వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
ఇందల్వాయి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లికి చెందిన కళ్లుకుండల సాయిలు(39) సోమవారం సాయంత్రం టీవీఎస్ ఎక్స్‌ల్‌పై గ్రామం నుంచి తన ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు రచ్చబండ గచ్చుని ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్‌కుమార్ పేర్కొన్నారు.
నిప్పంటుకొని ఒకరు..
జక్రాన్‌పల్లి: మండల కేంద్రానికి చెందిన చిలుకూరి నడిపి గంగారాం(67) ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మృతి చెందాడు. ఎస్సై తిరుపతి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. జక్రాన్‌పల్లి గ్రామానికి చెందిన చిలుకూరి నడిపి గంగారాం ఈనెల 11న రాత్రి ఇంట్లో మంచంపై పడుకుని బీడీ తాగుతుండగా ప్రమాదవశాత్తు బీడీకి ఉన్న నిప్పురవ్వలు మంచంపై పడి పరుపు కాలిపోయి మంటలు చెలరేగగా గంగారాంకు మంటలు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆర్మూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి చికిత్స పొందుతు మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లి కొండ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సంతోష్‌నగర్ కాలనీకి చెందిన ఆలకుంట పెద్ద వెంకటి(59) మృతి చెందాడు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 11న వెంకటి తన టీవీఎస్ ఎక్సెల్‌పై పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా తొర్లికొండ గ్రామ శివారులోని ఎస్సీ బాలుర హాస్టల్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. స్థానికులు ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు వెంకట్‌రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
కల్లు మత్తులో స్నానానికి వెళ్లి..
కామారెడ్డి క్రైం: కల్లు తాగిన మత్తులో స్నానానికి వెళ్లి నీట మునిగి ఓ మహిళ మృతి చెందిన ఘటన కామారెడ్డి పెద్ద చెరువు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం చెరువులో తేలిన మహిళ మృతదేహాన్ని గమనించిన స్ధానికులు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి విచారణ చేపట్టారు. మృతురాలిని బాన్సువాడకు చెందిన దాసరి మంజుల(25)గా గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాంతంలో ఉన్న ఓ కల్లు దుకాణంలో కల్లు సేవించిన తర్వాత స్నానం చేసి వస్తానని తన చెల్లెలు నిమ్మల శిరీషతో చెప్పి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు పలు చోట్ల గాలించినా ఆచూకీ దొరకలేదు. మంగళవారం చెరువులో మృతదేహం తేలింది. మృతురాలి చెల్లెలు శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలికి భర్త తిరుపతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment