ఆర్టీసీ డిపోలో వైద్యపరీక్షలు | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డిపోలో వైద్యపరీక్షలు

Published Thu, May 16 2024 1:30 PM

ఆర్టీసీ డిపోలో వైద్యపరీక్షలు

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో బుధవారం గ్రాండ్‌ హెల్త్‌ ఛాలెంజ్‌లో భాగంగా సంస్థలో పని చేసే ఉద్యోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యులు విద్యాసాగర్‌రావు, చంద్రిక ఆధ్వర్యంలో 60 మంది ఉద్యోగులకు బీపీ, షుగర్‌, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించారు. అవసరమైనవారికి మాత్రలు అందజేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు బాధ్యతతో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌, సహాయ మేనేజర్లు రాజశేఖర్‌, నవీన్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement