నిర్మల్: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అధి కారికంగా గుర్తుల కేటాయింపు ఖరారైంది. బీఫాంలను అందించిన ప్రధాన పార్టీలకు ముందే గుర్తులు ఉండగా, ఈనెల 15న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మిగిలిన అభ్యర్థులకూ అధికారికంగా గుర్తులను కేటాయించారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నవారికి నిబంధనల మేరకు సింబల్స్ ఇచ్చారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 38 మంది బరిలో ఉన్నారు. నిర్మల్‌లో 13, ముధోల్‌లో 14, ఖానాపూర్‌లో 11మంది అభ్యర్థులు ఉన్నారు. మూడు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 14 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు.
అభ్యర్థుల పార్టీలు–గుర్తులు..
నిర్మల్ నియోజకవర్గం..
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(బీఆర్‌ఎస్–కారు), ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(బీజేపీ–కమలం), కూచాడి శ్రీహరిరావు(కాంగ్రెస్–హస్తం), దేవత జగన్‌మోహన్(బీ ఎస్పీ–ఏనుగు), గొర్రె లింగన్న(బీఎంపీ–మంచం), పరికిపండ్ల స్వదేశ్(ఏఐఎఫ్‌బీ–సింహం), మంతెన ఇంద్రకరణ్‌రెడ్డి(ఏడీఆర్‌పీ–చపాతీరోల ర్), రవీందర్ రామగిరి(డీఎస్‌పీ–టార్చ్‌లైట్), ఖాజా నయీమొద్దీన్(స్వతంత్ర–కుండ), దేవోల్ల రాజు(స్వతంత్ర–ఫుట్‌బాల్), బుర్కరాజేందర్(స్వతంత్ర–బకె ట్), మల్లేశ్‌మద్దికుంట(స్వతంత్ర–డోలి), చవాన్ సుదర్శన్(స్వతంత్ర–సిలిండర్).
ముధోల్ నియోజకవర్గం..
గడ్డిగారి విఠల్‌రెడ్డి(బీఆర్‌ఎస్–కారు), పవార్ రా మారావుపటేల్(బీజేపీ–కమలం), భోస్లే నారాయణరావుపటేల్(కాంగ్రెస్–హస్తం), వినోద్‌కుమార్ శారదారావు(బీఎస్పీ–ఏనుగు), కాసారం రాజు(డీఎస్‌పీ–టార్చిలైట్), గోరేకర్ విజయ్(ఐపీబీపీ–ట్రంపెట్), దేవీదాస్ హస్డే(ఆర్‌పీఐ–సిలిండర్), బద్ధం భోజారెడ్డి(ఏఐఎఫ్‌బీ–సింహం), ఎలుగుదార్ ప్రవీణ్(స్వతంత్ర–సోప్‌డిష్), జాదవ్ దత్తురాం(స్వతంత్ర–కెమెరా), జాదవ్ దేవీదాస్(స్వతంత్ర–ఎయిర్ కండీషనర్), పోతరాజు సుధాకర్(స్వతంత్ర–బేబీవాకర్), మన్‌మోహన్ జాదవ్(స్వతంత్ర–చపాతీ రోలర్), సంజు హేమ్లే(స్వతంత్ర–రోడ్డు రోలర్).
ఖానాపూర్ నియోజకవర్గం..
భూక్య జాన్సన్‌నాయక్(బీఆర్‌ఎస్–కారు), రమేశ్ రాథోడ్(బీజేపీ–కమలం), వెడ్మ బొజ్జుపటేల్(కాంగ్రెస్–హస్తం), బన్సీలాల్ రాథోడ్(బీఎస్పీ–ఏను గు), బొంత ఆశారెడ్డి(జీజీపీ–రంపం), కూతాటి వి జయ(పీపీఐ–పిల్లనగ్రోవి), జాదవ్ ప్రభాస్(డీఎస్ పీ–టార్చిలైట్), పెందూర్ ప్రియాంక(సీపీఐ(ఎంఎల్)రెడ్‌స్టార్–సిలిండర్), ఆత్రం రవీందర్(స్వతంత్ర–రోడ్డు రోలర్), నేతావత్ రాజేందర్(స్వతంత్ర–కుట్టుమిషన్), మోహన్(స్వతంత్ర–బ్యాట్స్‌మన్).
Comments
Please login to add a commentAdd a comment