ముగిసిన జేఎన్టీయూ అంతర్ కళాశాలల ఖోఖో పోటీలు
కేతనకొండ(ఇబ్రహీంపట్నం): స్థానిక ఆర్కే కళా శాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న జేఎన్టీయూ అంతర్ కళాశాల ఖోఖో పోటీలు సోమవారం ముగిశాయి. గుడ్లవల్లేరు ఎస్సార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల, కంచికచర్ల మిక్ కళాశాలల మధ్య తుది పోరు జరిగింది. ఎస్సార్ కళాశాల విన్నర్ టైటిల్ దక్కించుకోగా మిక్ కాలేజీ క్రీడాకారులు రన్నర్స్‌గా నిలిచారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో యూనివర్సిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి శ్యామ్ కుమార్ యూనివర్సిటీ తుది జట్టు ఎంపిక చేశారు. ప్రిన్సిపాల్ కె.రామకృష్ణయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని చాటారని కొనియాడారు. విన్నర్స్, రన్నర్స్‌కు బహుమతులు ప్రదానం చేశారు. కళాశాల పీడీలు వి.వి.మురళి, శివశంకర్, మల్లికార్జున్ సింగ్ పాల్గొన్నారు.
27న వాలీబాల్ రాష్ట్ర జట్ల ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: జాతీయ వాలీబాల్ సీని యర్ సీ్త్ర, పురుషుల పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఈనెల 27వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎంపిక చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ డీఎస్‌డీవో ఎస్.ఎ.అజీజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆదేశాల మేరకు ఈ జట్లను ఎంపిక చేస్తున్నామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 27వతేదీ ఉదయం ఏడు గంటలకు ఆధార్, నివాస ధ్రువీకరణ పత్రం, పది పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో స్టేడియంలోని వాలీబాల్ కోర్టు వద్ద సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులు జనవరి ఏడు నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు.
క్రీస్తు మార్గం అనుసరణీయం
చిలకలపూడి(మచిలీపట్నం): ఏసుక్రీస్తు చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరణీయ మని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశపు హాలులో సోమవారం సెమీక్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి గీతాంజలిశర్మ మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు చేసిన శక్తివంతమైన త్యాగం, కరుణ ద్వారా దైవిక సహాయం పొందగలమన్నారు. అనంతరం క్రిస్మస్ గేయాలను ఆలపించారు. ఈ వేడుకల్లో కేక్ కట్ చేయటంతో పాటు క్యాడిల్‌లైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు పాస్టర్లు క్రీస్తు మార్గాలను చేసిన సేవలపై సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ రబ్బానీ, పాస్టర్లు కరుణకుమార్, అప్పికట్ల జాషువా, సుదర్శన్ మోజెస్, సుకుమార్ పాల్గొన్నారు.
పకడ్బందీగా యువకెరటాలు
చిలకలపూడి(మచిలీపట్నం): యువతలో సృజనాత్మకత వెలికితీసి వారికి విజ్ఞానం, వినోదం అందించేలా యువకెరటాలు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో యువకెరటాలు కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సోమ వారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి మూడు, నాలుగు తేదీల్లో హిందూ కళాశాలలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. తొలి రోజు పాఠశాల విద్యార్థులు, రెండో రోజు కళాశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించాలని సూచించారు. వ్యాస రచన, వక్తృత్వం, చిత్ర లేఖనం, క్విజ్, బృంద గేయాలు, నృత్య పోటీలు ఏర్పాటు చేయాలని, పోలీస్‌శాఖ ద్వారా ఆయుధ ప్రదర్శన, ఇస్రో, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, విపత్తు నిర్వహణ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ వంటి అంశాల్లో అవగాహన కల్పించేలా స్టాళ్లు, ఏర్పాట్లు చేయా లని ఆదేశించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గ్రౌండ్ సిద్ధం చేయటంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలన్నారు. దూరంగా ఉన్న పాఠశాల, కళాశాలల విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై కమిటీ సభ్యులను నియమించాలని డీఈఓకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఏఎస్పీ వి.వి. నాయుడు, బందరు ఆర్డీఓ కె.స్వాతి, మెప్మా పీడీ పి.సాయిబాబు, డీఈఓ జె.వి.జె.రామా రావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment