కామారెడ్డి క్రైం: అద్దె డబ్బులు చెల్లించాలని అడిగితే బెదిరింపులకు పాల్పడిన ఐదుగురిపై కామారెడ్డి పట్టణ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్సై బాల్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్డులో ఉన్న ఓ భవనాన్ని 11 నెలల అగ్రిమెంట్‌కు పట్టణానికి చెందిన వినోద్ శర్మ, ముజీబ్, శ్రీనివాస్, లక్ష్మణ్, పి.శ్రీనివాస్ కలిసి లీజుకు తీసుకుని జస్ట్ ఫర్ యూ పేరుతో దుకాణం నడుపుతున్నారు. అయితే వారు 8 నెలలుగా ఇంటి అద్దె చెల్లించడంలేదు. సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్‌లో నివాసం ఉండే ఇంటి యజమాని రాజశేఖర్‌రెడ్డి.. అద్దె వసూలు చేయడానికి ఇటీవల కామారెడ్డికి వచ్చాడు. దుకాణంలోకి వెళ్లి అద్దె ఇవ్వాలని అడుగ్గా షాప్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులు కలిసి రాజశేఖర్‌రెడ్డిని అసభ్యకరంగా దూషించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో రాజశేఖర్‌రెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment