అధిక లోడుతో హైదరాబాద్‌కు..
ఇసుక రీచ్‌లో యంత్రాలతో ఇసుక తవ్వి భారీ లారీల్లో లోడు చేస్తున్నారు. పెద్ద పెద్ద టిప్పర్లలో పరిమితికి మించి ఇసుకను లోడు చేయడంతోపాటు ఇతర రాష్ట్రాలకు ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఇసుకను రవాణా చేస్తున్నారు. 20 టన్నులకు బిల్లు తీసుకొని లారీల్లో 40 టన్నుల మేర తరలిస్తున్నారు. చందర్లపాడు మండలం ఉస్తేపల్లి ర్యాంపు నుంచి ఇసుక లారీలు కాసబాద గ్రామం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. చందర్లపాడు మండలం కాసరబాదలో రీచ్ నిర్వాహకులు, అధికార పార్టీ నాయకులు రోజుకు 100కుపైగా పెద్ద పెద్ద లారీలతో ఇసుకను తరలిస్తున్నారు. రీచ్ నుంచి నందిగామ వరకు రోడ్లు ఇరుకుగా ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో స్థానికులు ఇసుక లారీలు, టిప్పర్లను అడ్డగించి రోడ్డుపై బైఠాయిస్తున్నారు. మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖల అదికారులు పట్టించుకోవటంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment