‘మధ్యాహ్న భోజన’ నిధులు విడుదల | - | Sakshi
Sakshi News home page

‘మధ్యాహ్న భోజన’ నిధులు విడుదల

Published Wed, Nov 20 2024 12:51 AM | Last Updated on Wed, Nov 20 2024 12:51 AM

‘మధ్య

‘మధ్యాహ్న భోజన’ నిధులు విడుదల

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిధులు విడుదల చేసినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్‌ ఒక ప్రకటనలో తెలిపారు సీసీహెచ్‌ల గౌరవ వేతనం రూ.1.24 కోట్లు విడుదల చేశామన్నారు. ఈ నిధులను మండలాల వారీగా అందించనున్నారు.

క్రమబద్ధీకరణ

ఉద్యోగులకు షాక్‌

నిజామాబాద్‌ అర్బన్‌: గత ప్రభుత్వం క్రమబద్ధీకరించిన కాంట్రాక్టు ఉద్యోగులకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు వెలువడడంతో ఉద్యోగ వర్గాల్లో కలకలం రేగింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 66 ప్రకారం రాష్ట్రంలోని వివిధ శాఖలలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్‌ అయ్యారు. జిల్లాలో సుమారు 550 మంది కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణ పొందారు. ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలోని 211 మంది, డిగ్రీ కళాశాలలకు చెందిన 112 మంది కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులర్‌ అ య్యారు. వైద్య ఆరోగ్యశాఖలోని 28 మంది, విద్యాశాఖలోని 12 మంది ఉద్యోగులు క్రమ బద్ధీకరణ పొందారు. అలాగే వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పర్మినెంట్‌ ఉద్యోగులుగా మారారు. హై కోర్టు తీర్పునేపథ్యంలో ప్రస్తుతం వీరందరూ తిరిగి కాంట్టాక్టు ఉద్యోగులుగా మారనున్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించగా నిరుద్యోగ జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. చివరికి హైకోర్టును జేఏసీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగా జిల్లా ఇంటర్మీడియట్‌ శాఖలో కొందరు కాంట్రాక్టు లెక్చరర్లు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతి పొందారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా విచారణ కొనసాగుతోంది.

రాజీనామాకు సిద్ధమా?

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌కు

ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి సవాల్‌

నిజామాబాద్‌ అర్బన్‌: నీ ఇష్టం ఉన్న ఊరికి వెళ్దాం.. సెంటర్లో నిలబడదాం.. రైతుబంధు, రుణమాఫీ, బోనస్‌ రూ. 500 పడిందా? అని రైతులను అడుగుదాం.. అన్నీ వచ్చాయని చెబి తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. లేదంటే నీవు ిపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తావా ? అంటూ మహేశ్‌ కుమా ర్‌ గౌడ్‌కు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ిపీసీసీ పీఠం ఎక్కగానే మహేశ్‌గౌడ్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పా లనపై ఓ సంస్థ చేసిన సర్వేలో అనేక ఘోరాలు బయటపడ్డాయని ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ లో పొంగులేటి, శ్రీధర్‌ బాబు, భట్టి సీఎం రేస్‌లో గట్టి ప్రయత్నంలో ఉన్నారని అన్నారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉంటాడా తెలుసుకోవాలన్నారు. నగర మేయర్‌ నీతూ కిరణ్‌ భర్తపై దాడి సరైనది కాదన్నారు. ఈ ఘటనలో కాంగ్రెస్‌ హ స్తం ఉందని, ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, మాజీ జెడ్పీ చైర్మన్‌ విఠల్రావు, నుడా మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు శిల్పరాజు, గూడెం రవిచంద్ర, సత్య ప్రకాష్‌ మౌళి, మధుసూదన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి

కాలభైరవుడి ఉత్సవాలు

రామారెడ్డి : ఇసన్న పల్లి(రామారెడ్డి) కాలభైరవ స్వామి ఆలయం కార్తీక బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యింది. ఐదు రోజులపాటు స్వామివారి జన్మది న వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవా లు బుధవారం ఉదయం 6 గంటలకు గణ పతి పూజతో ప్రారంభమవుతాయి. గురువారం బద్దిపోచమ్మ బోనాలు, శుక్రవారం లక్షదీపార్చన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన డోలారోహణం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఘ ట్టాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివస్తారు. అదేరోజు సాయంత్రం ఎడ్లబండ్ల ఊరేగింపు ఉంటుంది. ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో ప్రభు గుప్తా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
‘మధ్యాహ్న భోజన’  నిధులు విడుదల1
1/1

‘మధ్యాహ్న భోజన’ నిధులు విడుదల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement