ఖర్చులు పారదర్శకంగా చూపించాలి | Sakshi
Sakshi News home page

ఖర్చులు పారదర్శకంగా చూపించాలి

Published Fri, Apr 19 2024 1:35 AM

కలెక్టర్‌, ఇతర అధికారులతో ఎన్నికల అంశాలపై చర్చిస్తున్న రామ్‌కుమార్‌ గోపాల్‌ - Sakshi

ములుగు: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ సమర్పించే సమయంలో ఖర్చులను పారదర్శకంగా చూపించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు రామ్‌కుమార్‌ గోపాల్‌ అన్నారు. మహబూబాబాద్‌ పార్లమెంటరీ పరిధిలోని అభ్యర్థులు ములుగు అసెంబ్లీ నియోజకవర్గం సెగ్మెంట్‌ ఎన్నికల ప్రచార ఖర్చులు పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్‌ కేటాయించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు రామ్‌కుమార్‌ గోపాల్‌ జిల్లాకు గురువారం చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి చాంబర్‌లో ఎస్పీ శబరీశ్‌, ఐటీడీఏ పీఓ, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు), అదనపు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి పి.శ్రీజలతో రామ్‌కుమార్‌గోపాల్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ఖర్చుల నమోదుకు ఏర్పాటు చేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌, వీడియో సర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్‌ బృందాలు, వాటి పనితీరు తదితర అంశాలను కలెక్టర్‌, ఎస్పీ ఎన్నికల పరిశీలకులకు వివరించారు. అనంతరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎన్నికలలో వ్యయ లెక్కింపునకు ఏర్పాటు చేసిన కమిటీలు, బృందాలు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న, అప్పగించిన నగదు, మద్యం తదితర వివరాలను ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలతో వ్యయ పరిశీలకులు సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌(రెవెన్యూ), డిప్యూటీ ఎలక్షన్‌ ఆఫీసర్‌ మహేందర్‌జీ, ఆర్డీఓ, ఈఆర్‌ఓ సత్యపాల్‌రెడ్డి, జిల్లా వ్యయ పర్యవేక్షణ కమిటీ నోడల్‌ అధికారి సర్దార్‌ సింగ్‌, ఎకై ్సజ్‌ అధికారులు లింగాచారి, సహాయ వ్యయ పర్యవేక్షకులు, అకౌంట్‌ అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల వ్యయ పరిశీలకులు

రామ్‌కుమార్‌ గోపాల్‌

Advertisement
Advertisement