చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ స్థాయిలో కృష్ణా జిల్లా కేంద్ర బ్యాంకుకు ఉత్తమ అవార్డు లభించింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (నాప్కాబ్) 60 వసంతాల ఉత్సవాల్లో భాగంగా ప్రతిభ కనబరిచిన, ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించిన, మంచి టర్నోవర్ సాధించిన సహకార కేంద్ర బ్యాంకులకు అవార్డులను ప్రదానం చేశారు. ఉత్తమ సేవలతో పాటు రూ.11,300 కోట్లు టర్నోవర్ సాధించిన రెండో బ్యాంకుగా కేడీసీసీబీని గుర్తించి అవార్డు అందజేశారు. కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్షా చేతుల మీదుగా బ్యాంకు పర్సన్ ఇన్చార్జ్, కృష్ణా జిల్లా జేసీ గీతాంజలిశర్మ, బ్యాంక్ సీఈఓ ఎ.శ్యామ్మనోహర్కు అవార్డు అందజేశారు. ఈ కార్య క్రమం న్యూఢిల్లీలో మంగళవారం రాత్రి జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment