మూడు నెలలుగా మూత
కరోనా తర్వాత ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. వ్యాయామం కోసం జిమ్‌కు వెళ్లాలంటే ఖర్చుతో కూడిన పని. గత ప్రభుత్వం కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకర వాతావరణంలో రివర్ ఫ్రంట్ పార్కును ఏర్పాటు చేసి అందులో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ నిర్మించింది. అప్పటి నుంచి ఉదయం సాయంత్రం వేళల్లో పార్కుకు వెళ్లి వ్యాయామం చేసే వాళ్లం. అయితే మూడు నెలలుగా పార్కు మూసే ఉంటోంది. ఎప్పుడు తెరుస్తారో తెలియడం లేదు. త్వరగా పునః ప్రారంభించాలని కోరుతున్నా.
– భాను లక్ష్మీనారాయణ, కృష్ణలంక, విజయవాడ
●
Comments
Please login to add a commentAdd a comment