సాహిత్యంలో వరలక్ష్మికి జాతీయ స్థాయి అవార్డు
నిజామాబాద్ అర్బన్: శ్రీ ఆర్యన్ సకల కళా వేదిక, శ్రీగౌతమేశ్వర సాహితీ సంస్థల ఆధ్వర్యంలో సంయుక్తంగా కరీంనగర్ జిల్లాలోని ఫిలిం భవన్‌లో విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఆదివారం జాతీయ స్థాయి చతుర్ముఖ సింహ అవార్డులను అందజేశారు. జిల్లాకు చెందిన డొంకేశ్వర్ మండలం, తొండాకూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్ వరలక్ష్మి 500లకు పైగా కవితలు, 280పైగా చిత్రాలు, 20 పాటలు, 30 కథలు రాసి సాహిత్యంలో రాణిస్తున్నందున జాతీయస్థాయి చతుర్ముఖ సింహ అవార్డును ప్రధానం చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ దూడపాక శ్రీధర్, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, పొర్ల వేణుగోపాల్ రావు కాసారం, లావణ్య, కవులు, కళాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment