మహిళ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
కామారెడ్డి క్రైం: ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వారిని హత్య చేసి వారి మెడలో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లడమే వారికి అలవాటు.. గతంలో వారు అనేక కేసుల విషయంలో జైలు జీవితాన్ని గడిపి బయటకి వచ్చినా వారి తీరు మాత్రం మారలేదు. ఈనెల 20న ఓ మహిళను హత్య చేసి ఆమె మెడలో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కంచర్లలో చోటుచేసు కుంది. హత్యకు సంబంధించిన వివరాలను కామారెడ్డి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. భిక్కనూర్ మండలం కంచర్ల శివారులో ఈ నెల 20న మహిళ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ భూమిలో పని చేస్తున్న సుగుణ తలపై దుండగులు కొట్టి హత్య చేసి, ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాన్ని దొంగిలించారు. ఈ కేసులో అల్లెపు మల్లయ్య అనే నిందితుడు ఆత్మహత్య చేసు కుని మృతి చెందగా, నిందితులు నవీన్, ప్రసాద్, సాలవ్వలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితులు బీబీపేట్ మండలం యాడారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. నిందితుల నుంచి బంగారాన్ని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇదే విధంగా గతంలో నిందితులపై పలు కేసులు ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
న్యాయవాదిపై దాడి చేసిన ముగ్గురిపై కేసు..
ఖలీల్‌వాడి: న్యాయవాదిపై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాసిన్ అరాఫత్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రెండోటౌన్ పీఎస్ పరిధిలోని ఖిల్లా ప్రాంతంలో న్యాయవాది ఖాసీంకు చెందిన షెటర్‌ను ముగ్గురు వ్యక్తులు తమకు విక్రయించాలంటు అదే ప్రాంతానికి చెందిన తండ్రి, కొడుకులు ముజఫర్ ఖాన్, హర్షద్‌ఖాన్‌తో పాటు మరొకరు దాడి చేశారు. న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment