వేసవి తాపంలోనూ.. విధి నిర్వహణ | Sakshi
Sakshi News home page

వేసవి తాపంలోనూ.. విధి నిర్వహణ

Published Thu, May 9 2024 6:50 AM

వేసవి తాపంలోనూ.. విధి నిర్వహణ

మిర్యాలగూడ టౌన్‌ : లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఆర్టీసీ సిబ్బంది వేసవి తాపంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సుల్లోనే ఉంటున్న డ్రైవర్లు, కండక్టర్లు ఎండ వేడిమికి తల్లడిల్లుతున్నారు. ఆర్టీసీ డిపోల్లో తాగునీరు, మధ్యాహ్నం వేళ మజ్జిగ అందజేస్తుండడంతో కాస్తా ఉపశమనం పొందుతున్నారు. సిబ్బంది పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సంస్థ సెలవులు పెట్టకుండా డ్యూటీ చేసే కండక్టర్లు, డ్రైవర్లకు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో రూ.వెయ్యి చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది.

పొద్దంతా బస్సుల్లోనే..

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే ఎండలు మండుతున్నాయి. ఈ నెలలో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఇంటి నుంచి బయటికి వచ్చేందుకే ప్రజలు జంకుతున్న ఈ పరిస్థితిల్లో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పొద్దస్తమానం బస్సుల్లో తిరుగుతూ ఎండకు అల్లాడుతున్నారు. ప్రధానంగా డ్రైవర్లు ఇంజన్‌ వేడి.. ఎండ మంటతో తల్లడిల్లుతున్నారు. కండక్టర్లు కూడా ప్రయాణికులకు టికెట్లు జారీ చేస్తూ ఉక్కపోత, వేడి గాలితో ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆర్టీసీ సంస్థ అన్ని డిపోల్లో మధ్యాహ్నం 12గంటల నుంచి ఒంటి గంట వరకు మజ్జిగ పంపిణీ చేస్తుంది. మరోవైపు సిబ్బంది కూడా టోపీలు, రుమాలు ధరిస్తూ ఎండనుంచి కాస్త ఉపశమయం పొందుతున్నారు.

ఫ ఎండ వేడిమికి అల్లాడుతున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు

ఫ మధ్యాహ్నం వేళ మజ్జిగ అందజేస్తున్న సంస్థ

ఫ రక్షణ చర్యలు తీసుకుంటున్న సిబ్బంది

Advertisement
Advertisement