పుస్తక మహోత్సవం పోస్టర్ల ఆవిష్కరణ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ప్రాంగణంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి రెండు నుంచి 12వ తేదీ వరకు జరగనున్న 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్ పోస్టర్లను సంస్థ గౌరవాధ్యక్షుడు బెల్లపు బాబ్జీ తదితరులతో కలిసి అధ్యక్ష కార్యదర్శులు కె.లక్ష్మయ్య, టి.మనోహర్‌నాయుడు సోమవారం ఆవిష్కరించారు. బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యాల యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మయ్య, మనోహర్‌నాయుడు మాట్లాడుతూ.. 34 సంవ త్సరాలుగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి సారిగా ఇందిరాగాంధీ కార్పారేషన్ స్టేడియంలో సుమారు 200 స్టాళ్లతో నిర్వహించనున్నా మని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుక్ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తారని, అనంతరం జరిగే సభకు సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ ఏడాది పుస్తక మహోత్సవ ప్రాంగణానికి సాహితీ నవజీవన్ లింక్స్ అధినేత పిడికిటి రామకోటేశ్వరరావు పేరు పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆరుద్ర, దాశరధి కృష్ణమాచార్యులు, నాజర్ (బుర్రకథ పితామహుడు), నార్ల చిరంజీవి, ఆలూరి బైరాగి, ఎన్.నటరాజన్ (శారద), సినీ నటి భానుమతి తదితరుల శతజయంతి సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజూ నాకు నచ్చిన పుస్తకం, నన్ను ప్రభావితం చేసిన పుస్తకం అంశంపై ఓపెన్ డయాస్‌పై సందర్శకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తు న్నామన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు జె.పి.ప్రసాద్, సహాయ కార్యదర్శి కె.రవి, కోశాధికారి జి.లక్ష్మి, సాహిత్య కార్యక్రమాల సమన్వయకర్త గోళ్ల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment