ గాసిప్స్ నమ్మకండి’ అంటూ స్వయంగా ప్రకటించాల్సి వచ్చిందట! -
అభిమానులకు హీరోయిన్ హెచ్చరిక!
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా అభిమానులకు హెచ్చరిక జారీ చేసింది. ఫ్యాన్స్ పై ఆమెకు కోపం వచ్చిందని అపార్థం చేసుకోకండి. ఫేస్ బుక్ లో తన పేరుతో లెక్కకు మిక్కిలిగా ఉన్న నకిలీ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అభిమానులకు సూచించింది. 'ఫేస్ బుక్ లో నా పేరుతో చాలా నకిలీ అకౌంట్లు ఉన్నాయి. వీటికి స్పందిచకండి' అని మనీష ట్వీట్ చేసింది. అలాగే తన మాతృభూమి నేపాల్ లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపైనా ఆమె స్పందించింది. వ్యతిరేకించడానికి తుపాకులకు బదులుగా శాంతియుత మార్గం ఎంచుకోవాలని సూచించింది. ఒవేరియన్ కేన్సర్ బారిన పడి, చికిత్స చేయించుకున్న ఆమె ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని వెల్లడించింది. -
మనీషా మనసు పడింది!
ఓ లుక్కేస్తారా! అందాల రాక్షసి మనీషా కొయిరాలా కమల్‌హసన్‌కు భార్యగా నటించాలని మనసు పడిందట. కమల్ ప్రధానపాత్రగా ఈ నెలలో మొదలు కాబోతున్న తమిళ థ్రిల్లర్‌లో కమల్ భార్య పాత్రలో మనీష కనిపించనుంది. నిజానికి ఇది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రే. గతంలో ‘భారతీయుడు’ సినిమాలో కమల్‌హాసన్‌తో నటించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది మనీషా కొయిరాలా. -
ముగ్గురు భామలతో కమల్
విశ్వనాయకుడు కమలహాసన్ తన చిత్రంలో ఈ మధ్య ముగ్గురు హీరోయిన్లకు తక్కువ నటించడం లేదు. ఆ మధ్య నటించిన దశావతారం చిత్రంలో ఆశిన్, జయప్రద, మల్లికా షెరావత్ అంటూ ముగ్గురు హీరోయిన్లతో నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తరువాత విశ్వరూపం చిత్రంలో ఆండ్రియా, పూజాకుమార్‌లతో డ్యూయెట్స్ పాడారు. ఆ చిత్రం విజయాన్ని చూసింది. అయితే ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే విశ్వరూపం-2 చిత్రం చేశారు. అందులోనూ ఆ ఇద్దరే హీరోయిన్లు. ఇక ఇటీవల విడుదలైన ఉత్తమవిలన్ చిత్రంలో ఆండ్రియా, పూజాకుమార్, ఊర్వశి, పార్వతి నాయర్, పార్వతి మీనన్ అంటూ ఐదుగురు కథానాయికలతో నటించారు. ఈ చిత్రం విమర్శకులను మెప్పించింది. విశ్వరూపం-2 విడుదల కావలసి ఉంది.కమల్ నటించిన తాజా చిత్రం పాపనాశనం త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో నటి గౌతమి ఒక్కరే నాయకి. కమల్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్‌కు రెడీ అవుతున్నారు. ఈ చిత్ర కథ జేమ్స్‌బాండ్ చిత్రాల తరహాలో ఉంటుందని తెలిసింది. ఆ తరహా చిత్రం అంటే ఖచ్చితంగా హీరోయిన్లు ఇద్దరికి మించే ఉంటారు. ఈ చిత్రానికి తూంగావనం అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో నటి త్రిష హీరోయిన్గా ఎంపికయ్యారు. తాజాగా మనీషాకొయిరాలా, అనైకసోటి నటించనున్నట్లు సమాచారం. త్రిష ఇప్పటికే కమలహాసన్ సరసన మన్మథన్ అన్భులో నటించారు. మనీషా కొయిరాలా ముంబయి ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నటించారు. అనైక మాత్రం కమల్‌తో తొలిసారిగా నటించే లక్కీచాన్స్ కొట్టేసింది. విశ్వరూపం సీక్వెల్స్‌ను, ఉత్తమ విలన్ చిత్రంలోనూ వరుస అవకాశాలు కల్పించిన ఆండ్రియా, పూజాకుమార్లకు చిత్రంలో కమల్ స్థానం కనిపించలేదు. -
మాతృభూమి సేవకు మనీషా కోయిరాలా
భారీ భూకంపంతో కకావికలమైన తన మాతృదేశం నేపాల్‌లో మహిళలకు సేవలందించేందుకు బాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త మనీషా కోయిరాలా నడుం బిగించింది. ప్రస్తుతం గర్భవతులుగా ఉన్నవారితోపాటు భూకంపం ప్రభావంతో గర్భం కోల్పోయిన మహిళలు, ఇతర ఆరోగ్య కారణాలతో బాధపడుతున్న బాలికలకు అవసరమైన మేరకు సేవలందించేందుకు సిద్ధమైంది. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్ ఎఫ్‌పీఏ) నేపాల్ విభాగం గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితురాలైన ఆమె.. కష్టకాలంలో మాతృదేశానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. భూకంపం ప్రభావంతో దాదాపు లక్ష మందికిపైగా గర్భాన్ని కోల్పోయారని, మరో 1.30 లక్షల మంది ప్రసవించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారందరికీ వైద్యసేవలు అందించేందుకు యూఎన్ ఏఫ్ పీఏ కృషి చేస్తున్నదని ఆ సంస్థ నేపాల్ ప్రతినిధి గ్యూలియా వెల్లెస్ చెప్పారు. యూఎన్ ఎఫ్‌పీఏ నేపాల్ విభాగం గుడ్‌విల్ అంబాసిడర్‌గా మనీషా కోయిరాలా పనితీరు అందరినీ మెప్పిస్తుందన్నారు. -
‘గేమ్’ చిత్రంపై కాంగ్రెస్ గుబులు
చెన్నై: సమాజంలో జరిగిన యధార్థ సంఘటనలనే ఇతివృత్తంగా తీసుకొని సినిమాలు తీసి సంచలనం సృష్టించే ప్రముఖ కన్నడ, తమిళ దర్శకుడు ఏఎంఆర్ రమేశ్, మరో యధార్థ సంఘటన ఆధారంగా తీస్తున్న ‘గేమ్’ చిత్రం కాంగ్రెస్ గుండెల్లో గుబులు రేపుతోంది. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్ ఆత్మహత్య సంఘటననే ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, ఇందులో సునంద పుష్కర్ పాత్రను మనీషా కోయిరాల నటిస్తున్నారని ప్రచారం కావడంతో కాంగ్రెస్ పార్టీ కలవర పడుతోంది. సినిమా స్క్రిప్ట్ ఏమిటో తెలుసుకునేందుకు సినీ వర్గాల నుంచి కూపీ లాగేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ కుష్బూ కూడా విషయం ఏమిటో తెలుసుకునేందుకు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన దర్శకుడు రమేశ్. చిత్రం కథా కమామిషు గురించి వెల్లడించడం లేదు. సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపైనే సినిమా తీస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించనూ లేదు. అలా అని ధ్రువీకరించనూ లేదు. ఓ వీఐపీ మరణం చుట్టూ తిరిగే క్రైమ్ స్టోరీ అని ముక్తిసరిగా చెప్పారు. అంతకుమించి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఎవరికైనా సినిమా తీయడానికి పనికొచ్చే అంశం సునంద పుష్కర్ జీవితమని కర్నాటక కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎం. రామచంద్రప్ప వ్యాఖ్యానించారు. అయితే నిజ జీవితంపై సినిమా తీయాలనుకున్నప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరని చలన చిత్ర వాణిజ్య మండలి నిబంధన తెలియజేస్తోందని ఆయన చెప్పారు. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే సినిమా విడుదల సందర్భంగా సరైన వేదికపై సరైన పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇంతకుముందు దర్శకుడు రమేశ్, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్యపై ‘సైనైడ్’ చిత్రాన్ని, స్మగ్లర్ వీరప్పన్ ఎన్‌కౌంటర్‌పై ‘అట్టహాస’ చిత్రాలను తీసి సంచలనం సృష్టించారు. -
'మోదీ.. మీ మేలు మర్చిపోలేము'
-
మోదీ.. మీ మేలు మర్చిపోలేము
ముంబయి: నేపాల్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించిన భారత ప్రధాని నరేంద్రమోదీకి బాలీవుడ్ నటి, నేపాల్‌కు చెందిన మనీషా కోయిరాలా ధన్యవాదాలు తెలిపింది. టీవీలో నేపాల్ దుర్ఘటనను చూసి కన్నీటి పర్యంతమయ్యానని, నేపాల్ ను ఆదుకునేందుకు వెంటనే కదిలిన భారత్‌కు ఎంతమేర ధన్యవాదాలు చెప్పినా సరిపోవని అన్నారు. 'నేపాల్ ను చూశాక నా కళ్లలో కన్నీళ్లు సుడులు తిరిగాయి. ఈ సందర్భంగా సహాయం అంధించిన భారత్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు ఇంత తొందరగా స్పందించి చేసిన సాయాన్ని అన్ని వేళలా మా గుండెల్లో గుర్తుంచుకొని ఉంటాం.. ధన్యవాదాలు ప్రధాని నరేంద్ర మోదీ' గారు అంటూ ఆమె ట్విట్టర్, ఫేస్ బుక్ లలో తెలిపారు. -
సునందా పుష్కర్ ఆత్మహత్యోదంతమా?
నటి కుష్బు పేరు మరోసారి వార్తల్లో కెక్కింది. దర్శకుడు ఏఎం ఆర్మ్రేష్ ఆమెపై ధ్వజమెత్తారు. ఇంతకుముందు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఇతివృత్తంతో వనయుద్ధం, రాజీవ్‌గాంధీ హత్యోదంతో కుప్పి చిత్రాన్ని తెరకెక్కించిన ఈయన తాజాగా ఒరు మెల్లియకొడు పేరుతో చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో అర్జున్, శ్యామ్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి శశిధర్ భార్య సునందా పుష్కర్ ఆత్మహత్య సంఘటన ఇతివృత్తంతో రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ చిత్ర కథ గురించి చెప్పాలని చిత్ర యూనిట్ సభ్యులను కుష్బు డిమాండ్ చేసినట్లు దర్శకుడు రమేష్ ఆరోపణలు చేశారు. అంతేకాదు కుష్బు చర్యలను ఆయన మండిపడ్డారు. కుష్బు తమ యూనిట్‌కు చెందిన ఒకరితో చిత్ర కథ గురించి విచారించారన్నారు. సునందా పుష్కర్ ఆత్మహత్యోదంతమా? అంటూ అడిగారని అన్నారు. అయితే తన చిత్ర కథను ఎవరికి చెప్పేది లేదన్నారు. ఏ దర్శకుడు, నటుడు తన చిత్ర కథ గురించి బయటకు చెప్పరన్నారు. అయినా కుష్బు తన సహాయ దర్శకుడిని కథ గురించి అడిగేకంటే డెరైక్ట్‌గా తననే అడగవచ్చన్నారు. నిజమే తన చిత్రం ఒక మర్మ హత్య సంఘటన ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రమేనని స్పష్టం చేశారు. మనీషా కొయిరాల హత్యకు గురవుతారన్నారు. ఆ హత్య గురించి ఇన్వెస్టిగేషన్నే చిత్ర ఇతివృత్తం అని చెప్పారు. ఇంతకంటే ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని దర్శకుడు రమేష్ అన్నారు. నేను ఎవరినీ అడగలేదు : రమేష్ ఆరోపణలను నటి కుష్బు ఖండించారు. దీని గురించి ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ సునందా పుష్కర్ ఆత్మహత్య సంఘటన ఇతివృత్తంలో చిత్రం రూపొందుతోందని ఆ చిత్ర కథ గురించి చెప్పాలని తాను డిమాండ్ చేసినట్లు అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. నిజానికి అలా తాను ఎవరినీ అడగలేదని స్పష్టం చేశారు. అర్జున్ భార్య చిత్రంలో నటించమని తనను అడిగారన్నారు. తాను చిత్రాల్లో నటించడం మానేసి చాలా కాలం అయ్యిందని వారికి చెప్పానని అంతేకానీ కథ గురించి కూడా అడగలేదని కుష్బు పేర్కొన్నారు. -
‘గేమ్’కి రెడీ!
1942 -ఎ లవ్‌స్టోరీ, బొంబాయి, ఒకే ఒక్కడు తదితర చిత్రాలతో బోల్డంత క్రేజ్ తెచ్చుకున్నారు మనీషా కొయిరాలా. ఈ నేపాలీ బ్యూటీకి క్యాన్సర్ వ్యాధి సోకితే, ధైర్యంగా చికిత్స చేయించుకుని బయటపడ్డారు. ఇప్పుడు నూతనోత్సాహంతో మళ్లీ సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యారు. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించనున్న ‘గేమ్’ అనే కన్నడ చిత్రంలో ఆమె నటించనున్నారు. ఇటీవలే లుక్ టెస్ట్ చేశారు. ఇక్కడ చూస్తున్నది ఆ లుక్ తాలూకు ఫొటోనే. -
మళ్లీ అర్జున్‌తో..?
దాదాపు పదిహేనేళ్ల క్రితం విడుదలైన ‘ఒకే ఒక్కడు’ చిత్రం ఇప్పటికీ అందరికీ గుర్తుంది. ఆ చిత్రంలో నటించిన అర్జున్, మనీషా కొయిరాలా జంట చూడముచ్చటగా అనిపిస్తుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ ‘గేమ్’ అనే ఓ కన్నడ చిత్రంలో జతకట్టే అవకాశం ఉందని సమాచారం. -
ఆధ్యాత్మిక పాఠాలతో బిజీ!
నేపాలీ బ్యూటీ మనీషా కొయిరాలా ఈ మధ్య ఎక్కువగా ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నారు. ఒవేరియన్ కేన్సర్ సోకి, చికిత్స చేయించుకున్న ఆమె ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. గత రెండు, మూడేళ్లలోని పరిణామాలు ఆమెను ఆధ్యాత్మిక బాట వైపు నడిపించాయని చెప్పక తప్పదు. వాస్తవానికి కేన్సర్ సంగతి బయట పడకముందే మనీషా ఆధ్యాత్మికం వైపు దృష్టి పెట్టేవారు. కాకపోతే ఇప్పుడు మరింత ఉద్ధృతంగా ఆ వైపు వెళుతున్నారు. చెన్నయ్ శివార్లలో ఆశ్రమం ఉన్న ఓ గురువు గారి బోధనలకు మనీషా ఆకర్షితులయ్యారు. ఈ మధ్య ఎక్కువగా ఆమె అక్కడే గడుపుతున్నారు. అక్కడే ఆమె ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుతున్నారట. ధ్యానం, జపం విలువలను కూడా పిల్లలకు బోధిస్తున్నారట. -
మళ్లీ తెరపైకి మనీషా..
కేన్సర్‌తో పోరాటం తర్వాత తేరుకున్న మనీషా కోయిరాలా త్వరలోనే మళ్లీ తెరపైకి రానుంది. రాజ్‌కుమార్ సంతోషి తదుపరి చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించేందుకు రాజ్‌కుమార్ సంతోషి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మనీషా ప్రస్తుతం పూర్తిగా కోలుకుందని ఆమె మేనేజర్ మీడియాకు వెల్లడించాడు. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో మనీషా ఇదివరకు ‘లజ్జ’ చిత్రంలో నటించింది. -
మళ్లీ మేకప్ వేసుకుంటున్న మనీషా కొయిరాలా
'నెల్లూరి నెరజాణా...' అంటూ ఒకేఒక్కడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మనీషా కొయిరాలా.. మళ్లీ మేకప్ వేసుకుంటోంది. కేన్సర్‌తో పోరాడి.. విజయం సాధించిన మనీషా ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. యోగాతో తనను తాను మళ్లీ పూర్తి ఆరోగ్యవంతురాలిగా తీర్చిదిద్దుకుంది. అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే, రాజ్‌కుమార్ సంతోషి తీయబోయే తదుపరి చిత్రంలో ఆమె నటించే అవకాశం ఉంది. మనీషా ఇప్పుడు చాలా బాగుందని, ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉందని ఆమె మేనేజర్ సుబ్రతో ఘోష్ తెలిపారు. ప్రస్తుతం ఆమె స్క్రిప్టులు చదువుతోందని, రాజ్‌కుమార్ సంతోషి తదుపరి చిత్రం దాదాపు ఓకే అయిపోయిందని అన్నారు. స్క్రిప్టు ఆమెకు బాగా నచ్చిందని, అన్నీ బాగుంటే 2015 జనవరిలో షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. ఈ చిత్రంలో మనీషా ప్రధానపాత్రలో నటిస్తుందని, పంకజ్ కపూర్ కూడా అందులో ఉంటారని అన్నారు. -
నేను సంతోషంగా ఉన్నా..!
లక్ష్యసాధనకు ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదని నిరూపించారు అలనాటి బాలీవుడ్ గ్లామర్‌డాల్ మనీషా కొయిరాలా. భయంకరమైన కేన్సర్ వ్యాధిని జయించడం కోసం ఆమె ఎంతగానో పోరాడారు. చివరకు అనుకున్నది సాధించారు కూడా. ఇప్పుడు మనీషా పూర్తి ఆరోగ్యవంతురాలు. తాజాగా జిమ్‌లో వ్యాయామం చేసి బయటికొస్తూ మనీషా తీయించుకున్న ఈ ఫొటోగ్రాఫే అందుకు నిదర్శనం. ఈ ఫొటోని ట్విట్టర్లో పోస్ట్ చేసి, తన ఆరోగ్యం పట్ల ఆనందం వెలిబుచ్చారామె. ‘‘మరణం అంచులదాకా వెళ్లి తిరిగొచ్చాను. ఆత్మవిశ్వాసంతో కేన్సర్‌ను సైతం జయించాను. దైవ ప్రార్థనలు, మెడిటేషన్, యోగా, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ, మితాహారం...ఇవన్నీ నా పునర్వైభవానికి కారణాలయ్యాయి. దేవుని దయ వల్ల సంతోషంగా ఉన్నాను. ఇక ముందు కూడా ఇలాగే ఉంటానని ఆశిస్తున్నాను. నా గురించి ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని మనీషా ట్వీట్ చేశారు. -
మీనాకుమారిగా మనీషా!
-
మీనాకుమారిగా మనీషా!
నిన్నటితరం విషాద నాయిక మీనాకుమారి జీవితకథ ఆధారంగా దర్శకుడు శశిలాల్ నయ్యర్ రూపొందించనున్న చిత్రంలో మనీషా కొయిరాలా నటించనున్నట్లు సమాచారం. మీనాకుమారి సవతి కొడుకు తాజ్దార్ అమ్రోహీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. లిరిసిస్ట్‌గా అక్షయ్‌కుమార్ బాలీవుడ్ తారలు పాటలు పాడటం ఇటీవల ట్రెండ్‌గా మారిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ ఓ అడుగు ముందుకేసి లిరిసిస్ట్‌గా కూడా మారాడు. ‘డేర్ 2 డాన్స్’ టీవీ రియాలిటీ షో కోసం టైటిల్ ట్రాక్‌కు అక్షయ్ ర్యాప్ సాంగ్ రాశాడు. ఒక్కరోజులోనే అతడు ఈ పాటను రాసేయడం విశేషం. రణబీర్ ‘షార్ట్’కట్ రణబీర్ కపూర్ తన తాత, దివంగత నటుడు రాజ్‌కపూర్ జీవితాన్ని తెరకెక్కించేందుకు ‘షార్ట్’కట్‌ను ఎంచుకున్నాడు. తన తాత జీవితం ఆసక్తికరమైనదని, ఆయన జీవితం ఆధారంగా షార్ట్ఫిలిమ్ రూపొందించాలనుకుంటున్నానని రణబీర్ చెబుతున్నాడు. -
వెండితెరపై మనీషా జీవితం?
జీవితంలో ఎంతో క్లిష్టమైన సమస్యలను సైతం ధైర్యంగా ఎదుర్కొన్నవాళ్లెవరైనా ఇతరులకు ఆదర్శమే. ఆ విధంగా చూస్తే మనీషా కొయిరాలా చాలామందికి ఆదర్శం. రెండేళ్ల క్రితం ఈ నేపాలీ బ్యూటీ జీవితం ఊహించని ఓ మలుపు తీసుకున్న విషయం తెలిసిందే. ‘ఒవేరియన్ కేన్సర్’ సోకడంతో షాకయ్యారామె. కానీ, డీలా పడిపోలేదు. చికిత్స నిమిత్తం మనీషా న్యూయార్క్ వెళ్లారు. తన ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు చికిత్సకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు మనీషా. సంపూర్ణ ఆరోగ్యంతో న్యూయార్క్ నుంచి ముంబయ్ వచ్చిన మనీషా కొన్నాళ్లు విరామం తీసుకున్నారు. ఆ తర్వత కేన్సర్ వ్యాధి గురించి అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి, ‘కేన్సర్ అనేది భయపడాల్సి విషయం కాదు. చికిత్స చేయించుకుంటే నయమవుతుంది’ అని ధైర్యం నూరిపోస్తున్నారు. ఇది ఎంతోమందిలో కొత్త ఆశలు కల్పిస్తున్నారు. అదే ఆమె జీవితాన్ని సినిమాగా తీస్తే, ఎక్కువమంది స్ఫూర్తి పొందడానికి వీలుంటుంది కదా అని ఓ బాలీవుడ్ ఫిలిం మేకర్‌కి ఆలోచన వచ్చింది. మనీషా అనుమతి తీసుకుని ఈ సినిమా చేయాలనుకుంటున్నారట. కథ, స్క్రీన్‌ప్లే విషయాల్లో మనీషా జోక్యం ఉంటుందని సమాచారం. మరి.. ఈ సినిమాలో మనీషా నటిస్తారా? లేదా అనేది కాలమే చెప్పాలి. -
ఆదర్శం... ఆ ముగ్గురి ధైర్యం..!
చిన్నపాటి తలనొప్పికే చాలామంది పెద్ద రోగం ఏదో వచ్చినట్లుగా బాధపడిపోతారు. ఇక, మెల్లి మెల్లిగా శరీరాన్ని తినేసే కేన్సర్ అంటే, ఆ బెంగతోనే తనువు చాలించేస్తారు కొంతమంది. కానీ, గౌతమి, మమతా మోహన్‌దాస్, మనీషా కొయిరాలా అలాంటివాళ్లు కాదు. బ్రెస్ట్ కేన్సర్ అని తెలియగానే గౌతమి బెంబేలుపడిపోలేదు. దశలవారీగా ఎంతో ఓపికగా చికిత్స చేయించుకున్నారు. కీమోథెరపీ కూడా జరిగింది. జీవితంలో బాధాకరమైన ఆ రోజులను ఓ సవాల్‌గా తీసుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డారామె. తన ఆరోగ్యం బాగుపడిందని ఆమె సంతృప్తి చెందలేదు. కేన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి నడుం బిగించారు. అప్పట్నుంచి ఈ రోగానికి సంబంధించిన సదస్సులకు హాజరై, చికిత్సా విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఇక, మమతా మోహన్‌దాస్ కూడా మానసికంగా ఎంతో ధైర్యవంతురాలు. సినిమాలతో తీరిక లేకుండా ఉన్నప్పుడే, కేన్సర్ విషయం బయటపడింది. ఓసారి చికిత్స చేయించుకుని, ఇక భయం లేదనుకున్నారామె. రెండోసారి తిరగబెట్టింది. మామూలుగా బలహీన మనస్కులైతే కుంగిపోతారు. కానీ, మమత ఈసారి కూడా ధైర్యంగా ఢీకొన్నారు. ఇటీవలే చికిత్స ముగిసింది. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారామె. మనీషా కొయిరాలా కూడా డాషింగే. ఒవేరియన్ కేన్సర్ సోకిందామెకు. ముంబయ్‌లో పరీక్షల అనంతరం యూఎస్ వెళ్లి, చికిత్స చేయించుకున్నారు ఈ నేపాలీ బ్యూటీ. ఇటీవలే కొత్త జీవితాన్ని ఆరంభించారు. తమలా కేన్సర్ మహమ్మారికి గురైనవారిలో ఆత్మవిశ్వాసం పెంచడమే ఈ ముగ్గురి ప్రధాన లక్ష్యం. కేన్సర్ వ్యాధికి సంబంధించిన అవగాహనా సదస్సుల్లో పాల్గొని, తమ అనుభవాలను వివరిస్తుంటారు. ఈ ముగ్గురు కథానాయికలూ ఎంతోమందికి ఆదర్శప్రాయం. -
ఆ విషయంలో సినిమాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి!
‘‘అన్నీ బాగుంటే జీవితం మధురంగా ఉంటుంది. కానీ, విధి చిన్న చూపు చూస్తే మాత్రం భారంగా మారిపోతోంది. ఆ భారాన్ని ఆత్మస్థయిర్యంతో మోయగలిగితే ఆనందం మన సొంతం అవుతుంది’’... ఏంటీ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా? నేపాలీ సుందరి మనీషా కొయిరాలా ప్రస్తుతం ఈ విధంగానే మాట్లాడుతున్నారు. రెండుమూడేళ్ల క్రితం వరకు జీవితం గురించి ఆమె అంత లోతుగా ఆలోచించేవారు కాదు. కానీ, కేన్సర్ వ్యాధి సోకిన తర్వాత ఆమె ఆలోచనల్లో మార్పొచ్చింది. కేన్సర్ వ్యాధి గురించి అవగాహన కలిగించే కార్యక్రమాల్లో పాల్గొని, పదిమందిలో ఆత్మస్థయిర్యం నింపుతున్నారామె.ఇక మనీషా మనోభావాలు తెలుసుకుందాం... + నేను ఒకప్పటి మనీషాని కాదు. ఇప్పుడు ఏ విషయాన్నయినా స్పష్టంగా అవగాహన చేసుకోగలుగుతున్నాను. జీవితం చాలా విలువైనది. ‘ఈరోజు మనం బతికున్నందుకు ఆనందపడాలి’ అనే భావన ప్రతి ఒక్కరికీ కలగాలి. ఎందుకంటే, ఏ రోజు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. అలాగే, మన చుట్టూ ఉన్నవాళ్లని గౌరవించాలి, ప్రేమించాలి. ఎందుకంటే, ఎవరు ముందు.. ఎవరు వెనకా అనేది ఒక్క దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. మనిషి లేని లోటు పూడ్చలేనిది. + కేన్సర్ వ్యాధి సోకిందనగానే అప్పటికప్పుడు భూమి బద్దలైపోయినట్లు, ప్రపంచం తలకిందులైపోయినట్లుగా డీలా పడిపోతారు చాలామంది. అది సహజం. కానీ, ఆ వ్యాధి గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడంతో పాటు చికిత్సా విధానాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మానసికంగా కుంగిపోతే శారీరకంగా బలహీనపడిపోతాం. ఫలితంగా చికిత్స చేయించుకోవడానికి వీలు లేనంతగా ఆరోగ్యం పాడైపోతుంది. + సినిమాల ప్రభావం ప్రజల్లో ఉంటుంది. మన సినిమాల్లో కేన్సర్ అంటే ఆ పాత్ర బతికి బయటపడినట్లుగా చూపించరు. ఆ పాత్ర చనిపోవాల్సిందే. ఆ విధంగా ప్రేక్షకులను సినిమాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఆ ప్రభావం ఉన్నందునో ఏమో కేన్సర్ అనగానే ఇక బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందేనని ఫిక్స్ అవుతున్నారు. అదే కనుక సినిమాల్లో ఈ వ్యాధికి చికిత్స చేయించుకుంటే, నిక్షేపంగా బతకొచ్చని చూపిస్తే, కేన్సర్‌ని పెనుభూతంలా చూడటం తగ్గుతుందేమో. + కేన్సర్ వ్యాధి, చికిత్సా విధానం గురించి మన దేశంలో చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు. కానీ, మారుమూల పల్లెల సంగతేంటి? అక్కడ కనీస సౌకర్యాలుండవు. నిరక్షరాస్యుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. మా కుటుంబంలో అందరం ఉన్నత చదువులు చదువుకున్నవాళ్లమే. అందుకే, పరీక్షల అనంతరం నాకు ‘ఒవేరియన్ కేన్సర్’ అనగానే, దాని గురించి పూర్తిగా స్టడీ చేశాను. చికిత్సా విధానాన్ని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను తెలుసుకున్నాను. కానీ, చదువుకోనివారికి ఇవన్నీ తెలియవు. అందుకే, గ్రామాలకు వెళ్లి, అక్కడున్న మహిళలకు కేన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించే పని చేస్తున్నాను. కేన్సర్ అనగానే వాళ్లు విపరీతంగా భయపడిపోతున్నారు. వ్యాధి వల్ల కాకుండా భయంతోనే చాలామంది చనిపోతున్నారు. కొంతమందైతే చికిత్స చేయించుకున్నా ఉపయోగం ఉండదని ఫీలైపోయి, ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. లేనిపోనివి ఊహించేసుకుని ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. + గతం గతః అంటారు. గతం తాలూకు తీపి జ్ఞాపకాలను గుర్తుంచుకోవచ్చు. కానీ, మర్చిపోదగ్గ విషయాలను మాత్రం మనసులో ఉంచుకోకూడదు. యూఎస్‌లో నాకు చికిత్స జరిగిన రోజులను మర్చిపోవాలనుకుంటున్నాను. అవి చాలా బాధాకరమైనవి. చికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడినా, మన గురించి అవతలివాళ్లు ఏమనుకుంటున్నారో అని మధనపడేదాన్ని. ఆ తర్వాత నా పద్ధతి మార్చుకున్నాను. ఆ దేవుడు మనకు ఎంతో బలాన్నిచ్చాడు. ఆ బలాన్ని ఆయుధంగా చేసుకుని పరిస్థితులను ఎదురీదాలి అనే భావన కలిగింది. అప్పట్నుంచీ ఎవరేమనుకుంటున్నారనే ఆలోచన నాకు కలగలేదు. భయపడటం మానేశాను. ఇప్పుడు జీవితం హాయిగా ఉంది. ఓ భీకర పోరాటంలో గెలిచానన్న ఆత్మసంతృప్తి మిగిలింది. + ఒక్క చిన్న కుదుపు తర్వాత ఏ బండైనా సాఫీగా సాగుతుంది. జీవితం కూడా అంతే. కేన్సర్ అనే చిన్న కుదుపు నుంచి బయటపడ్డాను. ఆత్మవిశ్వాసం ఉంటే నాలా చాలామంది బయటపడొచ్చు. ఇక, సినిమాలపై దృష్టి సారించాలనుకుంటున్నా. గతంలో చెయ్యకూడని కొన్ని సినిమాలు చేశాను. ఇప్పుడు సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తా. పాత్ర బాగుంటే రణబీర్ కపూర్‌కి అక్కగా నటించడానికి రెడీయే. నాలో మంచి నటి ఉంది. ఆ నటికి న్యాయం జరుగుతుందనిపించే సినిమాలు చేస్తాను. -
కేన్సర్‌ను తరిమేయడంలో ముందుంటా
రోగులకు సరైన చికిత్స అందడంలో నావంతు సహాయసహకారాలందిస్తా సహచారీ ఫౌండేషన్ సంస్థ కోసం నిధులు సేకరిస్తా: మనీషా కొయిరాల న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి మనీషా కొయిరాల కేన్సర్ బాధితులకు తనవంతు సహాయసహకారాలందించనుంది. కేన్సర్‌ను తరిమేయడంలో అందరికంటే ముందుంటానని స్వయంగా కేన్సర్ బాధితురాలైన మనీషా పేర్కొంది. ఇందుకోసం సహచారీ ఫౌండేషన్ సంస్థ కోసం నిధులు సేకరిస్తానని చెప్పింది. ‘కేన్సర్ వ్యాధిబాధితుల చికిత్స కోసం ఏం చేయడానికైనా నేను ముందుంటా. ఈ పనిచేసే అవకాశం వస్తే గర్వంగా ఫీలవుతా. ఎందుకంటే కేన్సర్ వల్ల కలిగే బాధ ఏంటో నేను స్వయంగా అనుభవించాను. అందుకే బాధితులకు అండగా నిలవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ వ్యాధి సోకినవారు దాని నుంచి బయటపడాలంటే చికిత్స ప్రక్రియ సక్రమంగా జరగడమే ముఖ్యం. అందుకోసం నావంతు సహాయసహకారాలందిస్తా’నని గురువారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పింది. రొమ్ము కేన్సర్ సోకిన మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన జాకెట్లను సహచారీ ఫౌండేషన్ సంస్థ తరఫున టాటా మెమోరియల్ ఆస్పత్రిలోని మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మనీషా మాట్లాడుతూ... ‘ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ జాకెట్లు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని భావిస్తున్నా. కేన్సర్‌తో పోరాడేందుకు, దాని నుంచి బయటపడేందుకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే నమ్మకం నాకుంది. సహచారీ ఫౌండేషన్ ప్రతినిధులు ఈ విషయమై నన్ను సంప్రదించారు. తమ సంస్థ చేస్తున్న ఈ మంచిపనికి సహాయసహకారాలు అందించాల్సిందిగా కోరారు. నేను వెంటనే అంగీకరించాను. కేన్సర్ నుంచి బయటపడడంలో యోగా కూడా నాకు ఎంతగానో తోడ్పడింద’ని చెప్పింది. ‘డిజైన్ వన్’ పేరుతో లోధీ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రముఖ డిజైనర్లను ఒక్కచోటుకు తీసుకొచ్చింది. వారి సహాయంతో కేన్సర్ రోగులకు సాయమందించేందుకు నిధులను సేకరిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ డిజైనర్లు పంకజ్, నిధి, మయాంక్, శ్రద్ధా, అత్సు సెఖోసె, ఫల్గుని మెహతా, రీనాసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మమతను వీడని క్యాన్సర్
మమతామోహన్‌దాస్‌ను క్యాన్సర్ వ్యాధి మళ్లీ బాధిస్తోంది. మమతామోహన్‌దాస్, మనీషా కోయిరాలా క్యాన్సర్ బారినపడ్డవారే. విదేశాల్లో చికిత్స పొంది ఈ మధ్యే తిరిగొచ్చారు. ఆత్మవిశ్వా సంతోనే క్యాన్సర్‌ను జయించానని మమత పేర్కొంది. అయితే క్యాన్సర్ ఆమెను మళ్లీ బాధిస్తోంది. ప్రస్తుతం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గర్భాశయ క్యాన్సర్ బారినపడ్డ మనీషా కోయిరాలా అమెరికాలో చికిత్స పొందింది. రెండు నెలల క్రితమే ముంబయికి తిరిగొచ్చింది. ప్రస్తుతం ఆమె పచ్చకామెర్ల వ్యాధితో ఇబ్బంది పడుతోంది. మనీషా నేపాల్‌లోని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. చికిత్స కోసం నవంబర్ 20న న్యూయూర్క్ వెళ్లనుంది. ఇది చాలా గడ్డుకాలం మళ్లీ మాయాజాలం మొదలైందని మనీషా తన ట్విట్టర్లో పేర్కొంది.