అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. అమెరికా వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు అధ్యక్షుడు జో బైడెన్. పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీ చేరుకున్న ప్రధాని మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు.. ఓ వైపు వర్షం పడుతున్నా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు దేశాల జాతీయ గీతాలాపన నిర్వహించారు. మోదీ రాక కోసం వైట్ హౌస్ వద్ద ఎదురు చూస్తోన్న వందలాది మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ- బైడెన్ క్లుప్తంగా ప్రసంగించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైట్‌హౌస్ సౌత్‌లాన్‌లో వేడుక సందర్బంగా ఎన్నారైలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పాస్‌లు ఉన్నవారిని అనుమతించారు. అమెరికా తెలుగు సంఘం సంఘం నాయకులు ప్రదీప్ కట్ట, విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల, రఘువీరారెడ్డి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మధుకర్ రెడ్డి, సుధాకర్ గట్టు, తెలంగాణ డెవలపర్ ఫోరం మాజీ అధ్యక్షుడు మురళీ చింతలపాణి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, రాజేందర్ రావు, భీమా పెంట, ఆదిత్య రాయుడు, కేఎస్‌ఎన్ రాజు, రామకృష్ణ, పృద్వీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
(చదవండి: అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే)
Comments
Please login to add a commentAdd a comment