సమయం లేదు మిత్రమా.. | Sakshi
Sakshi News home page

సమయం లేదు మిత్రమా..

Published Fri, May 10 2024 4:05 PM

సమయం లేదు మిత్రమా..

నిర్మల్‌: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. శుక్ర, శనివారాలు మాత్రమే ప్రచా రానికి గడువు మిగిలింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం శనివారం సాయంత్రం ఆరుగంటలతో ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడనుంది. దీంతో ‘సమయం లేదు మిత్రమా..’ అంటూ పార్టీలు పరుగులు పెడుతున్నాయి. అభ్యర్థులు హడావుడిగా అడుగులు వేస్తున్నారు. రెండురోజుల సమయాన్ని సద్వి నియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఉరుకులు.. పరుగులు..

పట్నం, పల్లె నిద్ర లేవకముందే.. ఎన్నికల రథాలు గల్లీల్లోకి వచ్చేస్తున్నాయి. అభ్యర్థుల పాటలే నిద్రలేపుతున్నాయి. ఒక పార్టీ వెనుక మరొకటి వరుసగా ఊళ్లల్లోకి దూసుకు వస్తున్నాయి. ఉదయం ఊరంతా ఉపాధి పనులకు వెళ్తే.. అభ్యర్థులు, నేతలూ అ క్కడికే వెళ్లి వాళ్లతో ముచ్చట పెడుతున్నారు. తమకే ఓటువేసి గెలిపించాలని కోరుతున్నారు. ప్రచార గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు, నేతలు వేకువ జామునే సిద్ధమవుతున్నారు. ఐదుపది మంది అనుచరులు, కార్యకర్తలు రాగానే ‘చలో.. చలో..’ అంటూ ప్రచారానికి పరుగుదీస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారంలోనే గడిపేస్తున్నారు. ఎర్రటి ఎండలోనే ఊళ్లను చుట్టేస్తున్నారు. వడివడిగా అడుగులు వేస్తూ.. పరుగులాంటి నడకతో.. ఇంటింటికీ వెళ్తున్నారు. స్వయంగా ఓటర్లను కలిసి తనను గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్నారు.

గ్రూపులుగా విడిపోయి..

ప్రచారం చివరి అంకంలో పార్టీల నాయకులు గ్రూపులుగా విడిపోయి పనులు చక్కబెడుతున్నారు. ఊళ్లల్లో అధికసంఖ్యలో ఉన్నవర్గాల వద్దకు వెళ్తున్నారు. వారితో సమావేశమవుతూ తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. తమ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకుంటూ సాధ్యమైన వరకు పని పూర్తిచేస్తున్నారు. లేనిపక్షంలో గెలిచిన తర్వాత పనులు చేసి పెడతామంటూ హామీలిస్తున్నారు.

ప్రలోభాలు తక్కువే..

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్‌ పోరులో ప్రలోభాలు తక్కువే కనిపిస్తున్నాయి. నియోజకవర్గ పరిధితోపాటు ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎవరికీ ఏం ఇవ్వలేమంటూ పార్టీలు ఖాళీ చేతులు చూపుతున్నాయి. కొన్ని ప్రభావిత వర్గాలు, వ్య క్తులను మాత్రం ప్రలోభ పెడుతున్నాయి. ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటలు ఎలా ఉండాలి.. ఏం చేయాలి.. అనేదానిపైనా చర్చించుకుంటున్నాయి.

ప్రచారానికి ఇంకా రెండు రోజులే..

హడావుడి పెంచిన పార్టీలు

ప్రతీ ఓటరును కలుస్తున్న నేతలు

ప్రలోభాలకు గుట్టుగా ఏర్పాట్లు!

ఈరోజు, రేపే చాన్స్‌..

ఎన్నిక ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచే ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. ఈనెల 13 సాయంత్రం 6 గంట ల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఈప్రకా రం శనివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రచారానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులు ప్రచారం పూర్తి చేశారు. ఇంకా మిగిలిన గ్రామాలు, మండలాల్లో ఆయా పార్టీల నేతలు చక్కర్లు కొడుతున్నారు. ఏ ఊరిని, ఏ ఇంటినీ వదలకుండా పార్టీలు ప్రచారవేగాన్ని పెంచుతున్నాయి.

Advertisement
 
Advertisement