ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకు లాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామంటున్న ఉన్నతాధికారులు బినామీ పేర్లతో భోజన ఏజెన్సీలు నిర్వహిస్తున్న వారిపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
● నగరంలో ఓ వ్యక్తి తనతోపాటు తన బంధువు ల పేర్లపై మొత్తం 23 మధ్యాహ్న భోజన ఏజెన్సీలను దక్కించుకుని ఏళ్లుగా రాజ్యమేలుతున్నాడు. సదరు వ్యక్తి నిర్వహిస్తున్న ఏజెన్సీల పరిధిలో రూ.7కోట్ల 62లక్షల అవినీతి బట్టబయలైంది. దీంతో నాటి ప్రజాప్రతినిధులు ఏజెన్సీ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అప్పటి మంత్రి సహకారంతో తప్పించుకున్న స దరు వ్యక్తి 23 ఏళ్లుగా బినామీ పేర్లతో ఏజెన్సీల ను నిర్వహిస్తున్నాడు. తనకు రాజకీయ అండదండలున్నాయని హెచ్‌ఎంలనే బెదిరించడం గమనార్హం.
● ఓ మాజీ కార్పోరేటర్ నగరంలోని 345 మంది విద్యార్థులు ఉన్న హై స్కూల్ మధ్యాహ్న భోజన ఏజెన్సీని నడుపుతున్నాడు. గతంలో అనేక ఆరోపణలు రాగా, అప్పటి డీఈవో లింగయ్య రెండు సార్లు ఏజెన్సీ రద్దు చేశారు. ప్రస్తుతం అతగాడే కొనసాగుతుండడం భోజన ఏజెన్సీ నిర్వహణలో లోపాలను ఎత్తిచూపుతోంది.
● మాజీ డిప్యూటి మేయర్ ఒకరు మూడు పాఠశాలల మధ్యాహ్న భోజన ఏజెన్సీలను పొందాడు. ఒకేచోట వంట చేసి ఆయా పాఠశాలలకు పంపిస్తున్నా పట్టించుకునేవారు లేరు. భోజనం నాణ్యతపై హెచ్‌ఎం ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
● నిజామాబాద్ అర్బన్‌లో వివిధ పార్టీలకు చెందిన 35 మంది మధ్యాహ్న భోజన ఏజెన్సీలను నిర్వహిస్తుండగా, వీరిలో 22 మంది వరకు గతంలో అధికారంలో ఉన్న ప్రధాన పార్టీకి చెందిన వారున్నారు. ఇందులో 8 మంది మాజీ కార్పొరేటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment