కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య
ఎల్లారెడ్డి: కడుపునొప్పి భరించలేక ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకు న్న ఘటన ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి తండాలో చోటు చేసుకుంది. ఎస్సై మహేశ్ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం..తిమ్మారెడ్డి తండాకు చెందిన దరావత్ శారద(28) కొ న్ని నెలలుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చూయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త దేవీసింగ్ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ పేర్కొన్నారు.
గూపన్‌పల్లిలో యువకుడు..
నిజామాబాద్ రూరల్: రూరల్ పీఎస్ పరిధిలోని గూపన్‌పల్లికి చెందిన పవన్(24) అనే యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో ఆరిఫ్ పేర్కొన్నారు. స్థానికులు, ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. పవన్ బైపాస్ రోడ్డులో ఉన్న లహరి హోటల్‌లో పనిచేస్తుండేవాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment