
కోలారు: ఇనుప కంచెకు చిక్కి చిరుత మరణించిన ఘటన తలగుంద గ్రామంలో చోటు చేసుకుంది. రైతు రామకృష్ణప్ప మామిడి తోటకు రక్షణగా ముళ్ల కంచె వేశాడు. బుధవారం రాత్రి అటుగా వచ్చిన చిరుత కంచెను దాటే ప్రయత్నంలో చిక్కుకుని మృత్యువాత పడింది. గురువారం అటవీశాఖ అధికారులు చేరుకుని పరిశీలించి కళేబరానికి పోస్టుమార్టంఅనంతరం అటవీ ప్రాంతంలో ఖననం చేశారు.