స్థల వివాదమే కారణమా!
ఖలీల్‌వాడి: నగర మేయర్ నీతూ కిరణ్ భర్త దండు శేఖర్‌పై దాడి చేసిన కేసులో పోలీసులు నిందితుడు షేక్ రసూల్‌ను మంగళవారం రిమాండ్‌కు తరలించారు. బాధితుడు శేఖర్ నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు షేక్ రసూల్‌తో పాటు దాడి సమయంలో వీడియో చిత్రీకరించిన వెల్డింగ్ అహ్మద్‌ను, అదేవిధంగా శేఖర్ అనుచర వర్గానికి చెందిన గోపాల్, తిరుపతిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. శేఖర్ తల, చెంపకు గాయాలు కాగా స్కానింగ్ తీశారు. అంబులెన్స్ వెళ్లే సమయంలో పోలీసులు ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు.
దాడి వెనుక కుట్ర..
నా భర్త దండు శేఖర్‌పై దాడి చేసిన షేక్ రసూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నగర మేయర్ నీతూ కిరణ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్నారు. దాడి వెనుక కుట్ర జరిగిందని ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు.
మేయర్ భర్త శేఖర్‌పై దాడి కేసులో
నిందితుడి రిమాండ్
మరో ముగ్గురిని విచారించిన పోలీసులు
ఇద్దరు కాంగ్రెస్ నేతల ప్రమేయం ?
Comments
Please login to add a commentAdd a comment