జాతీయస్థాయికి ఎంపిక
వేల్పూర్: మండలంలోని పచ్చలనడ్కుడ హైస్కూల్ విద్యార్థినులు జి.వాగ్దేవి, కే.మధుశ్రీ జాతీయస్థాయి ఉషు పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం జైడి రమేశ్ బుధవారం తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో ముప్కాల్ ఇండోర్ స్టేడి యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఇద్ద రు ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించారన్నారు. పంజాబ్‌లో డిసెంబరు 1 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారిణులను హెచ్‌ఎంతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.
క్షత్రియ ఇంజినీరింగ్
కళాశాలకు న్యాక్ గుర్తింపు
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం చేపూర్ క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలకు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ నుంచి ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు లభించినట్లు క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్‌కే పాండే మార్గదర్శకత్వంలో అధ్యాపకులు, సిబ్బంది, పరిపాలన బృందం సమష్టి కృషితో కళాశాలకు న్యాక్ గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. సమావేశంలో విద్యా సంస్థల వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు.
స్వధార్ హోమ్
నుంచి మహిళ పరారీ
ఖలీల్‌వాడి: నగరంలోని మూడో టౌన్ పరిధిలో ఉన్న స్వధార్ హోమ్ నుంచి ఓ మహిళ పరారైనట్లు ఎస్సై మహేశ్ మంగళవారం తెలిపారు. గత ఏడు నెలల క్రితం రుద్రూర్ గ్రామానికి చెందిన ఫర్హానా (35)ను షెల్టర్ నిమిత్తం సఖి సెంటర్ వారు స్వధార్ హోమ్‌కి పంపించారన్నారు. ఈనెల 26న రాత్రి 10:30 గంటలకి స్వధార్ హోమ్‌లో భోజనం చేసి పడుకున్న ఫర్హానా మధ్యరాత్రి వేళలో బయటికి వెళ్లిపోయిందన్నారు. స్వధార్ హోమ్ కౌన్సిలర్ పంతకాల అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: క్రిస్మస్ పండుగ సందర్భంగా సామాజిక, విద్య, వైద్యం, సాహిత్యం, కళ లు, క్రీడా రంగాల్లో ఉత్తమ సేవ అందించిన, ప్రతిభ కనబర్చిన 30 ఏళ్లు పైబడిన క్రైస్తవ వ్యక్తులు, సంస్థలను ఎంపిక చేసి ప్రభుత్వపరంగా సత్కరించనున్నట్టు అదనపు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు కలెక్టరేట్‌లోని మైనారిటీ సంక్షేమ కార్యాలయం 222 నంబర్ గదిలో తమ నామినేషన్లను డిసెంబర్ 5లోగా అందజేయాలని సూచించారు. లేదా తె లంగాణ క్రైస్తవ ఫైనాన్స్ కార్పొరేషన్ సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment