మొరం తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు
రెంజల్: మండలంలోని నీలా చెరువులో మొరం తవ్వకాలను స్థానికులు సోమవారం అడ్డుకున్నారు. రెండు రోజులుగా చెరువులో మొరం తవ్వుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో తవ్వకాలను నిలిపివేసినట్లు తెలిపారు. టిప్పర్లు, జేసీబీలను నిలిపివేసి అధికారులు వచ్చే వరకు కదలనిచ్చేది లేదని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, ఇరిగేషన్ ఏఈ గబ్బర్‌సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ప్రభుత్వ పనులకు మొరం తవ్వకాలను అనుమతించినట్లు తహసీల్దార్ స్థానికులకు వివరించారు. అక్రమంగా పరిమితికి మించి తవ్వుతున్నారని స్థానికులు వివరించగా అక్కడ తవ్వకాలను నిలిపి వేయించి కందకుర్తికి తరలించారు. ప్రభుత్వం వ్యవసాయ రోడ్లకు నిధులు మంజూరు చేయడంతో మొరం పనులకు జిల్లా అధికారుల అనుమతి తీసుకున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment