IND Vs Pak మ్యాచ్‌: గోల్డ్‌ ఐఫోన్‌ పోగొట్టుకున్న బాలీవుడ్‌ బ్యూటీ | Urvashi Rautela Claims Losing 24 Carat Real Gold iPhone At Narendra Modi Stadium | Sakshi
Sakshi News home page

Urvashi Rautela: మ్యాచ్‌ చూసేందుకు వెళ్లి గోల్డ్‌ ఐఫోన్‌ పోగొట్టుకున్న బాలీవుడ్‌ బ్యూటీ

Published Sun, Oct 15 2023 4:08 PM | Last Updated on Sun, Oct 15 2023 4:34 PM

Urvashi Rautela Claims Losing 24 Carat Real Gold iPhone At Narendra Modi Stadium - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు పెద్ద కష్టమే వచ్చింది. శనివారం నాడు ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ చూసేందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి వెళ్లిందీ బ్యూటీ. ఈ క్రమంలో సదరు స్టేడియంలో తన ఫోన్‌ పోగొట్టుకుంది. అది 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన గోల్డ్‌ ఐ ఫోన్‌ అని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది. దొరికినవాళ్లు దయచేసి తనకు తిరిగివ్వాలని కోరింది. ఈ విషయంలో సహకరించాల్సిందిగా కోరుతూ అహ్మదాబాద్‌ పోలీసులను ట్యాగ్‌ చేసింది. మరి ఆ జనసంద్రంలో ఊర్వశి పోగొట్టుకున్న ఐ ఫోన్‌ తిరిగి దొరుకుతుందో, లేదో చూడాలి!

కాగా నిన్న జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌లో పాక్‌కు వరుసగా ఎనిమిదోసారి ఓటమి రుచి చూపించింది. ఇక ఊర్వశి రౌతేలా విషయానికి వస్తే.. 'సింగ్‌ సాబ్‌ ద గ్రేట్‌' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఆమె సన్నీడియోల్‌కు జంటగా నటించింది. సనమ్‌ రే, హేట్‌ స్టోరీ 4, పాగల్‌పంతి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.

టాలీవుడ్‌ ప్రేక్షకులకు మాత్రం ఐటం సాంగ్స్‌ ద్వారానే సుపరిచితురాలైంది. 'వాల్తేరు వీరయ్య'లో బాస్‌ పార్టీ, 'ఏజెంట్‌'లో వైల్డ్‌ సాలా, 'బ్రో'లో మై డియర్‌ మార్కండేయ, 'స్కంద'లో కల్ట్‌ మామా.. ఇలా వరుసగా ఐటం సాంగ్స్‌ చేస్తోంది. ప్రస్తుతం ఊర్వశి హిందీలో 'దిల్‌ హై గ్రే' అనే సినిమా చేస్తోంది.

చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి కింగ్‌ ఆఫ్‌ కొత్త హిందీ వర్షన్‌.. ఎప్పుడు? ఎక్కడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement