నేటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

Published Mon, May 6 2024 9:10 AM

నేటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

ఫెసిలిటేషన్‌ కేంద్రాల

వివరాలు

నియోజకవర్గం ఫెసిలిటేషన్‌ కేంద్రం

ఆళ్లగడ్డ వైపీపీఎం హై స్కూల్‌,

జూనియర్‌ కాలేజ్‌, ఆళ్లగడ్డ

నంద్యాల బాలికల ప్రభుత్వ

జూనియర్‌ కాలేజ్‌, నంద్యాల

బనగానపల్లె ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌,

బనగానపల్లె

నందికొట్కూరు జెడ్పీహెచ్‌ఎస్‌ గర్ల్స్‌

హై స్కూల్‌, నందికొట్కూరు

డోన్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ గర్ల్స్‌

హైస్కూల్‌, పత్తికొండ

శ్రీశైలం ప్రభుత్వ బాలుర హైస్కూల్‌,

ఆత్మకూరు

జిల్లా ఎన్నికల అధికారి,

కలెక్టర్‌ శ్రీనివాసులు

నంద్యాల: జిల్లాలో సోమవారం నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగనుందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా.కె. శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 6,7,8 తేదీలలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఎక్కడైతే ట్రైనింగ్‌ నిర్వహిస్తున్నారో అక్కడే ఓటు హక్కు వినియోగించుకునేలా ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశా మన్నారు. ఎన్నికల పోలింగ్‌ విధులలో పాల్గొంటున్న ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు తదితర దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 17,939 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 3,372 మంది, బనగానపల్లెలో 2,858, డోన్‌లో 1,970, నందికొట్కూరులో 2,224, నంద్యాలలో 4,800, శ్రీశైలంలో 2,715 మంది ఎన్నికల విధులు, అత్యవసర సేవలకు సంబంధించిన శాఖల ఉద్యోగులు ఉన్నారన్నారు. హోం ఓటింగ్‌ సంబంధించి 85 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో సంబంధిత వ్యక్తులు శనివారం నిర్వహించిన హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొన్న విషయం రాజకీయ పార్టీలు గమనించాలన్నారు. అత్యవసర సేవలు, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది ఎక్కడైతే పని చేస్తూ ఫామ్‌– 12ఈ ఇచ్చిన రిటర్నింగ్‌ అధికారి ప్రాంతంలోనే పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. పాణ్యం, గడివేముల మండలాలకు సంబంధించి అక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మొదట ఎక్కడ శిక్షణ పొందారో ఆయా ప్రాంతాల్లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు.

Advertisement
Advertisement