ఇసుక అక్రమ రవాణాకు చెక్
రెంజల్: ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నట్లు తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. బోధన్ సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో ఇసుక అక్రమ కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శనివారం అర్ధరాత్రి మండలంలోని నీలా, కందకుర్తి గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది, పోలీసులతో తనఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాత్రి సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. నిత్యం రెవెన్యూ, పోలీసు సిబ్బందితో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నట్లు పేర్కొన్నారు.
మూడు ఇసుక లారీల సీజ్
బాల్కొండ: మోర్తాడ్ మండల కేంద్రంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను పట్టుకుని సీజ్ చేసినట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించి పట్టుకున్నామని, సీజ్ చేసిన ఇసుకను మైనింగ్ శాఖకు అప్పగించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
యువతి అదృశ్యం
నస్రుల్లాబాద్: మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు ఏఎస్సై అబీద్ బేగ్ సోమవారం పేర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ యువతి రెండు రోజుల క్రితం కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment