సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లించాలి
డిచ్‌పల్లి(నిజామాబాద్ రూరల్): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేలా వెంటవెంటనే టాబ్ ఎంట్రీ చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. వివరాల నమోదులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. మండలంలోని రాంపూర్‌లో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ట్రక్ షీట్లను తెప్పించుకోవడంలో, టాబ్ ఎంట్రీలు చేయడంలో జరుగుతున్న జాప్యా న్ని గుర్తించిన కలెక్టర్ కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఖాతాల్లో 48 గంటల్లో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని నిలదీశారు. కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలు తరలించిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ రైస్ మిల్లుల వద్ద తరుగు పేరిట కోతలు విధించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ధాన్యం తరలించిన రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ వెంటనే బిల్లుల చెల్లింపులు జరిగేలా చూస్తామని అన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ప్రభాకర్ తదితరులున్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనం తయారు చేసి విద్యార్థులకు అందించా లని కలెక్టర్ రాజీవ్ గాంధీ హ నుమంతు ఆదేశించారు. రాంపూర్‌లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గు రుకుల పాఠశాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ ను పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన సన్నబి య్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కూరగాయలు, ఆహార పదార్థాలను ఎక్కడ పడి తే అక్కడ నేలపై ఉంచకుండా స్టీల్ డబ్బాలలో భద్రపర్చాలని, వాటిపై తప్పనిసరిగా మూతలు బిగించాలని, ఏ దశలోనూ ఆహారం కలు షితం కాకుండా అప్రమత్తతో వ్యవహరించాలని ఆ దేశించారు. భోజనం వండటానికి ముందే ఆహార పదార్థా నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, కాలం చెల్లిన పదార్థాలు వినియోగించకూడదని హెచ్చరించారు. నాసిరకం బియ్యం, నూనె, ఇతర సరు కులు సరఫరా అయితే వెంటనే తహసీల్దార్ దృష్టికి తేవాలన్నారు.
ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
ట్రక్ షీట్లు, ట్యాబ్ ఎంట్రీల నమోదులో జాప్యంపై ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment