28న కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

28న కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక

Published Tue, Nov 26 2024 12:57 AM | Last Updated on Tue, Nov 26 2024 12:57 AM

28న కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక

28న కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక

బాల్కొండ: ముప్కాల్‌ మండల కేంద్రంలో ఈనెల 28న భూదేవీ ఇండోర్‌ స్టేడియంలో సీనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్స్‌ కబడ్డీ చాంపియన్‌ కోసం ఉమెన్స్‌ జిల్లా జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు నిజామబాద్‌ జిల్లా కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగయ్య, గంగాధర్‌ సోమవారం తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆధార్‌కార్డుతో హాజరు కావాలన్నారు. 75 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండరాదని అన్నారు. ఎంపికై న జట్టు హైదరాబాద్‌లో వచ్చే నెల 7 నుంచి 10 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు.

నాట్య మయూరి అవార్డు అందుకున్న ప్రహర్షిణి

పెర్కిట్‌: ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి మంజునాథ నృత్య కళా నిలయం విద్యార్థిని తోకల ప్రహర్షిణి భరత నాట్యంలో నాట్య మయూరి అవార్డు అందుకుని ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించుకుంది. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు ప్రహర్షిణికి నాట్య మయూరి అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందజేశారు. విద్యార్థినికి అవార్డు రావడంపై తల్లితండ్రులు తోకల భాను, మోహన్‌, నాట్య గురువు కవిత ఆనందం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement