‘బెల్టు’ జోరు.. | Sakshi
Sakshi News home page

‘బెల్టు’ జోరు..

Published Sat, May 25 2024 2:10 PM

‘బెల్టు’ జోరు..

నిత్యం వేలల్లో తరలింపు..

బెల్ట్‌ నిర్వాహకులు రోజువారీగా రూ.వేలల్లో సరుకు తీసుకువెళుతున్నారు. ఎన్నికల సమయంలో పల్లెల్లో మద్యం దుకాణాల మూసివేతతో మందుకు బానిసగా మారిన వందలాది మంది ఉదయం పూట చుక్క వేయడం మానేశారు. దీంతో ఆ కుటుంబాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. గొడవలు, పంచాయతీలకు చెక్‌ పడింది. ప్రస్తుతం మద్యం ఏరులై పారుతుండడంతో మళ్లీ మునుపటి రోజులు పునరావృతం కానున్నాయి. కేవలం ఎన్నికల సమయం అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థల సమయంలోనే బెల్ట్‌ దుకాణాలను మూసి వేస్తూ.. మిగతా సమయంలో గాలికి వదిలేస్తున్నా రు. దీంతో అధికారికంగా వాటికి అనుమతి ఇస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నా యి. రోజువారి కూలీ పనిచేస్తూ, వచ్చే సంపాదన మద్యానికే తగలేస్తుండడంతో.. అనేక కుటుంబాలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మ ద్యం అక్రమ అమ్మకాలపై ప్రత్యేకంగా ఎకై ్సజ్‌శాఖ ఉన్నప్పటికీ, పర్యవేక్షణ లోపం కనిపిస్తుంది. బెల్టు దుకాణాలను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై కాటారం ఎకై ్సజ్‌ సీఐ నరేందర్‌ను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

కాళేశ్వరం: లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో గ్రామాల్లో బెల్టుషాపులు మళ్లీ ఓపెన్‌ అయ్యాయి. మద్యం దుకాణాల్లాగా గల్లీల్లో అమ్మకాలు యథేచ్చగా సాగుతున్నాయి. ఎకై ్సజ్‌ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లావ్యాప్తంగా బెల్ట్‌ దుకాణాలను మూసివేశారు. మద్యం అమ్మకాలపై నిఘా ఉంచుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడితే బెల్ట్‌ తీశారు. దీంతో గ్రామాల్లో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి. చాలా ఇళ్లలో ప్రశాంత వాతావరణం నెలకొనగా ప్రస్తుతం మళ్లీ మునపటి పరిస్థితి నెలకొంది.

జిల్లాలో 11 మండలాల్లో 60 వరకు మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో బెల్టు షాపులు తెలిసినవి 600 వరకు.. తెలియనివి 300 వరకు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ అధికారుల ఆదేశాల మేరకు ఎకై ్సజ్‌ శాఖ బెల్టు దుకాణాలను మూసివేసింది. అక్కడక్కడ మద్యం అమ్మకాలు జరిగిన సమయంలో... సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు దాడులు చేసి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. దీనిపై పౌరులకు అవగాహన కల్పిస్తూ... సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి మూసి ఉన్న బెల్టు దుకాణాలు.. కౌంటింగ్‌ ముగిసి పోవడంతో బార్లను తలపించే విధంగా తెరుచుకోగా, మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికల ముందు మూసివేశారు. ఇప్పుడు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో బెల్ట్‌ దుకాణాలు మళ్లీ తెరుచుకున్నాయి.

పెరిగిన కొనుగోళ్లు..

గ్రామాల్లో బెల్ట్‌ దుకాణాలు తెరుచుకోవడంతో జిల్లాలో చాలా చోట్ల బెల్టు దుకాణాలు బార్లు, రెస్టారెంట్లను తలపించే విధంగా ఉన్నాయి. కొన్నిచోట్ల బ్లాక్‌ డాగ్‌, బ్లెండర్‌ ప్రైడ్‌ ఇలా ఖరీదైన ఫుల్‌, ఆఫ్‌, క్వార్టర్‌ బాటిల్స్‌, కింగ్‌ఫిషర్‌ బీర్లు సైతం దొరికే పరిస్థితి ఉంది. క్వార్టర్‌, ఆఫ్‌, ఫుల్లు రూ.20 నుంచి రూ.100 వరకు అదనపు ధరలతో మద్యం ప్రియుల జేబులు ఖాళీ చేస్తున్నారు. మద్యానికి బానిసలుగా మారిన కొంతమంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా 24 గంటలు బెల్ట్‌ దుకాణానికి వెళ్తూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు.

మహారాష్ట్రకు మన మద్యం..

కాటారం సబ్‌డివిజన్‌ పరిధిలోని మహదేవపూర్‌, కాళేశ్వరం మద్యం దుకాణాల్లో మద్యాన్ని గోదావరి దాటించి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అక్కడ ఆదివాసీ జిల్లా కనుక మద్యం అమ్మకాలు లేవు. దీంతో మద్యం దుకాణాల నిర్వాహకులు బెల్టు దుకాణాలకు విక్రయించే మద్యం రూ. 20–30 అదనంగా తీసుకుంటున్నట్లు తెలిసింది. బెల్టు దుకాణాల వారిని ఆపేవారుండరు. తనిఖీలు చేసేవారుండరని చర్చ ఉంది. సంబంధిత అఽధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వీరిని మద్యం దుకాణదారులు ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. మహదేవపూర్‌, కాళేశ్వరం మద్యం దుకాణాల పరిధిలో సుమారుగా 200 వరకు బెల్టు దుకాణాలు ఉన్నాయి.

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో మద్యం అమ్మకాలు

పెద్దఎత్తున పెరిగిన కొనుగోళ్లు

పట్టింపులేని ఎకై ్సజ్‌ శాఖ

Advertisement
 
Advertisement
 
Advertisement