కేబినెట్ బెర్త్ కోసం..
నిజామాబాద్
కళాశాలకు కొత్త సొబగులు
మోర్తాడ్ డిగ్రీ కళాశాలకు అదనపు గదుల నిర్మాణం, విద్యా సామగ్రికి పీఎం ఉషా పథ కం కింద రూ.5 కోట్లు మంజూరయ్యాయి.
మంగళవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2024
– 8లో u
మాజీ మంత్రి, సీనియర్ నేత ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో బెర్త్ ఆదిలోనే ఖాయమైంది. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం ఏడాదిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పాలనపై, వివిధ శాఖల్లో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై అంతగా ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి.
మరోవైపు నామినేటెడ్ పదవులు ఆశించే నాయకుల సంఖ్య కూడా బాగానే ఉంది. ఆది నుంచి పార్టీలో ఉంటూ గత పదేళ్లలో అనేక ఇబ్బందులు పడుతూ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన నాయకులు, కార్యకర్తలు తమకు తగిన నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక పార్టీలు మారి ఇతర పార్టీల్లోకి వెళ్లి వచ్చిన నాయకులు సైతం తమకు పదవులు కావాలని అడుగుతుండడంతో పార్టీ మారకుండా, గత ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, సీనియర్ నేత బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్నారు. ఈ క్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి, ఇతర పార్టీ పదవులు ఆశించే వారు సైతం పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
● సుదర్శన్‌రెడ్డికే పదవి ఖాయమైనా అధిష్టానం నిర్ణయంలో ఆలస్యం
● ఇన్‌చార్జి మంత్రి జిల్లాపై ఫోకస్ పెట్టకపోవడంతో పడకేసిన పాలన
● మరోవైపు నామినేటెడ్ పదవుల కోసం నాయకుల ఎదురుచూపులు
● ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనప్పటికీ ఆలస్యం చేయడంపై కినుక
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచింది. జిల్లా నుంచి పదవుల కోసం పలువురు నాయకులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన మంత్రి పదవి జిల్లా నుంచి లేకపోవడంతో పాలన పట్టు తప్పింది. విద్య, వైద్య శాఖలతో పాటు జిల్లా పంచాయతీ, సంక్షేమ శాఖలు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖ, గనుల శాఖ, పౌరసరఫరాల శాఖలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పాలనపై, వివిధ శాఖల్లో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై అంతగా ఫోకస్ చేయడం
లేదు. పాలనపై సమీక్షలు చేసేందు కు సైతం మంత్రి జూపల్లి అంతగా శ్రద్ధ చూపడం లేదు. జూపల్లి జిల్లాకు వచ్చేది కూడా అంతంతమాత్రమే అయింది. దీంతో జిల్లా యంత్రాంగం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే అంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో బోధన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి కేబినెట్ బెర్త్ ఆదిలోనే ఖాయమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు నిర్ణయించారు. కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలవగా, ఇందులో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు మొదటిసారి ఎన్నికై నవారే. దీంతో సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడమనేది అనివార్యం. అనుభవం, సీనియారిటీ దృష్ట్యా చూసినప్పటికీ సుదర్శన్‌రెడ్డికే బెర్త్ కేటాయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణ కోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే కాకుండా, సాధారణ ప్రజలు సైతం ఎదురు చూడాల్సి వస్తోంది. సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే జిల్లా యంత్రాంగం పనితీరుపై నిరంతరం దృష్టి పెట్టి తగిన విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్లొచ్చని ప్రజలు అంటున్నారు. అయితే కేబినెట్ విస్తరణ విషయంలో ఏడాది కాలంగా అదుగో ఇదుగో అంటూ కాలం గడుపుతుండడంతో జిల్లాలో యంత్రాంగాన్ని గాడిలో పెట్టే పరిస్థితి లేకుండా పోయిందని పలువురు అంటున్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment