ఖలీల్వాడి: నగరంలోని నాందేవ్వాడకి చెందిన మంత్రి రూపేశ్ యాసిడ్ తాగడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై మహేశ్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నాందేవ్వాడకు చెందిన రూపేశ్కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా అతను మద్యానికి బానిస కావడంతో భార్య వదిలి వెళ్లిపోయింది. దీంతో జీవితంపై విరక్తితో ఆదివారం యాసిడ్ తాగాడు.
గమనించిన తల్లి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి తల్లి మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment