తాళం వేసిన రెండిళ్లలో చోరీ
కామారెడ్డి క్రైం: తాళం వేసి ఉన్న రెండిళ్లలో చోరీ జరిగిన ఘటన జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కా లనీకి చెందిన నర్సయ్య తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి దొంగలు పడినట్లు గుర్తించారు. కొద్ది దూరంలో ఉండే రాజు అనే వ్యక్తి ఇంట్లో కూడా ఇదే విధంగా చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. క్లూస్ టీం బృందాన్ని పిలిపించి ఆధారా లు సేకరించారు. ఆయా ఇండ్లలో తులంన్నర బంగారు ఆభరణాలు, 22 తులాల వెండి,రూ. 30 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. విచారణ చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
గురురాఘవేంద్ర కాలనీలో..
కామారెడ్డి క్రైం: మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలోని గురురాఘవేంద్ర కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై రాజు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన వేర్పుల మల్లేశం తన కుటుంబీకులతో కలిసి ఈనెల 23న బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం ఇంటికి తాళం వెళ్లాడు. సోమవారం తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. బీరువాలో దాచి ఉంచిన తులంన్నర బంగారం, వెండి, నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment