Ram Charan Shares Vacation Pics and Caption About Wife Upasana - Sakshi
Sakshi News home page

Ram Charan: ఉపాసన.. మనం కొద్ది రోజులు ఆగాల్సిందే!, చరణ్‌ ఆసక్తికర పోస్ట్‌

May 6 2022 4:24 PM | Updated on May 6 2022 7:26 PM

Ram Charan Shares Vacation Pics And Caption About Wife Upasana - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నాడు. శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఆర్‌సీ 15 మూవీ షూటింగ్‌ సెట్‌లో చరణ్‌ రీసెంట్‌గా జాయిన్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తర్వాత చరణ్‌ షూటింగ్‌లకు బ్రేక్‌ తీసుకుని భార్య ఉపాసనతో కలిసి వెకేషన్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చిన అనంతరం ఆర్‌సీ 15 అమృత్‌ సర్‌ షూటింగ్‌ షెడ్యుల్‌, ఆ తర్వాత ఆచార్య ప్రమోషన్స్‌తో బిజీ ఆయిపోయాడు. అనంతరం ఆర్‌సీ 15 షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు చెర్రి.

చదవండి: అప్పుడే ఓటీటీకి ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

ప్రస్తుతం ఈ మూవీ వైజాగ్‌లో షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చరణ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఉపాసన, రామ్‌ చరణ్‌ల రీసెంట్‌ వేకేషన్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చాడు. ‘ఉపాసన.. నా మైండ్‌లో కూడా వెకేషన్‌కు వెళ్లాలని ఉంది. కానీ, ఆర్‌సీ 15 సినిమా వైజాగ్‌ షెడ్యుల్‌ పూర్తి కావాలి. కాబట్టి మనం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్‌ స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. చరణ్‌ విజ్ఞప్తికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది ఉపాసన.

చదవండి: సుమ యాంకరింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టనుందా?

ప్రస్తుతం చరణ్‌ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఎప్పడు భార్యతో కలిసి ఉన్న ఫొటోలను సింగిల్‌ లైన్‌ క్యాప్షన్‌తో షేర్‌ చేసే చరణ్‌..తొలిసారి ఉపాసన కోసం ఇలాంటి పోస్ట్‌ షేర్‌ చేయడంతో మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాగా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆర్‌సీ 15 మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. నటి అంజలి, సీనియర్‌ హీరో శ్రీకాంత్‌, కమెడియన్‌ సునీల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు కలిసి నిర్మిస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేసే ప్రయత్నాల్లో ఉంది చిత్ర యూనిట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement