మహిళా హ్యాండ్ బాల్ క్రీడాకారులకు శిక్షణ
ఆర్మూర్: పట్టణంలోని మినీస్టేడియంలో 46వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ మహిళా హ్యాండ్‌బాల్ క్రీడా పోటీలకు ఎంపికై న ఉమ్మడి జిల్లా జట్టుకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించినట్లు జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు గంగామోహన్ చక్రు సోమవారం తెలిపారు. ఈనెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు ఆర్మూర్‌లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీలకు ఎంపికై న ఉమ్మడి జిల్లా జట్టుకు శిక్షణ ప్రారంభించినట్లు తెలిపారు. క్రీడాకారులు ప్రతిభ కనబర్చి జిల్లా జట్టును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ అధికారి సౌడా సురేశ్, ప్రధానకార్యదర్శి పింజ సురేందర్, కోశాధికారి రాజేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు నాగేశ్, రమనణ, శ్యామ్, నరేందర్, సునీత, మాధురి, క్రీడాకారులు పాల్గొన్నారు.
మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం
● డీఐఈవో రవికుమార్
నిజామాబాద్‌నాగారం: మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ పేర్కొన్నారు. మేరా యువభారత్, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సోమవారం సుభాష్‌నగర్‌లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో వివిధ కళాశాలలకు చెందిన 14 బృందాలు పాల్గొన్నాయి. కార్యాక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. భవిష్యత్తులో డివిజన్ స్థాయిలో కూడా మరిన్ని పోటీ లు నిర్వహించి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని సూ చించారు. పోటీల్లో గెలుపొందిన బృందాలకు బహుమతులు అందజేశారు. పోటీలలో పాల్గొ న్న వారికి ప్రశంసాపత్రాలు, మేరా యువభారత్ అందించిన నూతన డైరీలను అందజేశారు. కార్యక్రమంలో ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీస ర్ ధర్మానాయక్, పోటీల నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్, కళాశాలల, నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
సీఎస్పీ నిర్వాహకుడి చేతివాటం?
కోటగిరి: మండల కేంద్రంలో ఓ బ్యాంకుకు చెందిన కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకు డు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. సెంటర్‌కు వచ్చే ఖాతాదారులకు తెలియకుండా అ దనంగా డబ్బులు డ్రా చేసి సీఎస్పీ నిర్వాహ కుడు తన సొంతానికి వాడుకుంటున్నట్లు స మాచారం. కొన్ని రోజులుగా డ్రా చేయకుండా నే ఖాతాలోని డబ్బులు తగ్గిపోవడం గుర్తించిన బాధితులు బ్యాంకులో ఆరా తీయగా సీఎస్పీ నిర్వాహకుని నిర్వాకంగా తెలిసింది. దీంతో సదరు వ్యక్తి ఖాతాదారులను బ్రతిమిలాడి త్వరలోనే డబ్బులు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment