సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా కేసులు ఒక్క సారిగాపెరిగి పోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళనచెందుతున్నారు. తాజా కేసుల నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసులు సంఖ్య పెరగడానికి కాలుష్యం కూడా కారణమనిఅభిప్రాయపడ్డారు. కేసులు సంఖ్య తగ్గించే విధంగా, పరిస్థితిని అదుపులోతీసుకురావడానికి రాబోయే 7-10 రోజుల్లో కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుచెప్పారు.
ఢిల్లీ గురువారం రోజు (7,053) పాజిటివ్ కేసులు నమోదు కాగా అదే రోజు 104 మరణాలు సంభవించాయని రాయిటర్స్ నివేదిక తెలిపింది. దీంతో నగరంలో మూడో దశ ప్రారంభమయ్యే అవకాశాలుఉన్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రులోపడకలు కూడా వేగంగా నిండుపోతున్నాయి. దీనిని బట్టి రానున్నశీతాకాలంలో రోజుకు 15 వేల వరకు కేసులు నమోదయ్యేప్రమాదం ఉందని దీనిని పరిగణలోకి తీసుకొని తగిన ఏర్పాట్లు చేయాలనివైద్యులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment