మొరాయిస్తున్న మాధవనగర్ రైల్వేగేట్
నిజామాబాద్ రూరల్: మండలంలోని మాధవనగర్ రైల్వే గేటు గత వారం రోజుల నుంచి మొరాయిస్తోంది. రైలు వచ్చిన ప్రతిసారి రైల్వే సిబ్బంది గేటు వేసి మరమ్మతులు చేపట్టి రైలు వెళ్లగానే మళ్లీ గేటును తీస్తున్నారు. దీంతో ఆ ప్రదేశంలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెలలో మాధవనగర్ రైల్వే గేటు వద్ద ట్రాక్ పునరుద్ధరణలో భాగంగా గేటును మూడు రోజులు మూసి ఉంచిన సంగతి తెలిసిందే. ట్రాక్ మరమ్మతులు పూర్తయ్యాయి. కానీ రైల్వే గేటుకు సంబంధించిన పాత సామాగ్రిని తొలగించి నూతన రైల్వే గేటును అమర్చారు. దీంతో అందులో కొన్ని లోపాలు నెలకొనడంతో సిబ్బంది తరచూ మరమ్మతులు చేపడుతున్నారు. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రైల్వే గేటు సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
నిలిచిపోయిన వాహనాలు
మరమ్మతులు పూర్తి కాని వైనం
ఇబ్బందుల్లో ప్రయాణికులు
చర్యలు తీసుకోవాలి
వారం రోజులుగా మాధవనగర్ రైల్వే గేటు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని రైల్వే గేటులో ఎక్కడ సమస్య ఉందో గుర్తించి వెంటనే పరిష్కరించాలి. లేదంటే రాత్రి సమయాల్లో ప్రయాణికులు గేటు మరమ్మతులతో ఇబ్బందులు పడుతున్నారు.
– నరేందర్, ధర్మారం వాసి
Comments
Please login to add a commentAdd a comment