ప్రజావాణికి 95 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి 95 ఫిర్యాదులు

Published Tue, Nov 26 2024 12:58 AM | Last Updated on Tue, Nov 26 2024 12:58 AM

ప్రజా

ప్రజావాణికి 95 ఫిర్యాదులు

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, డీఆర్డీవో సాయాగౌడ్‌, ఇన్‌చార్జి డీపీవో శ్రీనివాస్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన ఉండాలి

నిజామాబాద్‌ సిటీ : మహిళలు తమపై జరిగే హింసను ఎదిరించాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సివిల్‌ జడ్జి పద్మావతి అన్నారు. ‘మహిళలపై హింస వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మెప్మా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడారు. ప్రతి మహిళా రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవాలన్నారు. హక్కులకు భంగం కలిగినప్పుడు, హింసనుంచి విముక్తి పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి రాజశ్రీ, మెప్మా పీఆర్‌పీ శోభ, మాధురి, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రాజేశ్‌, ట్రైనింగ్‌ కో ఆర్డినేటర్‌ ధర్మేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలను ఆపితే సహించేది లేదు

వేల్పూర్‌: సర్వేలో టీవీ, ఫ్రిడ్జ్‌, ద్విచక్రవాహనం వంటి సాధారణ అంశాలను పరిగణనలోకి తీసుకొని సంక్షేమ పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం వేల్పూర్‌లోని తన ఇంటికి వచ్చిన అధికారులకు.. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ మాట్లాడిన వీడియోను చూపించారు. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎలా సర్వే చేపడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులకు విరుద్ధంగా ఆస్తులు, అంతస్తులు, వాహనాలు, ఇతర స్థిరాస్తుల వివరాలను ఎలా సేకరిస్తారని అధికారులను ప్రశ్నించారు. నాటి సర్వేకు వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పిన తర్వాత వ్యక్తిగత వివరాలు సేకరించాలని ఎమెల్యే డిమాండ్‌ చేశారు. గడువులోగా సర్వే పూర్తి చేయాలనే ఆతృతలో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని, ప్రజలకు న్యాయం దక్కేలా వివరాలు నమోదు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం కుటుంబ వివరాలను సర్వే అధికారులకు తెలిపారు.

డిసెంబర్‌ 4న

జాతీయ సాధన సర్వే

కామారెడ్డి టౌన్‌: జిల్లావ్యాప్తంగా 3, 6, 9 తరగతుల విద్యార్థులకు డిసెంబర్‌ 4న జాతీయ సాధన సర్వే నిర్వహించనున్నట్లు కామారెడ్డి డీఈవో రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వేలో పాల్గొనడానికి జిల్లా వ్యాప్తంగా 150 మంది ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లుగా బీఈడీ, పీజీ చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేశామని పేర్కొన్నారు. వారికి ఈ నెల 26, 27, 28 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే 92 మంది పరిశీలకులను నియమించి వారికి 3 సార్లు మాక్‌ టెస్ట్‌ చేపట్టామన్నారు. జిల్లాలోని పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాఽ ద్యాయులందరూ విద్యా ర్థులను పూర్తిస్థా యిలో సన్నద్ధం చేయాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రజావాణికి 95 ఫిర్యాదులు
1
1/1

ప్రజావాణికి 95 ఫిర్యాదులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement